For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేశ సంరక్షణకై కరివేపాకును ఏ విధంగా వినియోగించవచ్చు?

|

ప్రతిరోజు వంట చేసేటప్పుడు మనం ఖచ్చితంగా కరివేపాకును వాడతాం. ఇది మన వంటకు మంచి రుచి మరియు సువాసన చేకూరుస్తుంది.మన పూర్వీకులు కరివేపాకులోని అద్భుతమైన ఔషధ గుణాలను పసిగట్టి, వాటిని అందం మరియు ఆరోగ్యం పెంచుకోవడానికి వాడటం మొదలుపెట్టారు.

మన దైనందిన ఆహారంలో కరివేపాకును భాగం చేసుజీవడం వలన చిన్న ప్రేగు పనితీరును మెరుగు పరుచుకోవడం దగ్గర నుండి క్యాన్సర్ ను నివారించడం వరకు వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మధ్య కరివేపాకును సౌందర్య పోషణకై వినియోగించడం కూడా మొదలుపెట్టారు. వివిధ చర్మ సంరక్షణ మరియు కేశ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో దీనిని వినియోగిస్తున్నారు.

జుట్టు ఎదుగుదలకై కరివేపాకు: దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం లేదా నూనె / హెయిర్ మాస్క్ గా జుట్టుకు రాసుకోవడం వలన, జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు రాలడానికి కారణమైన చుండ్రు, జిడ్డు, దురద మొదలైన సమస్యలకు ఏకైక సమాధానంగా పనిచేస్తుంది.

కరివేపాకు ఏ విధంగా మన శిరోజ సౌందర్య పోషణకై ఉపయోగపడతాయో, దానికై వాటిని ఎలా వినియోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం

కరివేపాకు ఏ విధంగా కేశసౌందర్య పోషణకు తోడ్పడుతుంది?

కరివేపాకు ఏ విధంగా కేశసౌందర్య పోషణకు తోడ్పడుతుంది?

1. కరివేపాకులో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మాడును తేమగా ఉంచడం వలన మృత కేశాలు ఏర్పడవు.

2. కరివేపాకులోని అమైనో ఆమ్లాలు కేశాలను ధృడపరచి, తెగిపోకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.

3. ప్రోటీన్లు మరియు బీటా కేరోటీన్ అధికంగా ఉండటంతో జుట్టు రాలడాన్ని అరికట్టి పలుచబడనివ్వదు.

4. కరివేపాకును శిరోజ తైలాలతో కలిపి వాడితే, కురులకు పోషణ అందించటమే కాక కండీషనర్ గా కూడా పని చేస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది.

5.రసాయన చికిత్సలు మరియు కాలుష్యం జుట్టును తీవ్రంగా నష్టపరుస్తాయి. కరివేపాకులో వివిధ రకాల అత్యవసర పోషకాలు ఉండటం వలన, జుట్టు యొక్క కుదుళ్లను ధృఢంగా చేస్తాయి.

6. కరివేపాకు లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు పీచుపదార్ధం మాత్రమే కాక ఐరన్, కాల్షియం, విటమిన్ సి మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా ఉండటం మూలాన శిరోజాలు ధృడపడతాయి. విటమిన్ బి6 అధికంగా ఉండటంతో హార్మోన్లను నియంత్రించి,జుట్టు కుదుళ్లను మరియు కేశాన్ని శక్తివంతంగా చేసి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

కేశ సంరక్షణ మరియు ఎదుగుదలకు కరివేపాకును వాడే విధానం:

కేశ సంరక్షణ మరియు ఎదుగుదలకు కరివేపాకును వాడే విధానం:

కరివేపాకును కేశ సంరక్షణకై నూనె రూపంలో, హెయిర్ మాస్క్ గా, హెయిర్ టానిక్ గానే కాక మన ఆహారంలో భాగంగా కూడా తీసుకోవచ్చు. ఉత్తమ ఫలితాలకు తాజా ఆకులను వాడాలి

ఎక్కువగా కరివేపాకు లభించినప్పుడు ఫ్రిజ్ లో భద్రపరచుకుని తరువాత వాడుకోవచ్చు, కానీ బయట ఉంచరాదు. అలా బయట వదిలేస్తే ఆకులు సువాసన మరియు పోషకాలు కోల్పోతాయి.

కేశాలకు నూనెగా:

కావలసిన పదార్థాలు:

. గుప్పెట నిండా కరివేపాకు

. రెండు- మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె

తయారీ విధానం:

1. ఇక బాణలిలో కొబ్బరినూనె వేసి, దానిలో కరివేపాకు వేయండి.

