Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఇంట్లోనే కూర్చుని నల్లని జుట్టు పొందడానికి ఉపయోగపడే చిట్కాలు
ఇంట్లోనే కూర్చుని నల్లని జుట్టు పొందడానికి ఉపయోగపడే చిట్కాలు .
నల్లని జుట్టు మహిళలకు అందంతో పాటు హుందాతనాన్ని కూడా ఇస్తుంది. కేశాలంకరణలో చేసే కొద్దిపాటి మార్పు కూడా మీ ముఖంలో చాలా మార్పు తీసుకువస్తుంది. మిమ్మల్ని మీకే కాక, ఇతరులకు కూడా మిమ్మల్ని కొత్తగా ఆవిష్కరిస్తుంది.
మనలో చాలామంది నల్లని జుట్టును ఇష్టపడతారు. దాని కోసం మనం వివిధ పద్దతులను అనుసరిస్తాం. ఏ పద్దతిని అనుసరించినా కూడా అది సురక్షితమైనదై ఉండాలి.
మన జుట్టుతో ప్రయోగాలు చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే, పొరపాటున ఆ ప్రయోగాలలో చిన్న తప్పు దొర్లినా కాని, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది.

కనుక, పాటించే ముందే మీరు ఎంచుకునే మార్గం మీ జుట్టుకు తగినదో కాదో నిర్ధారించుకోవాలి. నల్లని శిరోజాలు పొందటానికి ఎన్నో మార్గాలున్నాయి కాని అవి మీకు సరిపడతాయో లేదో తెలుసుకోవడానికి, ముందుగా కొద్దిపాటి ప్రదేశంలో పరీక్ష చేసి చూడాలి.
ఇక్కడ మీరు నల్లని కురులు సొంతం చేసుకోవడానికి ఇంట్లోనే కూర్చుని సులువుగా పాటించదగిన చిట్కాలు కొన్నిటిని తెలియజేస్తున్నాం. అవి ఏంటో తెలుసుకోవడానికి మరెందుకు ఆలస్యం? చదవండి ఇక!

1. వేడి నూనెతో మర్దన:
నల్లని జుట్టు పొందటానికి వేడి నూనెతో మర్దన చేసుకోవడం ఒక మంచి మార్గం. దీనికి మీరు కొబ్బరినూనె, బాదం నూనె, ఆలివ్ నూనె మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. ఈ నూనెలు మీ జుట్టును నల్లబరచడమే కాక , ఒత్తుగా కనపడేటట్లు చేస్తాయి.
కొద్దిగా నూనెను తీసుకుని గోరు వెచ్చగా చేసి మాడు మరియు జుట్టుకు రాయండి. తరువాత మృదువుగా వలయాకారంలో మర్దన చేసుకోండి. ఇలా ముప్పై నిమిషాలపాటు వదిలేయండి. ముప్పై నిమిషాల తరువాత మృదువైన తత్త్వం కలిగిన షాంపూతో తలరుద్దుకోంది. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి చేస్తే, మీ జుట్టు నల్లగా మారుతుంది.

2. వేడిని నివారించండి:
జుట్టుపై తరచుగా వేడిని ప్రసరింపజేసే పరికరాలను వాడటం మూలంగా , జుట్టుకున్న సహజమైన నలుపు రంగు వెలిసిపోతోంది. మీరు జుట్టును స్ట్రైట్ గా మార్చుకోవాలనుకున్నప్పుడు లేదా వంకీలు తిప్పలనుకున్నపుడు అనుదినం ఇటువంటి పరికరాలు వాడవలసివస్తుంది. కనుక ఇటువంటి పరికరాలను తరచుగా వాడటాన్ని నివారించాలని గుర్తుపెట్టుకోండి.

౩. మంచినీళ్ళను ఎక్కువగా త్రాగండి:
శరీరానికి తగిన నీటి నిల్వను అందించడానికి మంచినీళ్ళను ఎక్కువగా త్రాగాలి. ఇలా చేయడం వలన మీ జుట్టును నల్లగా ఉంచుకోవచ్చు. అంతేకాక మీ మాడుకు అవసరమైన తేమ లభించడం మూలాన మీ జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి. కనుక నీటిని అధికంగా తాగడం అలవర్చుకుంటే, మీ జుట్టు నల్లగా ఉంటుందని మీ మనసులో పెట్టుకోండి.

4. నల్లబరిచే హెయిర్ ప్యాక్:
సులువైన గృహ చిట్కా ద్వారా మీ జుట్టును నల్లగా ఉంచుకోవచ్చు. ఈ ప్యాక్ మీ జుట్టును నల్లబరచడమే కాక ,మృదువుగా, మెరిసే పట్టుకుచ్చులా మారుస్తుంది.
కావలసిన పదార్ధాలు: అర కప్పు గోరింటాకు పొడి, అర కప్పు ఉసిరిక పొడి, ఒక గుడ్డు మరియు నిమ్మకాయ
తయారీ విధానం: ఉసిరికపొడి మరియు గోరింటాకు పొడిని బాగా కలిపి నీరుపోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాతి రోజు ఉదయం, మిగిలిన పదార్ధాలను కూడా కలపాలి. ఇప్పుడు మీ జుట్టును పాయలుగా విడదీసి జుట్టంతా పట్టేటట్లు, జాగ్రత్తగా రాసుకోవాలి. రాసుకోవడం పూర్తయ్యాక 20- 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. తరువాత షాంపూతో తలరుద్దుకోంది. ఇలా క్రమం తప్పకుండా నెలకి ఒకటి లేకా రెండుసార్లు చేస్తే, మీ జుట్టు నల్లగా మారుతుంది.

5. కొబ్బరినూనె మరియు నిమ్మరసం:
ఇది జుట్టును నల్లబరిచేందుకు అనాదిగా వాడుతున్న చిట్కా.
కావలసిన పదార్ధాలు: అరా కప్పు కొబ్బరినూనె, నిమ్మరసం
తయారీ విధానం: కొబ్బరినూనెను సన్నని సెగపై వేడి చేయాలి. దీనికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపండి. ఈ ద్రావణాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు దీనిని తీసుకుని మీ మాడు మరియు జుట్టుకు రాసుకుని మృదువుగా మర్దన చేసుకోండి. 25 నుండి 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. తరువాత మామూలు నీటితో కడిగేయండి.

6. జుట్టుపై బ్రష్ ను వినియోగించరాదు:
మీ జుట్టును బ్రష్ తో అతిగా దువ్వకండి. ఇలా చేస్తే మీ జుట్టుకు హాని కలుగుతుంది. వీటికి బదులుగా వెడల్పాటి పళ్ళున్న దువ్వెనను జుట్టు దువ్వుకోవడానికి ఉపయోగించాలి. అంతేకాకుండా మీ జుట్టును వేళ్ళకొనలతో దువ్వుకోవచ్చు.

7. కండీషనర్ ను వినియోగించండి:
జుట్టుకు ఎల్లప్పుడూ తేమనందించాలి. షాంపూ చేసుకున్నాక కండీషనింగ్ చేయడం వలన జుట్టుకు తేమ అందుతుంది. దీనివలన మీ జుట్టు నల్లగా, మృదువుగా తయారవుతుంది.



Click it and Unblock the Notifications