మీ జుట్టు ఎదుగుదలకు గుడ్లతో తయారు చేయగలిగే ఆరు రకాల కండీషనర్లు

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

ఎవరు మాత్రం దట్టమైన, పొడవైన,మృదువైన కురులంటే ఇష్టపడరు? కానీ జీవనశైలి, కాలుష్యం మొదలైన కారణాల వల్ల జుట్టు చిక్కులతో జీవం కోల్పోయినట్లు తయారవుతుంది. ప్రోటీన్ల లేమి వలన కూడా జుట్టు దెబ్బతిని ఎదగకుండా ఉండిపోతుంది.

గుడ్లు సహజమైన ప్రొటీన్లు పొందడానికి అద్భుతమైన పరిష్కారం. గుడ్డులో అతి ముఖ్యమైన ప్రొటీన్లు జుట్టు ధృఢంగా మారడానికి, పొడవుగా ఎదగడానికి ఉపయోగపడతాయి. గుడ్లు జుట్టులో ఉండే సహజ తైలాలను కాపాడి మృదువుగా ఉండేటట్లు చేస్తాయి.

6 DIY Egg Conditioners For Hair Growth

సెలూన్లలో ప్రోటీన్ కండీషనింగ్ ట్రీట్మెంట్ తీసుకునేకన్నా ఇంట్లో గుడ్లను ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక్కడ గుడ్డుతో మీరు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే కొన్ని కండీషనర్ ల గురించి తెలియజేస్తున్నాం. మీ జుట్టుకు కావలసింది ప్రేమతో కూడిన సంరక్షణ మాత్రమే!

1. గుడ్డులోని పచ్చ సొన మరియు ఆలివ్ ఆయిల్ మిశ్రమం:

1. గుడ్డులోని పచ్చ సొన మరియు ఆలివ్ ఆయిల్ మిశ్రమం:

పై రెండిటి మిశ్రమం మీ జుట్టుకు తేమను చేకూర్చి మృదువుగా తయారు చేస్తుంది. దీనిని తయారు చేయుటకై రెండు గుడ్ల పచ్చ సొన మరియు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను ఒక గిన్నెలో బాగా కలపాలి. సులువుగా మీ కురులకు రాసుకోవాలంటే దానికి కొంచెం నీటిని కూడా చేర్చాలి. మీ జుట్టును పాయలుగా విడదీసి, ఒక బ్రష్ తో శుభ్రంగా జుట్టంతా పట్టేట్లు రాసుకోవాలి. 1-2గంటల పాటు ఆరనిచ్చి చల్లటినీటితో షాంపూ చేసుకుని తరువాత కండీషనర్ రాసుకోండి. ఇలా వారానికి ఒక్కసారి చేయండి.

2.గుడ్డు మరియు మయోనీస్ మిశ్రమం:

2.గుడ్డు మరియు మయోనీస్ మిశ్రమం:

మయోనీస్ లో మీ జుట్టును కండీషన్ చేసే పదార్థాలు ఉంటాయి. రెండు గుడ్లు మరియు 4 టేబుల్ స్పూన్ల మయోనీస్ తీసుకోండి. అవి మృదువైన మిశ్రమంగా మారేవరకు శుభ్రంగా కలపాలి. తరువాత దానికి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలియు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాయండి. ఇలా 30 నిమిషాలు పాటు ఉంచుకుని చల్లని నీటితో మరియు సల్ఫేటు లేని షాంపూతో కడగండి. ఇలా వారానికి ఒక్కసారి చేయండి.

3. గుడ్డు మరియు తేనెల మిశ్రమం:

3. గుడ్డు మరియు తేనెల మిశ్రమం:

ఒక గుడ్డులో పచ్చ సొనలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దానిని జుట్టుకు బాగా పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఇరవై నిమిషాలు ఆగి చల్లని నీటితో కడిగేయాలి. తేనె జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు ఎదగడానికి ప్రోత్సాహం ఇస్తుంది. ఇలా వారానికి ఒకసారి చొప్పున కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4. గుడ్డు మరియు పెరుగుల మిశ్రమం:

4. గుడ్డు మరియు పెరుగుల మిశ్రమం:

ఒక గిన్నెలో పావు కప్పు పెరుగుకు ఒక గుడ్డును బాగా కలపండి. దీనిని షాంపూ చేసుకున్నాక కండీషనర్ మాదిరిగా వాడండి. ఐదు నిమిషాల పాటు జుట్టును ఈ మిశ్రమంతో మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా మీరు షాంపూ చేసుకున్న ప్రతిసారి చేయండి.

5. గుడ్డు మరియు కొబ్బరి నూనెల మిశ్రమం:

5. గుడ్డు మరియు కొబ్బరి నూనెల మిశ్రమం:

ఒక గిన్నెలో ఒక గుడ్డు తెల్ల సొనను తీసుకుని బాగా గిలక్కొట్టండి. దీనికి మెల్లగా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని మీ మాడుకు, జుట్టుకు పట్టించి మర్దన చేయండి. 20 నిమిషాలు పాటు అలా వదిలేయండి. తరువాత శుభ్రంగా నీటితో కడిగేయండి. ఒకవేళ జిడ్డుగా అనిపించినట్లైతే షాంపూతో తలస్నానం చేయండి.

6. గుడ్డు మరియు వెనిగర్ మిశ్రమం:

6. గుడ్డు మరియు వెనిగర్ మిశ్రమం:

రెండు గుడ్ల పచ్చ సొనను ఒక గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టండి. దీనికి నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం మరియు రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను కలపండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలిపి, జుట్టును పాయలుగా విడదీసి రాయండి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మీ జుట్టు మెత్తగా పట్టు కుచ్చులా మారుతుంది.

English summary

6 DIY Egg Conditioners For Hair Growth

Eggs contain all the essential proteins that help in strengthening the hair and increasing hair growth. Eggs also help in retaining the natural oils of the hair and in maintaining a smooth texture on your hair. You can make easy egg conditioners sitting back at home. Olive oil and egg, yogurt and egg, mayonnaise and egg are conditioners to try.