For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు ని పోగొట్టడానికి ఉల్లిపాయ జ్యూస్ ని ఎలా ఉపయోగించాలి?

ఈ రోజుల్లో చుండ్రు జుట్టు కుదుళ్ళని వెంటాడుతూ అందరినీ ఇబ్బంది పెడుతున్న ఒక సాధారణ సమస్యగా మారింది. ఒక్కసారి ఊహించుకోండి డాండ్రఫ్ ని డీల్ చేయడం ఎంత కష్టమైన పనో అమ్మో తలచుకుంటేనే భయం వేస్తుంది. ఇది కేవ

By Ashwini Pappireddy
|

ఈ రోజుల్లో చుండ్రు జుట్టు కుదుళ్ళని వెంటాడుతూ అందరినీ ఇబ్బంది పెడుతున్న ఒక సాధారణ సమస్యగా మారింది. ఒక్కసారి ఊహించుకోండి డాండ్రఫ్ ని డీల్ చేయడం ఎంత కష్టమైన పనో అమ్మో తలచుకుంటేనే భయం వేస్తుంది.

ఇది కేవలం మీ స్కాల్ప్ ని అసహ్యంగా మరియు అనారోగ్యంగా చేయడమే కాదు. వికారమైన జుట్టు తో మిమల్ని అసహ్యంగా కనిపించేలా చేస్తుంది.

చుండ్రు రావడానికి సాధారణంగా అనేక కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనవి పొడి చర్మం, సోరియాసిస్ మరియు తామరలు.

బ్యూటీ స్టోర్స్ లో చుండ్రుని పోగొట్టడానికి అనేక రకాల హెయిర్ ప్రొడక్ట్స్ అందుబాటులో వున్నాయి.అయినప్పటికీ, అందులో చాలా ప్రొడక్ట్స్ మంచి కంటే హాని కలిగించే రసాయనాలు ఎక్కువ ఉంటాయి.

కాబట్టి అటువంటి ఉత్పత్తులపై ఆధారపడటానికి బదులుగా, సహజమైన నివారణ పద్ధతులను ప్రయత్నించడం ఎంతో ఉత్తమం. అందులో చుండ్రు సమస్యకి సమర్థవంతంగా పనిచేసే ఉల్లిపాయ రసం కూడా ఒకటి.

<strong>జుట్టు పెరుగుదలకు అద్భుత ఔషదం ఉల్లిపాయ రసం!</strong>జుట్టు పెరుగుదలకు అద్భుత ఔషదం ఉల్లిపాయ రసం!

యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో సమృద్ధంగా నిండివున్న ఉల్లిపాయ రసం చుండ్రు సమస్యను ఎదుర్కోవటానికి మరియు మళ్ళీ రాకుండా నివారించవచ్చు.

అంతేకాక, చుండ్రు సమస్యకి చికిత్స చేయడానికి మనకి అనేక రకాల మార్గాలు వున్నాయి. అందులో కొన్ని ప్రభావవంతమైన మార్గాలను మీకోసం ఇక్కడ తెలియాజేశాము. అవేంటో ఇప్పుడు చూసేద్దామా మరి.

1. ఉల్లిపాయ జ్యూస్ తో నిమ్మకాయ జ్యూస్

1. ఉల్లిపాయ జ్యూస్ తో నిమ్మకాయ జ్యూస్

- ఒక చిన్న గిన్నెలో 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో 3-4 టీస్పూన్ల నిమ్మ రసం కలపండి.

- రెండు మిశ్రమాలను బాగా కలిపి, చుండ్రు వున్న ప్రాంతంలో రాయాలి.

- 5 నిమిషాల పాటు మీ చేతివేళ్ల తో స్కాల్ప్ ని మసాజ్ చేయండి.

- మరొక 15 నిముషాల పాటు మీ తల మీద అలానే కాస్సేపు ఉండనివ్వండి.

- తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- సమర్థవంతమైన ఫలితాల కోసం వారానికి కనీసం రెండుసార్లు ఈ పద్దతిని అనుసరించండి.

2.ఉల్లిపాయ రసంతో అలో వెరా జెల్

2.ఉల్లిపాయ రసంతో అలో వెరా జెల్

- 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం లో 3-4 టీస్పూన్ల అలో వెరా జెల్ ని కలిపి ఒక మిశ్రమంలా కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ తలపై చుండ్రు వున్న ప్రాంతం లో అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి.

- కాస్సేపు ఉండనిచ్చి గోరు వెచ్చని నీటితో మరియు మీ రెగ్యులర్ షాంపూతో కడిగేయండి.

- వేగవంతమైన ఫలితాల కోసం ఈ మిశ్రమాన్ని వారానికి 2-3 సార్లు దీనిని ఉపయోగించవచ్చు.

