చుండ్రును శాశ్వతంగా నిర్మూలించే హోంమేడ్ రోజ్ మేరీ హెయిర్ మాస్క్ ను ఉపయోగించే విధానం

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

డాండ్రఫ్ ని తొలగించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? యాంటీ డాండ్రఫ్ ప్రాడక్ట్స్ ఏవీ మీకు సత్ఫలితాలని అందివ్వలేదా? అయితే, మీరు సరైన పేజీకే విచ్చేశారు. మార్కెట్ లో లభించే యాంటీ డాండ్రఫ్ షాంపూలనేవి స్కాల్ప్ పై ఈస్ట్ పెరుగుదలను అడ్డుకుంటాయన్నది వాస్తవమే. అయితే, ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి. ఈస్ట్ అనేది తిరిగి స్కాల్ప్ ను ఎటాక్ చేయకుండా ఉండేందుకు మీరు శక్తివంతమైన యాంటీ డాండ్రఫ్ ప్రాడక్ట్ పై ఆధారపడాలి. ఇంటివద్దే సులభంగా తయారుచేసుకునే రోజ్ మేరీ హెయిర్ మాస్క్ అనేది డాండ్రఫ్ పై శక్తివంతమైన పోరాటాన్ని సాగిస్తుంది. తద్వారా, మీకు డాండ్రఫ్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ముగ్గురిలో ఒక్కరు డాండ్రఫ్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈస్ట్ తో కలిసిన డెడ్ స్కిన్ మరియు జిడ్డుతనం అనేవి డాండ్రఫ్ ని ఆకర్షిస్తాయి. డాండ్రఫ్ బారిన పడితే జుట్టు రాలడం అధికమవుతుంది.

హోంమేడ్ రోజ్ మేరీ హెర్బల్ మాస్క్ ద్వారా డాండ్రఫ్ ను అరికట్టవచ్చా? అవును, అరికట్టవచ్చు. రోజ్ మేరీ లో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ ఆలాగే యాంటీ సెప్టిక్ ప్రాపర్టీలు కలవు. ఇవి స్కాల్ప్ పైన పేరుకుని ఉన్న ఈస్ట్ ను విచ్చిన్నం చేస్తాయి. అలాగే, డాండ్రఫ్ ని కలిగించే బాక్టీరియాను అంతం చేస్తాయి. తిరిగి, హానీకరమైన బాక్టీరియా అనేది దాడి చేయకుండా అడ్డుకుంటాయి.

అంతేకాకుండా, రోజ్ మేరీ అనేది స్కాల్ప్ లో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇలా చేయడం ద్వారా, వెంట్రుకలకు తగినంత ఆక్సిజెన్ ను అలాగే పోషకాలను అందిస్తుంది. తద్వారా, జుట్టు పెరుగుదలను పెంపొందిస్తుంది.

గ్రీజీ స్కాల్ప్ అనేది హెయిర్ లాస్ కు అలాగే డాండ్రఫ్ కు దారితీస్తుంది. రోజ్ మేరీ అనేది అదనపు నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అలాగే స్కాల్ప్ లో సహజమైన పిహెచ్ బ్యాలన్స్ ని పునరుద్ధరిస్తుంది. ఇవన్నీ, శిరోజాలను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు తమవంతు సాయం అందిస్తాయి.

రోజ్ మేరీని ఉపయోగించి డాండ్రఫ్ ను సహజసిద్ధంగా నివారించుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ను ఇక్కడ వివరించాము.

స్టెప్ 1:

స్టెప్ 1:

రెండు కప్పుల నీళ్లను లో ఫ్లేమ్ లో మరగబెట్టాలి. నీళ్లు మరిగేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ రోజ్ మేరీ పౌడర్ ని జోడించాలి. ఇప్పుడు మరో పది నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని సిమ్మర్ లో మరిగించాలి. నీళ్లు ముదురు గోధుమ రంగుకు చేరుకునేవరకు మరిగించాలి.

స్టెప్ 2:

స్టెప్ 2:

ఈ సొల్యూషన్ ను రూమ్ టెంపరేచర్ లో చల్లార్చాలి. ఆ తరువాత వడగట్టి ఒక జార్ లోకి మార్చాలి. మూడు చుక్కల లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ను ఈ మిశ్రమానికి జత చేయాలి. నిమ్మలో లభించే సిట్రిక్ యాసిడ్ అనేది స్కాల్ప్ ను శుభ్రపరిచేందుకు ఉపయోగపడడంతో పాటు జుట్టును నిగనిగలాడేలా చేసేందుకు తోడ్పడుతుంది.

