For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ తేలికపాటి గృహ చిట్కాలతో చుండ్రు నుండి శాశ్వత విముక్తి పొందండి

ఈ తేలికపాటి గృహ చిట్కాలతో చుండ్రు నుండి శాశ్వత విముక్తి పొందండి.

By Abbireddi Umamaheswari
|

మీ జుట్టులో మొండి పట్టుదలగల చుండ్రుతో బాధపడుతున్నారా? చుండ్రుని శాశ్వతంగా తొలగించడంలో మీకు సహాయపడే కొన్ని గృహ చికిత్సలు ఇక్కడ ఉన్నాయి. అవును, ఇప్పుడు మీరు వాటిని తెలుసుకోబోతున్నారు.

కొన్నిసార్లు తలలో ఆయిల్ లేదా కొవ్వుల స్రావం అధికంగా ఉండటం చుండ్రుకు కారణమవుతోంది. వాస్తవానికి ఇది తలపై చర్మంలో మొటిమల అభివృద్దికి కూడా దారి తీయవచ్చు. అది మీ తలభాగ చర్మాన్ని దురదలకు గురిచేస్తుంది. తలమీద చర్మంలో మొటిమలు బయటకి కనిపించకపోయినప్పటికీ మొటిమలను ఎదుర్కోవడం అనేది ఒక తీవ్రమైన విషయం. కొన్నిసార్లు దురదకు గోకడం వలన మంటతో కూడిన రక్తస్రావం కూడా జరగవచ్చు. అందువల్ల అదనపు కొవ్వులు మన శరీరంలో ఏ భాగంలోనూ నిల్వ ఉంచుకోవడం మంచిదికాదు.

These Remedies Will Treat Dandruff Permanently

అలా అని జిడ్డు పూర్తిగా ఉండకూడదని కాదు. కావలసినంత సమతుల్యతతో అవసరం. ఎందుకంటే చుండ్రు అనేది అదనపు జిడ్డు వలన మాత్రమే కాకుండా తలమీద చర్మం పొడిబారడం వలన కూడా సంభవించవచ్చు. ఈ చిట్కాలు ఈ రెండు విషయాలలోనూ మీకు సహాయం చేస్తాయి. అందువల్ల ఇంటివద్దనే మరిన్ని సహజ నివారణ మార్గాలను తలభాగ చర్మం పొలుసుబారడాన్ని వదిలించుకోవడానికి చదవండి.

వెల్లుల్లి శిలీంద్ర నివారకములు (యాంటీ ఫంగల్) మరియు శోథ నిరోధక (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొండి పట్టుదలగల చుండ్రును వదిలించుకోవడంలో సహాయపడుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మందపాటి పేస్ట్ లాగా తయారు చేయడానికి వాటిని మిక్సీ పట్టండి. ఈ పేస్ట్‌‌‌ను మీ తలమీద చర్మానికి మరియు కుదుళ్ళకి పట్టించి 15 నిముషాల పాటు వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగండి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

మీ జుట్టు కుదుళ్ళను తేమగా ఉంచడానికి కొబ్బరి నూనె చికిత్స అవసరం. మెల్లగా జుట్టు కుదుళ్ళకు కొబ్బరి నూనెను పట్టించి మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ఉత్తేజపరుస్తుంది. కొబ్బరి నూనెను జుట్టుకి పట్టించి 30 నిమిషాల పాటు వదిలివేయండి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో కడగండి. మీరు చుండ్రుని త్వరగా వదిలించుకోవటానికి వారంలో రెండుసార్లు ఇలా చేయండి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రుని తగ్గించటానికి ఎంతో బాగా సహాయపడుతుంది. ఇది తలభాగ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యపరచడానికి రక్తస్రావ నివారిణిగా ఉపయోగించబడుతుంది.

దీనికి మీకు కావలసినది ఒక భాగం ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు దానికి ఒక భాగం నీళ్ళు. నీటిలో వెనిగర్ బాగా కలిపి అప్పుడు ఆ మిశ్రమాన్ని మీ తలభాగ చర్మం మీద అప్లై చేయండి. 15 నిముషాలు ఉంచి తర్వాత కడిగేయండి. మీరు ఈ నివారణను వారానికి రెండు సార్లు చేయడం వలన చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవచ్చు.

