For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటా హెయిర్ ప్యాక్ తో మీ జుట్టును బలంగా మార్చుకోవచ్చట...

జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ టమోటా హెయిర్ - ప్యాక్ మీకు సహాయం చేయగలదు.

|

జుట్టు రాలడం అనేది మనలో అనేకమంది తరచుగా ఎదుర్కునే ముఖ్యమైన సమస్యలలో ఒకటి. నేటి పర్యావరణ కాలుష్యం, తీరికలేని జీవనశైలి, ఆహారపు అలవాట్లు, హార్మోనుల అసమతుల్యం, వ్యాధులు, రోగ నిరోధక శక్తి క్షీణించడం, సూర్యరశ్మి, అధిక రేడియేషన్ మొదలైన అనేక అంశాలు ఈ సమస్యకు ప్రధాన కారకాలుగా ఉన్నాయి. క్రమంగా సమస్యను గుర్తించడమే మొదటి దశగా ఉంటుంది. పైగా తీరికలేని కార్యక్రమాల కారణంగా జుట్టు తదితర అంశాల మీద శ్రద్ధ వహించడం కూడా కష్టతరంగా ఉంటుంది అనేకులకు. మరియు, పైన చెప్పిన ఈ కారకాల ప్రభావాలు మన చర్మం మరియు జుట్టు మీద ప్రధానంగా ఉంటాయి. అందువల్ల, జుట్టు మరియు చర్మ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడానికి, ప్రజలు తరచుగా స్పా మరియు సెలూన్లను ఆశ్రయించడం పరిపాటిగా ఉంటుంది, కానీ కొన్ని రసాయనిక చికిత్సా విధానాలు, ప్రతికూల ప్రభావాలను సైతం కలిగించవచ్చు. క్రమంగా ఆ ప్రభావాలు దీర్ఘకాలిక సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఎటువంటి దుష్ప్రభావాలు లేని గృహనివారణా చికిత్సా విధానాలు అవలంభించడం మేలని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.

మీ చర్మ ఆరోగ్యానికి ఎటువంటి దుష్ప్రయోజనాలు లేని సహజ పదార్ధాలను ఉపయోగించడం పూర్తిగా సురక్షితం అయినందువలన వీటిని అనుసరించడమే మేలు. మరియు రసాయనిక ఉత్పత్తులకన్నా సహజసిద్దమైన పదార్ధాల ద్వారా మెరుగైన ఫలితాలను కూడా సాధించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు కూడా.

ఎందుకని జుట్టు సంరక్షణలో భాగంగా టమోటో అంత ప్రయోజనకరంగా చెప్పబడింది?

How To Use Tomato For Hair Fall?

టమోటో అనేకరకాల జుట్టు సంరక్షణా లక్షణాలను కలిగి ఉంది - జుట్టు పతనం తగ్గించి, పొడి మరియు దెబ్బతిన్న జుట్టును బాగుచేస్తుంది. మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు టొమాటో అనేక భిన్నప్రయోజనాల శ్రేణిని కూడా కలిగి ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి టొమాటో యొక్క అద్భుతమైన ప్రయోజనాల జాబితా కింద పొందుపరచబడింది.

• జుట్టు పెరుగుదలకు పోషకాలను సమకూర్చడమే కాకుండా, పొడి మరియు దెబ్బతిన్న జుట్టును మరమ్మతుచేసే లక్షణాలను కలిగి ఉంటుంది.

• జుట్టు పతనం తగ్గుతుంది.

• జుట్టు రాలడం తగ్గుతుంది మరియు కుదుళ్ళను బలంగా చేస్తుంది.

• జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

• మీ జుట్టు యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.

• జుట్టును బలంగా చేయడమే కాకుండా, ఒత్తుగా కనపడేలా చేస్తుంది.

• ఆరోగ్యకరమైన జుట్టుకు ఉద్దీపనగా ఉంటుంది.

• స్కాల్ప్ (తలమీద చర్మం) దుర్వాసన తొలగిస్తుంది.

• మీ జుట్టుకు సహజమైన ప్రకాశకాన్ని ఇస్తుంది.

• చుండ్రును తగ్గిస్తుంది.

• జుట్టు సమస్యలను కూడా తొలగిస్తుంది.