స్టెప్ 3:

స్టెప్ 3:

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను ఈ మిశ్రమంలో జోడించి బాగా కలపాలి. కొబ్బరినూనెలో లభించే లారిక్ యాసిడ్ అనేది జుట్టు వ్రేళ్ళను దృఢపరుస్తుంది. అలాగే, జుట్టులోని ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, మీ శిరోజాలను మృదువుగా చేస్తుంది కూడా.

స్టెప్ 4:

స్టెప్ 4:

వైడ్ టూత్డ్ దువ్వెనతో జట్టులోని చిక్కును తొలగించుకోండి. జుట్టు దెబ్బతినకుండా ఉండేందుకు తేలికపాటి ఒత్తిడిని వాడి జుట్టును దువ్వండి.

స్టెప్ 5:

స్టెప్ 5:

ఒక కాటన్ బాల్ ను తీసుకుని ఈ సొల్యూషన్ లో ముంచి స్కాల్ప్ పై సున్నితంగా రుద్దండి. స్కాల్ప్ మొత్తాన్ని ఈ పద్దతిలో ఈ సొల్యూషన్ తో కవర్ చేయండి. రాత్రంతా ఈ సొల్యూషన్ ను స్కాల్ప్ పై అలాగే ఉంచండి.

స్టెప్ 6:

స్టెప్ 6:

ఉదయాన్నే, తేలికపాటి హెర్బల్ షాంపూ తో స్కాల్ప్ ను శుభ్రపరుచుకోండి. ఆ తరువాత చక్కటి కండిషనర్ ని అప్లై చేయండి.

స్టెప్ 7:

స్టెప్ 7:

ఇప్పుడు జుట్టును పిండి అదనపు నీటిని తొలగించండి. ఒక పాత టీ షర్ట్ ను తీసుకుని స్కాల్ప్ ను చక్కగా కవర్ చేయండి. ఇలా చేయడం ద్వారా స్కాల్ప్ పై నున్న అదనపు మాయిశ్చర్ అనేది తొలగిపోతుంది.

స్టెప్ 8:

స్టెప్ 8:

మీ జుట్టును సహజంగా ఆరనివ్వండి. ఒకవేళ మీరు బ్లో డ్రయర్ ని వాడితే హీట్ ప్రొటెక్టింగ్ సెరమ్ ను ముందుగా అప్లై చేయండి.

గుర్తుపెట్టుకోవలసిన విషయాలు

గుర్తుపెట్టుకోవలసిన విషయాలు

వారానికి రెండు సార్లు ఈ రోజ్ మేరీ హెయిర్ టానిక్ ను వాడడం వలన డాండ్రఫ్ తగ్గుదలని మీరు గమనించగలుగుతారు.

ఈ హెయిర్ ప్యాక్ ని వాడితే కాస్తంత బర్నింగ్ సెన్సేషన్ కలుగుతుంది. అయితే, ఒకవేళ మంట ఎక్కువగా కలిగితే వెంటనే సాధారణ నీటితో మీ జుట్టును కడగటండి.

శిరోజాలకు నూనె పట్టించడం ద్వారా వెంట్రుకలకు పోషణ లభిస్తుంది. అయితే, నూనెను ఎక్కువగా పట్టించడం వలన డాండ్రఫ్ సమస్య పెరుగుతుంది. కాబట్టి వారానికి ఒకసారి మాత్రమే జుట్టుకు నూనె పట్టించాలి.

ముగింపు

ముగింపు

ఈ హోంమేడ్ హెయిర్ మాస్క్ ను కేవలం ఒక్కసారి వాడడం ద్వారానే మీరు డాండ్రఫ్ వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుదలను గమనిస్తారు. డాండ్రఫ్ వలన కలిగే దురద తగ్గుతుంది. అలాగే శిరోజాలు ఆరోగ్యంగా అలాగే శుభ్రంగా ఉంటాయి.

English summary

Homemade Hair Mask For Dandruff | Herbal Mask To Get Rid Of Dandruff | How To Get Rid Of Dandruff Naturally | Rosemary For Hair Growth

How does rosemary herbal mask help get rid of dandruff? Rosemary has powerful antibacterial and antiseptic properties that breaks down the yeast buildup on scalp, kill bacteria that causes dandruff, keeping it from regrouping again. Furthermore, rosemary stimulate blood circulation on scalp, which in turn help hair strands absorb oxygen and nutrient better, boosting hair growth.