2. ఆకులన్ని నల్లగా మాడిపోయే వరకు వేడిచేయండి.

3. స్టవ్ ఆపేసి నూనె మిశ్రమాన్ని చల్లారనివ్వండి.

4. ఇప్పుడు నూనెను వడగట్టి ఒక సీసాలో పోసి భద్రపరచండి.

వాడే విధానం:

వాడే విధానం:

. మాడుకు నూనె రాసుకుని మునివేళ్ళతో మృదువుగా వలయాకారంలో మర్దన చేసుకోవాలి.

. కుదుళ్ళు మరియు చివర్లకు బాగా పట్టేటట్లు రాసుకోవాలి.

. గంటసేపు ఆరనిచ్చి షాంపూతో కడిగేయాలి.

. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు రాసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నెల రోజులలో తేడాను గమనించవచ్చు. క్రమం తప్పకుండా నూనెతో మర్దన చేస్తూ ఉంటే మాడు ఉత్తేజితమై జుట్టు త్వరగా పెరుగుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఇది ఎలా పనిచేస్తుంది?

కొబ్బరినూనెకు మాడులోకి చొచ్చుకునిపోయి జుట్టుకు తేమను, పోషణను అందిస్తుంది. దీనికి కరివేపాకులోని పోషకాలు కూడా కలిస్తే , ప్రత్యేకంగా బి6 కలవడం వలన కుదుళ్ళు, కేశాలు గట్టిపడి , జుట్టు రాలడం ఆగిపోతుంది.

హెయిర్ మాస్కుగా:

కావలసిన పదార్థాలు:

• గుప్పెడు కరివేపాకు

• గుప్పెడు వేపాకు

• 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు

తయారీ విధానం:

తయారీ విధానం:

1.కరివేపాకు, వేపాకులను కలిపి బ్లెండ్ చేసి చిక్కని పేస్టుగా చేయాలి.

2. మీ జుట్టు పొడుగును అనుసరించి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కలపండి.

3. అన్ని పదార్ధాలను బాగా కలిపి మృదువైన పేస్టుగా చేసుకోవాలి

వాడే విధానం:

వాడే విధానం:

1. ఈ మాస్కును మాడుకు పూసుకుని వలయాకారంలో వేళ్ళను కదుపుతూ మృదువుగా మర్దన చేసుకోవాలి.

2. మర్దన చేసుకునేటప్పుడు, జుట్టు మొదలు నుండి చివర్ల వరకు బాగా పట్టేటట్టు చేసుకోవాలి.

3. 15 నుండి 20 నిమిషాల పాటు బాగా ఆరేంత వరకు వదిలేయండి.

4. తరువాత షాంపూతో కడిగేసుకోండి.

చిట్కా: పెరుగు బదులు రెండు టేబుల్ స్పూన్ల పాలను కూడా వాడవచ్చు.

ఈ మిశ్రమం ఎలా పనిచేస్తుంది?

ఈ మిశ్రమం ఎలా పనిచేస్తుంది?

పెరుగు మంచి క్లెన్సర్ గా పని చేసి, మాడుకు తేమను అందిస్తుంది. పెరుగు చుండ్రును మరియు మృతకణాలను తొలగించి, మాడును మృదువుగా, తాజాగా మారుస్తుంది. కరివేపాకు జుట్టుకు కావలసిన పోషణను అందించి, కేశాలను ధృడపరచి, మలినాలను తొలగిస్తుంది. జుట్టును తెల్లబడకుండా చూస్తుంది. వేపలోని యాంటీఫంగల్ లక్షణాలు, చుండ్రు, మాడుపై దురద వంటి సమస్యలను నిరోధిస్తాయి.

ఈ హెయిర్ మాస్కును వారానికి ఒకసారి వాఫిట్ మాడు యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. జుట్టు ఆరోగ్యంతో మెరుస్తూ, మృదువుగా మారుతుంది.

English summary

How To Use Curry Leaves For Hair Growth?

Curry leaves are an inevitable part of our daily cooking. Curry leaves are very beneficial in stimulating hair growth when added to diet and also when used topically as hair oils, hair masks, etc. They prevent almost all causes that lead to hair fall such as dandruff, oily scalp, itching, etc., and work as an one-stop cure for all hair-related problems.
Story first published: Monday, June 11, 2018, 11:30 [IST]