For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు నివారణకు పెసరపప్పు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా...

చుండ్రు నివారణకు పెసరపప్పును ఏవిధంగా వాడవచ్చు?

|

చుండ్రు కొన్ని కోట్లమంది ప్రజలను సతాయించే అతి సాధారణ కేశ సమస్య. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఇది మాడు మీద చర్మాన్ని పొట్టులా మార్చి, దురదను కలుగజేస్తుంది. అంతేకాకుండా, జుట్టు రాలడం, పలుచబడటం కూడా జరుగుతుంది.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు కానీ, నియంత్రణలో ఉంచవచ్చు.ఈ రోజుల్లో చుండ్రు నివారణకు మార్కెట్లో కొన్ని వందల రకాల ఉత్పత్తులు లభ్యతలో ఉన్నాయి. కానీ వీటిలో చాలామటుకు గాఢమైన రసాయనాలను కలిగి ఉంటాయి.

ఈ ఉత్పత్తులను వాడటం వలన మాడుపై తెల్లని పొట్టు మరియు దురద నుండి తాత్కాలికంగా పరిష్కారం లభించినా, మీ జుట్టుకు దీర్ఘకాలిక నష్టం కలుగజేస్తాయి.

How To Use Green Gram For Dandruff

మన అదృష్టం కొద్దీ, కొన్ని ప్రకృతి సహజంగా లభించే పదార్థాలు, మార్కెట్ ఉత్పత్తులకు ధీటుగా చుండ్రు సమస్యను పరిష్కరిస్తాయి. మనం సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా అనాదిగా జుట్టును సంరక్షించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాము. అటువంటి వాటిలో ఒక అద్భుతమైన పదార్ధం పెసరపప్పు.

సాధారణంగా మన వంటగదిలో ఎప్పుడూ లభించే ఈ పదార్ధంలో ఖనిజాలు, ప్రోటీన్లు మరియు పీచుపదార్ధం మెండుగా ఉంటాయి. ఈ సుగుణాలు ఉన్నందున, పెసరపప్పు చుండ్రు మొదలైన ఎన్నోరకాల కేశ సమస్యల నుండి మనకు విశ్రాంతిని ప్రసాదిస్తాయి.

దీని వలన మాడు చల్లబడి, దురద, మంట తగ్గి, తేమ అంది, పొట్టు రాలడం ఆగుతుంది. ఇది సహజమైన మెరుపును అందించడమే కాక, కుదుళ్ల నుండి మీ జుట్టును బలంగా మారుస్తుంది.

పెసరపప్పును ఏ విధంగా వాడటం వలన చుండ్రు నివారింపబడుతుందో, తెలుసుకునే ముందు అసలు చుండ్రు ఏ కారణాల వలన కలుగుతుందో తెలుసుకుందాం.

చుండ్రు కలగడానికి ముఖ్య కారణాలు:

చుండ్రు కలగడానికి ముఖ్య కారణాలు:

• చుండ్రు కలగడానికి ఫంగస్ ఇన్ఫెక్షన్ అతిముఖ్య కారణం. దీని వలన మాడుపై తెల్లని పొట్టు మరియు దురద కలుగుతాయి.

• మాడు పొడిబారిన వారిలో కూడా చుండ్రు కలగవచ్చు. పొడిదనం వలన చర్మంపై మృతకణాలు ఎక్కువగా ఏర్పడి, పొట్టులా మారడమే కాక దూరదను కూడా కలుగజేస్తాయి.

• పొడిబారిన మాడే కాకుండా జిడ్డుగా ఉండే మాడు కలిగిన వారిలో కూడా చుండ్రు సమస్య తలెత్తుతుంది.

• ఇంకొక ముఖ్య కారణం, మురికి పట్టిన మాడు. మాడుపై మట్టి, మురికి, విషపూరిత పదార్థాలు మరియు మృతచర్మకణాలు పేరుకుపోయినప్పుడు జుట్టు మొదళ్ళు పూడుకుపోయి, చుండ్రు మరియు ఇతర కేశ సమస్యలు ఏర్పడతాయి.

• సొరియాసిస్ మరియు ఎక్జిమా వంటి చర్మ సమస్యలతో బాధపడేవారిలో చుండ్రు సామాన్యంగా ఉంటుంది.

• అనారోగ్యకర జీవనశైలి మరియు అసమతుల ఆహారం కూడా జుట్టుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు కారణమవుతున్నాయి.

చుండ్రును నివారించడానికి ఉపయోగపడే ఒక ప్రభావవంతమైన ప్రకృతి సహజ పదార్థాలతో కూడిన పరిష్కారం ఇప్పుడు మీ కొరకు తెలుపబోతున్నాం.

