జిడ్డుగా ఉండే జుట్టు,మాడును వదుల్చుకునే చిట్కాలు

By Deepthi T A S
Subscribe to Boldsky

జుట్టు జిడ్డు పట్టిఉండటం చాలామంది ఆడవారికి పీడకల. అయినా మృదువైన, పట్టులాంటి, ఆరోగ్యకరమైన జుట్టు అందాన్ని పెంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది కదా!

జుట్టు పరిశుభ్రంగా లేకపోతే ఎలానో జిడ్డుతనం వచ్చేస్తుంది, కానీ జుట్టు కుదుళ్ళ దగ్గర ఉండే చెమటను స్రవించే గ్రంథులు అదనంగా, ఎక్కువ నూనెలను స్రవిస్తే జుట్టు జిడ్డుగా మారిపోతుంది. కొంచెం స్రవించడం సాధారణమే, జుట్టు ఆరోగ్యానికి మంచిది కూడా, కానీ ఎక్కువగా స్రవిస్తే జిడ్డుగా మారుతుంది. ఈ సమస్య చాలామంది భారతీయ స్త్రీలు ఎదుర్కొంటారు. కానీ దీన్ని జుట్టుకి సరిగ్గా సంరక్షణనిస్తే ఈ సమస్య తగ్గిపోతుందని గుర్తించరు.

Tips To Get Rid Of An Oily Scalp

సరైన జుట్టు సంరక్షణ ఉంటే, మీ జుట్టు కూడా మృదువుగా, పట్టులాగా, మెరుస్తూ కన్పిస్తుంది. మీకు చిట్కాలు కావాలంటే అన్నీ మీ వంటింట్లోనే దొరుకుతాయి.

హానికరం అలాగే ఖరీదైన రెడీమేడ్ ఉత్పత్తులు లేదా ఇతర రసాయన చికిత్సలకి అంత డబ్బు ఖర్చు పెట్టేకన్నా ఈ జిడ్డు జుట్టును వదిలించుకోటానికి కొన్ని చిట్కాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది.

మీ జిడ్డుగా ఉండే జుట్టు, మాడు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు ఇవిగో.

తరచుగా షాంపూతో తలంటుకోండి

తరచుగా షాంపూతో తలంటుకోండి

తరచుగా తలంటుకోమని సహజంగా ఎవరూ చెప్పరు కానీ మీకు జిడ్డు ఎక్కువగా ఉన్న జుట్టు ఉంటేమాత్రం రోజు విడిచి రోజు తలంటుకోవటం వలన అదనంగా స్రవించబడే నూనెలు తగ్గుతాయి. కానీ గుర్తుంచుకోండి మైల్డ్ షాంపూలు మాత్రమే వాడండి, కఠినమైన షాంపూలు వాడితే మీ జుట్టు పాడవుతుంది.

జుట్టును బాగా కడగండి

జుట్టును బాగా కడగండి

షాంపూ చేసేటప్పుడు మీ తలను బాగా రుద్దుకుని, కడగండి. అలా చేయకపోతే, తలపై షాంపూ పదార్థాలు ఉండిపోయి జుట్టు మాడుపై మరింత నూనెలు స్రవించేలా చేసి జిడ్డుగా మారుస్తాయి. వచ్చేసారి తలంటుకున్నప్పుడు షాంపూ మొత్తం పోయేలా తలను కడగండి.

కండీషనర్లు వాడటం తగ్గించండి

కండీషనర్లు వాడటం తగ్గించండి

కండీషనర్లు ఎప్పుడూ మీ వెంట్రుకల చివర్లన మాత్రమే అవి పొడిబారితే వాడండి. అవి జిడ్డుగా ఉండే జుట్టు కోసం కాదు. ఎందుకంటే అవి జుట్టుపై కోటింగ్ లా ఏర్పడతాయి. తేమను అందిస్తాయి. ఈ తేమ ఇంతకు ముందే ఉన్న జిడ్డుతనాన్ని పెంచుతుంది.

జుట్టు కుదుళ్ల దగ్గర, మాడుపై రుద్దకండి

జుట్టు కుదుళ్ల దగ్గర, మాడుపై రుద్దకండి

మీ జుట్టు కుదుళ్ల దగ్గర,మాడుపై రుద్దకండి లేదా గోకకండి. దీనివలన అక్కడి నూనెగ్రంథుల నుంచి మరింత నూనె స్రవిస్తుంది. ఇంకా జిడ్డుగా ఉండే చుండ్రు కూడా ఏర్పడుతుంది. అందుకని ముఖ్యంగా తల స్నానం చేసాక తలను అదే పనిగా రుద్దవద్దు.

బేబీ పౌడర్ వాడండి

బేబీ పౌడర్ వాడండి

బేబీ పౌడర్ జిడ్డుగా ఉన్న జుట్టును మామూలు చేయటంలో చాలా బాగా పనిచేస్తుంది. మీకు తలంటుకోటానికి సమయం లేనప్పుడు, కొంచెం బేబీ పౌడర్ ను జుట్టుపై చల్లుకోండి. తర్వాత జుట్టును చక్కగా దువ్వుకోండి అంతే. ఇలా చేయటం వలన అదనంగా ఉన్న జిడ్డు తొలగిపోవటమే కాక, మీ జుట్టు నుంచి మంచి వాసన కూడా వస్తుంది.

గుడ్ల సొన మాస్క్

గుడ్ల సొన మాస్క్

గుడ్ల సొనలో ప్రొటీన్ ఉంటుంది, ఇది మీ జుట్టును బలపర్చి, కాంతివంతంగా, మృదువుగా మారుస్తుంది. అందుకని ఇది మీ జుట్టు జిడ్డుతనాన్ని కూడా తగ్గిస్తుంది.

ఎలా వాడాలి ;

ఎలా వాడాలి ;

గుడ్లను పగలకొట్టి సొనను తీసి తేనె, టీ ట్రీ నూనె లేదా ఆలివ్ నూనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ పొడి జుట్టుకి పట్టించి 5 నుంచి 20 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత కడిగేయండి. ఈ చిట్కాను వారానికోసారి వాడితే ఫలితాలు వేగంగా కన్పిస్తాయి.

నిమ్మ

నిమ్మ

నిమ్మరసం మీ జుట్టు, చర్మంపై అద్భుతాలు చేస్తుంది. దీన్ని మీ జుట్టుకి సహజచిట్కాగా వాడాలనుకుంటే, రెండు నిమ్మకాయల రసాన్ని రెండు కప్పుల నీటితో కలిపి నిల్వ చేయండి. ప్రతిసారీ తలంటుకున్నప్పుడు మీ జుట్టును ఆరబెట్టాక, ఈ రసం, నీరు మిశ్రమంతో మసాజ్ చేసి మామూలు నీటితో తర్వాత కడిగేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Tips To Get Rid Of An Oily Scalp

    Tips To Get Rid Of An Oily Scalp,Oily and greasy scalp is always a nightmare for all the ladies out there. Instead of spending on the ready-made products or other chemical treatments, which are both harmful and expensive, you can keep in mind a few tips to get rid of oily hair.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more