ఉల్లి రసం

ఉల్లి రసం

ఉల్లిపాయలో తలభాగ చర్మంపై మంటను నివారించడంలో సహాయపడే అనామ్లజనకాలు ఉన్నాయి. ఇది చర్మం యొక్క ఇన్ఫెక్షన్స్ నివారించి చుండ్రు తగ్గించడానికి చికిత్స చేస్తుంది.

ఉల్లిపాయ ముక్కలుగా చేసి గ్రైండ్ చేయండి. వచ్చిన మిశ్రమాన్ని పిండి రసం తీయండి. ఒక కాటన్ బాల్ ఉపయోగించి తల భాగ చర్మం మీద ఈ ఉల్లిపాయ జ్యూస్‌ని అప్లై చేయండి . 20-30 నిముషాల పాటు వదిలి వేసి తరువాత సహజ షాంపూతో కడిగేయండి.

వంట సోడా (Baking soda)

వంట సోడా (Baking soda)

బేకింగ్ సోడా యాంటీ బాక్టీరియా అలాగే యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది చర్మం యొక్క pH ను తటస్థీకరిస్తుంది మరియు తలభాగ చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ చూర్ణాన్ని తాయారు చేసుకునే క్రమంలో మీకు కావలసినవి కేవలం 2-3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా మరియు కొంత మంచి నీళ్ళు. ఈ చూర్ణాన్ని తలభాగ చర్మం మీద అప్లై చేసి 10 నుండి 15 నిముషాల పాటు వదిలివేయండి. తరవాత నీటితో కడిగేయండి.

పెరుగు

పెరుగు

పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది. అంతేకాక ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ముందుగా మీ జుట్టుని షాంపూతో శుభ్రం చేసుకోండి. పెరుగు తీసుకుని మీ తలమీద చర్మానికి మరియు కుదుళ్ళకు అప్లై చేసి షవర్ క్యాప్ వేసుకుని 15 నిముషాల పాటు వదిలేసి కడిగేయండి. తరువాత మరల ఒక సహజ షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోండి.

వేప

వేప

వేప యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని పులిపిర్లు మరియు మొటిమల నివారణ కోసం ఉపయోగించవచ్చు. తలభాగ చర్మంలో చుండ్రు మరియు దురదలను ఎదుర్కొంటున్నవారికి ఈ గృహ చికిత్స ఉత్తమంగా ఉంటుంది. దీనికి మీకు కావలసిందల్లా కొన్ని వేప ఆకులు మాత్రమే. కొంత నీళ్ళు తీసుకుని వేప ఆకులు వేసి బాగా మరిగించండి. తరువాత ఆకులు వడగట్టి నీటిని చల్లారనివ్వండి. షాంపూ చేసుకున్నాక చివరి వంతుగా ఆ నీటితో మీ జుట్టును, కుదుళ్ళను శుభ్రపరుచుకోండి.

కలబంద గుజ్జు (అలోవీరా జెల్)

కలబంద గుజ్జు (అలోవీరా జెల్)

మీ తలభాగ చర్మం యొక్క దురదని వదిలించుకోవడానికి సహాయపడే ఉత్తమ పదార్ధాలలో ఒకటి కలబంద గుజ్జు. దీనికి తాజా కలబంద ఆకుని ఉపయోగించడం మంచిది. అయితే మీకు ప్రస్తుతం అది అందుబాటులో లేనట్లయితే తయారుచేయబడిన (రెడీ మేడ్) అలోవీరా జెల్‌ను ఉపయోగించవచ్చు.

కలబంద ఆకు నుండి గుజ్జుని వేరు చేసి తలపై నేరుగా అప్లై చేసుకోండి. 15 నుంచి 20 నిముషాల పాటు వదిలివేయండి. తర్వాత గోరు వెచ్చని నీరు ఉపయోగించి కడగడం వలన కలబంద గుజ్జు సులభంగా వాదులుతుంది.

English summary

These Remedies Will Treat Dandruff Permanently

Are you annoyed with stubborn dandruff in your hair? Here are some home remedies that can help you out in getting rid of dandruff permanently. Some ingredients like aloe vera gel, coconut oil, neem, baking soda, apple cider vinegar, etc., can help you in getting rid of dandruff permanently if you use it regularly.
Story first published:Monday, May 7, 2018, 13:22 [IST]
Desktop Bottom Promotion