మీకు కావలసిన పదార్థాలు:

మీకు కావలసిన పదార్థాలు:

4 టేబుల్ స్పూన్ల పెసరపప్పు

1 పెద్ద గిన్నెతో నీరు

వాడే విధానం:

వాడే విధానం:

• పైన చెప్పిన పరిమాణంలో పెసరపప్పు నీటిలో నానబెట్టాలి.

• నానబెట్టిన పప్పును మెత్తని ముద్దగా చేయండి.

• మీ జుట్టును గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

• పెసరముద్దతో మాడును రుద్దుకుంటూ పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి.

• ఇప్పుడు మరలా జుట్టును గోరువెచ్చని నీళ్లతో తిరిగి మొత్తం శుభ్రపడే విధంగా రుద్దుకోవాలి. షాంపూ ఉపయోగించరాదు.

ఎన్నాళ్లకు ఒకసారి:

ఎన్నాళ్లకు ఒకసారి:

వారానికి రెండుసార్లు, ఇలా మాడుకు ప్రకృతి సహజ చికిత్స అందిస్తే, చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది.

ప్రత్యామ్నాయ పద్ధతి:

ప్రత్యామ్నాయ పద్ధతి:

• 2 టేబుల్ స్పూన్ల పెసర పిండిని 3 టేబుల్ స్పూన్ల పెరుగులో కలపండి.

• ఈ ముద్దను మాడు అంతా బాగా పట్టించండి.

• మీ జుట్టును ఇప్పుడు షవర్ క్యాప్ తో కప్పివుంచండి.

• పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

• ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రును నివారించుకోవచ్చు.

తప్పక చదవండి: ఈ పద్ధతుల ద్వారా చుండ్రు శాశ్వతంగా పరిష్కరించబడుతుంది.

పెసరపప్పు వలన జుట్టుకు కలిగే ప్రయోజనాలు:

పెసరపప్పు వలన జుట్టుకు కలిగే ప్రయోజనాలు:

• పెసరముద్దను రాసుకోవడం వలన దురద ఉన్న మాడుకు స్వాంత చేకూరుతుంది. ఇలా చేయడం వలన మాడుకు తేమ అంది మాడు పొలుసులుగా మారదు.

• ఈ ప్రకృతి సహజ పద్ధతిని పాటిస్తే, దీనిలో ప్రోటీన్లు మరియు పీచుపదార్ధం మాడును శుభ్రంగా ఉంచి మృతకణాలను పేరుకుపోకుండా చేస్తుంది.

• పెసరపప్పు లో ఉండే విటమిన్ బి, జుట్టు తెగిపోవడాన్ని అరికట్టి, ఎదిగేట్టు చరిస్తుంది.

• పోషకాలతో నిండి ఉన్న ఈ ప్రకృతి సహజ పదార్ధం, జుట్టుకు మెరుపును చేకూరుస్తుంది.

• పెసరపప్పు లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టుకు లోతైన పోషణను ఇచ్చి, సూర్య కిరణాల మరియు వాతావరణ కాలుష్యం ధాటికి కలిగిన నష్టాన్ని సరిచేస్తాయి.

అనుసరించవలసిన చిట్కాలు:

అనుసరించవలసిన చిట్కాలు:

• ప్రతిరోజూ జుట్టుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి కనీసం రెండు మూడుసార్లు జుట్టును శుభ్రం చేసుకోవాలి.

• కేవలం మీ జుట్టు తత్వానికి నప్పే కేశ సంరక్షణ ఉత్పత్తులను వినియోగించాలి.

• మీ జుట్టుకు ఎల్లప్పుడూ తేమను సమకూర్చే హెయిర్ మాస్కులను తరచుగా వినియోగించాలి.

• చుండ్రు నివారణకు, వివిధ రకాల రసాయనాలతో కూడిన మార్కెట్లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు కాకుండా ప్రకృతి సహజ సిద్ధమైన పదార్థాలను వినియోగించాలి. రసాయనాలతో కూడిన ఉత్పత్తులు మంచి కన్నా ఎక్కువగా చెడే చేస్తాయి.

కనుక, పెసరపప్పును మీ కేశ సంరక్షణ క్రమంలో భాగంగా చేసుకుంటే, చుండ్రు నివారింపబడటమే కాకుండా, మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా నిగానిగలాడుతూ ఉంటుంది.

English summary

How To Use Green Gram For Dandruff

How To Use Green Gram For Dandruff,Dandruff is an exceedingly common hair problem that plagues millions of people of all age groups. It causes flakiness and itchiness in the scalp and if not taken care of, it may lead to other harrowing conditions such as hair loss and thinning.
Desktop Bottom Promotion