3. ఉల్లిపాయ రసం తో ఆలివ్ ఆయిల్ మరియు బేకింగ్ సోడా

3. ఉల్లిపాయ రసం తో ఆలివ్ ఆయిల్ మరియు బేకింగ్ సోడా

- ఒక చిన్న గిన్నెలో ½ టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ ఉల్లిపాయ రసం మరియు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెని కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ తల కి రాసి ఒక 15నిముషాలు ఆరనివ్వండి.

- తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

- చుండ్రుని పోగొట్టుకోవడానికి ఈ మిశ్రమాన్ని నెలకి రెండు సార్లు ఉపయోగించండి.

4. ఉల్లిపాయ జ్యూస్ తో కొబ్బరి నూనె మరియు టీ ట్రీ ఆయిల్

4. ఉల్లిపాయ జ్యూస్ తో కొబ్బరి నూనె మరియు టీ ట్రీ ఆయిల్

- 1 టీస్పూన్ ఉల్లిపాయ రసంలో, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె మరియు 4-5 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ తలపై రాయండి.

- 20 నిముషాల పాటు తల మీద ఉండనిచ్చి తరువాత మీరు ఎప్పడూ వాడే షాంపూ తో గోరువెచ్చని

నీటిని వుపయోగించి కడిగేయండి.

- చుండ్రుని తొలగించి మంచి ఫలితాలని పొందడానికి వారానికొకసారి ఈ పద్ధతిని అనుసరించండి.

<strong>జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి</strong>జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి

5.ఉల్లిపాయ రసంతో ఆపిల్ సైడర్ వినెగార్

5.ఉల్లిపాయ రసంతో ఆపిల్ సైడర్ వినెగార్

- 2 టీస్పూన్ల ఉల్లిపాయ రసంలో 4-5 చుక్కల ఆపిల్ సైడర్ వినెగార్ కలపాలి.

- ఈ మిశ్రమాన్ని మీ తల మీద చుండ్రు వున్న ప్రాంతంలో అప్లై చేసి 10 నిముషాలు ఉండనివ్వండి.

- తరువాత మీ సాధారణ షాంపూ మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

- మంచి ఫలితాల కోసం ఈ మిశ్రమాన్ని వారానికొకసారి ఉపయోగించండి.

6. ఉల్లిపాయ జ్యూస్ తో హెన్నా పౌడర్

6. ఉల్లిపాయ జ్యూస్ తో హెన్నా పౌడర్

- ఒక చిన్న గిన్నెలో ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసంలో 1 టీస్పూన్ హెన్నా పొడి మరియు రసం యొక్క 2 టీస్పూన్ల రోజ్ వాటర్ ని కలపండి.

- ఈ మిశ్రమాన్ని మీ తలకి బాగా పట్టించి 15 నిముషాల పాటు ఉండనివ్వండి.

- తరువాత, మీ జుట్టు ని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని వుపయోగించి కడిగేయండి.

- చుండ్రు సమస్యని తొలగించు కోవడానికి మరియు మళ్ళీ రాకుండా నివారించడానికి ఈ పద్ధతిని ప్రతి వారం ఉపయోగించండి.

7. ఉల్లిపాయ రసం తో ముల్తానీ మట్టి

7. ఉల్లిపాయ రసం తో ముల్తానీ మట్టి

- 1 టీస్పూన్ ముల్తానీ మట్టిలో 3 టీస్పూన్ల ఉల్లిపాయ రసాన్ని కలపాలి.

- ఈ మిశ్రమాన్ని మీ తలపై రాసుకొని కాసేపు మర్దనా చేయండి.

- 20-25 నిమిషాల తరువాత, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

- చుండ్రు సమస్యకి వీడ్కోలు చెప్పడానికి ఇంట్లోనే తయారుచేసుకునే ఈ మిశ్రమాన్ని వారానికొకసారి ఉపయోగించండి.

8. ఉల్లిపాయ జ్యూస్ తో నిమ్మ రసం

8. ఉల్లిపాయ జ్యూస్ తో నిమ్మ రసం

- ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసాన్ని తీసుకొని 2 టీస్పూన్ల గులాబీ నీరు మరియు 2-3 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ని కలపండి.

- పైన తయారుచేసిన మిశ్రమాన్ని మీ తల కి బాగా పట్టించండి.

- 10-15 నిమిషాల పాటు ఉండనిచ్చి, తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- చుండ్రు నుండి విముక్తులవడానికి ఇంట్లో తయారుచేసుకునే ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ఉపయోగించండి.

English summary

How To Use Onion Juice To Banish Dandruff

There are many factors that can lead to this unsightly hair problem. The most common ones are dry skin, psoriasis and eczema. Enriched with antibacterial properties, onion juice can combat the dandruff problem and also prevent it from recurring.
Desktop Bottom Promotion