Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
మీ జుట్టు సమస్యలన్నిటినీ తీర్చే ఒక సుగంధద్రవ్య నూనె
జుట్టు ఊడిపోవటం అనేది మహిళలు అందరూ ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి. నిజానికి మనుషులందరికీ వర్తిస్తుంది కానీ స్త్రీలు ఎక్కువ బాధపడతారు ఎందుకంటే మనం మన వెంట్రుకలకి అంత ప్రాధాన్యత, సంరక్షణను ఇస్తాం కాబట్టి. కానీ అంతసేపు సమయం దాని సంరక్షణకి వెచ్చించినా కూడా జుట్టు ఊడిపోతుంది.
మీకు కూడా జుట్టు ఊడిపోతున్న సమస్య ఉంటే, మీరేం ఒంటరివారు కాదని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. ప్రతిరోజూ కొంచెం జుట్టు ఊడిపోవటం సాధారణమే. శాస్త్రీయంగా, రోజుకి 100 వెంట్రుకల చొప్పున ఊడిపోవటం సాధారణంగా పరిగణిస్తారు.

కొత్త జుట్టు పెరగటం కోసం ఊడిపోతున్నప్పుడు ఆ సంఖ్య 150 కి కూడా చేరవచ్చు. జుట్టు ఊడిపోవటం మనకి బాధ కలిగిస్తుంది, మనం మన అస్థిత్వంలో దానిని కూడా భాగంగా చూస్తాం.
మీ జుట్టు ఎక్కువగా ఊడిపోకుండా చూడటానికి మీరు ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అన్నిటికన్నా మేటి పని మీ జుట్టుపై ఎక్కువ రసాయనాలు వాడకుండా ఉండటం.
ఈరోజుల్లో, మార్కెట్లో మీ జుట్టుకి లాభాకరమని అనేక ఉత్పత్తులు కన్పిస్తున్నాయి, కానీ అన్నిటిలోని రసాయనాలు కలవడం వలన మీ జుట్టుకి మరింత తీవ్ర నష్టం కలుగుతుంది.
మీ జుట్టు ఊడిపోవటం మీకు చాలా బాధ కలిగిస్తుంటే, చర్మ నిపుణుడు మరియు వైద్యున్ని సంప్రదించి ఏమన్నా ఆరోగ్య సమస్య వలన ఇలా జరుగుతుందేమో తెలుసుకోండి. రక్తహీనత నుంచి థైరాయిడ్ సమస్యలు ఏమున్నా జుట్టు ఊడటం వాటి లక్షణం. అందుకని మీ వైద్యున్ని తప్పక సంప్రదించండి.
సుగంధ ద్రవ్య నూనెను వాడి మీ జుట్టు ఊడిపోయే సమస్యను ఎలా తగ్గించవచ్చో మేం వివరిస్తాం. చాలామంది సుగంధ ద్రవ్య నూనెలు వాడచ్చా లేదా అనే సందిగ్థంలో ఉంటారు, ఎందుకంటే అవి చాలా గాఢంగా ఉంటాయి. కానీ చింతించకండి, అవి ఎలా సరిగ్గా వాడి మీ జుట్టు ఊడిపోయే సమస్యను నివారించుకోవాలో మేము ఇక్కడ వివరిస్తాం.

మీ జుట్టు సమస్యలన్నిటినీ తీర్చే ఒక సుగంధద్రవ్య నూనె
దీని కోసం మీకు కావాల్సినవి
ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరినూనె
లావెండర్ సుగంధ నూనె
కొబ్బరినూనెను కొనే విషయానికొస్తే, అది ఎంత స్వఛ్చమైనది అయితే అంత మంచిది. ఎక్స్ ట్రా వర్జిన్ కొబ్బరి నూనె అంటే కొబ్బరి నూనె బాగా తక్కువ రిఫైన్ అయినది అని. ఏ ఉత్పత్తి అయినా ఎంత తక్కువ రిఫైన్ ప్రాసెస్ చేయబడితే, దానిలో అంత పోషకాలు ఇంకా నిలిచి ఉంటాయి. అందుకని ప్రాసెస్ చేయబడని కొబ్బరినూనెను వాడటం మంచిది.
కొబ్బరినూనెను రెండు నుంచి మూడు చుక్కల లావెండర్ సుగంధ నూనెతో కలిపి మీ కుదుళ్ళకు పట్టించండి. మీ జుట్టు ఎంత పొడవుగా ఉంటే అంత సరిపోయే కొబ్బరినూనె తీసుకోండి. మీ కుదుళ్ళకి, మాడుకి రాయడం వలన నూనె చర్మం లోపలికి ఇంకుతుంది.
మసాజ్ చేయటం వలన మాడుకి రక్తప్రసరణ మెరుగై, జుట్టు పెరగటాన్ని కూడా ప్రోత్సహించబడుతుంది. వారానికి కనీసం రెండుసార్లు షాంపూ చేసుకునే గంట ముందు ఇలా చేయండి.
మంచి ఫలితాల కోసం, నూనె ముందురోజు రాత్రే రాసుకుని వదిలేయండి. మొదటిసారి తలంటుకున్నప్పుడే మీకు మీ జుట్టు మెత్తగా, మృదువుగా అన్పిస్తుంది.ఎందుకంటే ఇది లోతైన కండీషనర్ గా కూడా పనిచేస్తుంది.

జుట్టు మరియు శరీర సంరక్షణకి కొబ్బరినూనె అన్ని నూనెల్లోకల్లా చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, బ్యాక్టీరియా వ్యతిరేక, ఫంగస్ వ్యతిరేక లక్షణాలుంటాయి. చాలాసార్లు, కుదుళ్ళ దగ్గర ఫంగస్ ఇన్ఫెక్షన్ల వలన జుట్టు ఊడిపోతుంది.
కొబ్బరినూనెను క్రమం తప్పకుండా వాడటం వలన ఆ సమస్య నుంచి ముక్తి లభిస్తుంది. ఎందుకంటే అన్ని నూనెల్లో కల్లా కొబ్బరినూనె మంచి తేమకారి.
మీ జుట్టుకి వాడదగ్గ అన్ని సుగంధ ద్రవ్య నూనెల్లోకల్లా లావెండర్ నూనె మంచిది, ఎందుకంటే దానిలో ఒత్తిడిని తగ్గించి హాయిని, ఉపశమనాన్ని అందించే శక్తికి అది ప్రసిద్ధి.



Click it and Unblock the Notifications