జుట్టు రాలడం వంటి సాధారణమైన జుట్టు సమస్యల విషయంలో సంరక్షణా పద్దతుల దృష్ట్యా, టమోటాను వాడటం అనేది మహిళలకు అత్యంత సాధారణమైన ఎంపికగా ఉంటుంది. కేవలం ఒక టమోటా తీసుకొని, దాని గుజ్జును తీసి, మీ చర్మంపై మసాజ్ చేసుకుని, కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలివేయవలసి ఉంటుంది. తర్వాత, చల్లని నీటితో తలస్నానం చేయవలసి ఉంటుంది. ఈ పద్దతి తరచుగా అవలంభించడం మూలాన, కొన్ని రోజుల్లోనే జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గడంలో సహాయపడగలదు. అంతేకాకుండా, టమోటాను ఉపయోగించి, ఇంట్లోనే హెయిర్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు.

జుట్టు రాలడంతోపాటు పొడి బారిన మరియు దెబ్బతిన్న జుట్టు వంటి సమస్యలకు త్వరితగతిన తయారుచేయగలిగే సమర్థవంతమైన టమోటా హెయిర్ ప్యాక్ గురించిన వివరాలు క్రింద పొందుపరచబడింది.

కావలసినవి :

• 1 టమోటా

• 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం

• 2 టేబుల్ స్పూన్ల కాస్టర్ ఆయిల్

• 1 స్పూన్ కొబ్బరి నూనె

తయారుచేయు విధానం :

• ఒక టమోటా తీసుకొని దాని గుజ్జును తీసి, పక్కన పెట్టండి.

• ఒక చిన్న గిన్నెలో నిమ్మరసం చేర్చండి.

• తరువాత, కాస్టర్ ఆయిల్ ను జోడించి, నిమ్మరసంతో కలపండి.

• చివరగా, కొబ్బరి నూనెను నిమ్మకాయ-కాస్టర్ ఆయిల్ మిశ్రమానికి జోడించి అన్ని పదార్ధాలను కలపాలి.

• ఇప్పుడు, టమోటా గుజ్జు తీసుకొని ఇతర పదార్ధాలతో సెమీ – పేస్టులా మిశ్రమంగా కలపండి.

దరఖాస్తుచేయు విధానం :

• పూర్తిగా చిక్కును తొలగించి మీ జుట్టును దువ్వండి. జుట్టును రెండు విభాగాలుగా విభజించండి - ఎడమ మరియు కుడి విభాగాలుగా. మొదట ఎడమ విభాగంతో ప్రారంభించండి.

• ఎడమ విభాగాన్ని చిన్న విభాగాలుగా విభజించండి. ఒక సమయంలో ఒక ఉప విభాగాన్ని మాత్రమే తీసుకొని పాక్ వర్తించాలి.

• మీ జుట్టు మరియు స్కాల్ప్ మీద టమోటా ప్యాక్ను బ్రష్ సహాయంతో పూర్తిగా అప్లై అయ్యేలా వర్తించండి. అదేవిధంగా అన్ని ఉప విభాగాలకు అప్లై చేయండి.

• ఒక విభాగం పూర్తయిన తర్వాత, కుడి విభాగానికి వెళ్లి, ఎడమవైపు విభాగాన వర్తించినట్లే పునరావృతం చేయండి.

• షవర్ క్యాప్ తో మీ తలను పూర్తిగా కవర్ చేసి, కాసేపు వదిలివేయండి.

• సుమారు 30 నిమిషాలు అలాగే వేచి ఉండండి.

• సమయం పూర్తైన తర్వాత తేలికపాటి సల్ఫేట్ రహిత షాంపూ మరియు కండీషనర్తో తలస్నానం చేయండి.

మెరుగైన ఫలితాల కోసం కనీసం వారంలో ఒకసారి ఈ ప్యాక్ రిపీట్ చేయండి.

ఈ టమోటా పాక్ సులభంగా సరళతరంగా ఉంది కదూ! అయితే మీరుకూడా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు గురవుతున్న ఎడల, ఈ పాక్ ప్రయత్నించి సమస్యను పారద్రోలండి. వీటితో పాటు జుట్టు సమస్యలకు పైనచెప్పిన అనేక కారకాలు కారణాలుగా ఉంటాయి కాబట్టి, మీ దైనందిక జీవనశైలిలో ఆరోగ్యకర మార్పులు, ఆహార ప్రణాళికలు, కాలుష్యం మరియు సూర్యరశ్మి బారిన పడకుండా జుట్టు సంరక్షణా విధానాలు అవలంభిస్తున్నారని నిర్ధారించుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవన శైలి, ఆహార,హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Use Tomato For Hair Fall?

Hair fall is one of the biggest problems we all face. Tomato has a number of hair care benefits to offer - right from stopping hair fall and promoting hair growth to repairing dry and damaged hair, tomato has an array of benefits to offer besides treating hair fall and other hair problems like dandruff.
Desktop Bottom Promotion