For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధృడమైన జుట్టును పొందేందుకు సహాయపడే కర్పూరం

|

కర్పూరం ఆయుర్వేద సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కానీ ఇక్కడ మనం ధృడమైన, నునుపైన జుట్టును పొందేందుకు కర్పూరాన్ని ఉపయోగించడం గురించి తెలుసుకుందాం. సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. ఈ ఆలోచనలో భాగంగానే, మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల ఉత్పత్తులతో ప్రయోగాలను చేస్తుంటాం. ఫలితంగా, మరింత జుట్టును నాశనం చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. కావున జుట్టు విషయంలో రసాయన పదార్ధాల మీద ఆధారపడే బదులు, గృహ చిట్కాలను అనుసరించడం మేలని మన పెద్దలు సూచిస్తుంటారు కూడా.

How To Use Camphor For Strong Hair?

కర్పూరం :

మీరు ఇతర రెడీమేడ్ ఉత్పత్తులను ప్రయత్నించే ముందుగా, మీ జుట్టు మీద కర్పూరం ఉపయోగించి ప్రయత్నించి చూసి ఫలితాలను చూసి, నిర్ధారించుకోండి. ఇంట్లోనే సులభంగా, కర్పూరం మరియు కర్పూరం నూనెను తరచుగా ఉపయోగించడం మూలంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక్కడ వీటి వినియోగంతో జుట్టు సమస్యల నివారణకు దోహదం చేయగల రెమిడీలను పొందుపరచడం జరిగినది.

కర్పూరం నూనె మరియు గుడ్డు :

కర్పూరం నూనె మరియు గుడ్డు :

జుట్టు నష్టం అనేది, కాలుష్యం మరియు పోషకాలు సరైన పాళ్ళలో శరీరానికి అందకపోవడం మూలంగా సంభవిస్తుంది. చికిత్సలో భాగంగా, ఒక గుడ్డును పగలకొట్టి, ఒక గిన్నెలోనికి తీసుకోండి. దానిలో కొన్ని చుక్కల కర్పూరం నూనెను వేసి, మృదువుగా నురుగు వచ్చేలా బ్లెండ్ చేయండి. జుట్టు యొక్క మూలాల నుండి మీ జుట్టు పూర్తిగా కప్పబడేలా ఈ మిశ్రమాన్ని వర్తించండి. నుదురు భాగాలకు జిడ్డు చేరకుండా, గుడ్డు వాసనకు దూరంగా ఉండే క్రమంలో భాగంగా షవర్ క్యాప్ ను మీ జుట్టుపై కప్పి ఉంచండి. 20 నుండి 30 నిమిషాల తర్వాత, ఒక తేలికపాటి సల్ఫేట్ షాంపూ లేదా, ఇతర సాధారణ ఆర్గానిక్ షాంపూల సహాయంతో జుట్టును శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం కనీసం వారంలో రెండు మార్లు అనుసరించండి.

కర్పూరం నూనె మరియు కొబ్బరి నూనె :

కర్పూరం నూనె మరియు కొబ్బరి నూనె :

కర్పూరం నూనెను, క్రమం తప్పకుండా ఉపయోగించినట్లయితే, జుట్టు పునరుజ్జీవనానికి ఎంతగానో సహాయపడుతుందని చెప్పబడింది. ఈ రెమిడీ ప్రకారం, కర్పూరం నూనె మరియు కొబ్బరి నూనెను సమాన పాళ్ళలో కలిపి, మీ జుట్టుపై కొన్ని నిమిషాల పాటు, మీ చేతివేళ్ళతో సున్నితముగా మసాజ్ చేయండి. తర్వాత, 20 నిముషాల పాటు అలాగే ఉండనిచ్చిన తర్వాత, దానిని సాధారణ నీటితో శుభ్రపరచండి. ఈ రెమిడీ, మీ జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుంది.

Most Read: దీపావళి పండుగను జరుపుకోవడానికి 10 ముఖ్య కారణాలు

కర్పూరం నూనె మరియు ఎసెన్షియల్ ఆయిల్ :

కర్పూరం నూనె మరియు ఎసెన్షియల్ ఆయిల్ :

మార్కెట్లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్లతో కూడిన ఎసెన్షియల్ నూనెలను ( లావెండర్, రోజ్మేరీ) కర్పూరం నూనెతో కలిపి జుట్టుకు పట్టించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరని చెప్పబడింది. ఒక గిన్నెలో, ఒక టేబుల్ స్పూన్ కర్పూరం నూనెను, ఒక టేబుల్ స్పూన్ ఎసెన్షియల్ నూనెతో కలపండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ యోగర్ట్ కలిపి బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు మీద కుదుళ్ళ నుండి పూర్తి స్థాయిలో జుట్టుకు పట్టించి, 30 నిముషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత సాధారణ నీటితో మీరు దానిని శుభ్రపరచవచ్చు.

కర్పూరం బిళ్ళలు :

కర్పూరం బిళ్ళలు :

మీరు పొడి చర్మం కలిగి, తరచుగా దురద సమస్యలతో భాదపడుతున్న ఎడల మీకు సూచించదగిన ఉత్తమ నివారణగా ఈ రెమిడీ ఉంటుంది. ఇది కూడా చర్మాన్ని చల్లబరుస్తుంది మరియు అంటువ్యాధుల బారినుండి కాపాడగలదు కూడా. 3 నుండి 4 కర్పూరం బిళ్ళలు తీసుకుని, వాటిని పొడిగా చేయండి. ప్రభావిత ప్రాంతాలలో ఈ పొడిని వర్తించండి. కొంత సమయం వరకు అలాగే వదిలివేయండి. ఆపై సాధారణ నీటితో ఈ శుభ్రం చేయండి.

Most Read: నా భార్య బలవంతంగా శృంగారం చేయించుకుంటుంది, బెడ్రూమ్ లోనే లేపేస్తాను అంది

కర్పూరం మరియు మందార పువ్వులు :

కర్పూరం మరియు మందార పువ్వులు :

మందార పువ్వులలోని సౌందర్య ప్రయోజనాల గురించి వేరే చెప్పనవసరం లేదు. జుట్టు సంరక్షణ అంటే, భారతీయులకు ఎక్కువగా గుర్తొచ్చే మొట్టమొదటి చిట్కా మందార పువ్వు. ఈ రెమిడీ ప్రతిరోజూ ఉపయోగించిన పక్షంలో జుట్టు దృడంగా తయారవడమే కాకుండా, నునుపుగా తయారవుతుంది కూడా. ఈ రెమిడీకి మీకు కావలసినదల్లా కొబ్బరి నూనె, మందార పువ్వు మరియు కర్పూరం. ఒక పాత్రలో కొబ్బరి నూనె మరియు మందార పువ్వులను తీసుకుని వేడి చేయండి. మరియు దానిలో కొన్ని కర్పూరం బిళ్ళలను చేర్చండి మరియు పూర్తిగా కరిగే వరకు కలియబెట్టండి. ఈ నూనెను మీ జుట్టు మరియు స్కాల్ప్ ప్రభావిత ప్రాంతాలలో రాసి సున్నితంగా మర్దన చేసి, కనీసం గంట సేపు అలాగే వదిలివేయండి. తర్వాత తేలికపాటి షాంపూ వినియోగించి, శుభ్రపరచండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Use Camphor For Strong Hair?

Camphor is widely used in ayurvedic beauty products. But here we'll be talking about using camphor for stronger hair. Long and healthy hair is something that we all wish to have. You can use camphor oil, egg, coconut oil, etc., can help you to get stronger hair.
Story first published: Wednesday, November 7, 2018, 15:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more