For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీస్ పార్టీలో మిమ్మల్ని హైలైట్ చేసే ఈ క్విక్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్స్ ను ప్రయత్నించండి

|

ఆఫీసుకి వెళ్ళేది పనిచేయడానికే అన్న విషయం వాస్తవమే. కానీ, వర్క్ ప్లేస్ లో మన ఎపియరెన్స్ కూడా మన రెప్యుటేషన్ ను హైలైట్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి, ఎపియరెన్స్ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా మీరు అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అట్టైర్ విషయంలో కూడా శ్రద్ధ కనబరచాలి. అదే సమయంలో, హెయిర్ స్టైల్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆఫీస్ లో మన ఇమేజ్ అనేది మన అప్పీయరెన్స్ వలన పెరగాలి గాని తగ్గకూడదు.

రోజూ ఆఫీస్ కు వెళుతున్నప్పుడు రొటీన్ గా మీరు ఆఫీస్ కు వెళతారు. ప్రతి రోజూ ది బెస్ట్ గా కనిపించడం కాస్తంత కష్టతరమే. ఒకవైపు ఇంటినీ మరొకవైపు ఆఫీస్ ను బాలన్స్ చేస్తూ ప్రొఫెషనల్ అలాగే పెర్సనల్ లైఫ్ బాలన్స్ ని చేస్తున్న వారికి రోజూ ఆఫీస్ కి ప్రత్యేకంగా తయారై వెళ్లాల్సి రావడం కష్టతరంగా ఉండటం సహజమే. పైగా, ట్రాఫిక్ లో ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది కూడా.

కాబట్టి, మీరు ఆఫీస్ పార్టీలలో ది బెస్ట్ గా కనిపించేందుకు ప్రాధాన్యాన్నిఇవ్వండి. పార్టీలలో మీరు కచ్చితంగా మీ అట్టైర్ పై దృష్టి పెడతారు. అలాగే, హెయిర్ స్టైల్ పై కూడా మీరు శ్రద్ధ కనబరచడం తప్పనిసరి.

Top 5 Hairstyles You Must Try For Your Next Office Party

మీ హెయిర్ ను ఏ విధంగా స్టయిల్ చేసుకుంటారు అన్న విషయం అనేక ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంది. జుట్టు పొడవు, వాల్యూమ్ అలాగే థిక్నెస్ వంటివి హెయిర్ ని స్టైల్ చేసుకుంటున్నపుడు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి, ఈ విషయంలో మీకు సహాయం చేసేందుకు ఈ ఆర్టికల్ లో ఆఫీస్ పార్టీకై మీరెలా హెయిర్ ను స్టైల్ చేసుకోవాలో కొన్ని టిప్స్ ను అందించాము.

1. నాటెడ్ పోనీటెయిల్:

1. నాటెడ్ పోనీటెయిల్:

ముందుగా మీ హెయిర్ ను శుభ్రం చేసుకుని రిన్స్ చేసుకోండి. మీరు పాటించే రెగ్యులర్ పద్దతిలోనే షాంపూ మరియు కండిషనర్ తో రిన్స్ చేసుకోండి. మీ హెయిర్ ఆరిపోయినప్పుడు, ఏదైనా హీట్ ప్రొటెక్షన్ ను ప్రయత్నించి ఆ తరువాత హెయిర్ ను కర్ల్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఇంచ్ హెయిర్ ను కర్లింగ్ ఐరన్ లో కి తీసుకుని హెయిర్ కు బౌన్సీ లుక్ ను అందించండి. ఇప్పుడు, పోనీ టెయిల్ ను వేసుకోండి.

హెయిర్ మొత్తాన్నీ పోనీ టెయిల్ గా మార్చకండి. కొంత హెయిర్ ను పోనీ కింద ఉండేలా చూసుకోండి. అంటే, మెడ వెనుక భాగం వద్ద కాస్తంత హెయిర్ ను ఫ్రీగా వదలండి. ఆ తరువాత హెయిర్ స్ప్రే ను చల్లుకోండి. ఇప్పుడు పెర్ఫెక్ట్ లుక్ వస్తుంది. రోజంతా ఈ లుక్ క్యారీ అవుతుంది.

ఇప్పుడు, ఫ్రీ గా ఉంచిన హెయిర్ ను సెక్షన్స్ గా తీసుకుంటూ ఎలాస్టిక్ బ్యాండ్ పై నుంచి కవర్ చేసుకుంటూ రావాలి. ఇలా రెండు వైపులా బాటమ్ సెక్షన్స్ అన్నీ కవర్ అయ్యేలా ఒక దానిపై ఒకటి x షేప్ లో లేస్ చేయాలి. ఆఖరి స్టెప్ గా, ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ తో హెయిర్ ను టై చేయాలి. ఇప్పుడు, ఈ నాటెడ్ పోనీటెయిల్ లుక్ తో ఆఫీస్ పార్టీలో రాక్ చేయండి.

2. సైడ్ స్వెప్ట్ ఫిష్ టెయిల్ బ్రెయిడ్:

2. సైడ్ స్వెప్ట్ ఫిష్ టెయిల్ బ్రెయిడ్:

ఈ హెయిర్ స్టైల్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే జుట్టు తడిగా ఉండగానే వేవీ స్ప్రేను అప్లై చేయాలి. హెయిర్ మొత్తం ఈ స్ప్రేను చల్లడం వలన స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఈ స్టెప్ ను పాటిస్తేనే ఫిష్ టెయిల్ బ్రెయిడ్ అనేది సరిగ్గా కుదురుతుంది. ఇలా చేసిన తరువాత, మీ హెయిర్ అంతటినీ ఒక సైడ్ కి తీసుకువచ్చి హెయిర్ ను రెండు ఈక్వల్ పార్ట్శ్ గా డివైడ్ చేయండి.

ఇప్పుడు, హెయిర్ ను సాధారణంగా ఎలా అల్లుకుంటారో అదే విధంగా అల్లుకోవడం ప్రారంభించండి. అయితే, అల్లేటప్పుడు ప్రతీసారి అదనపు హెయిర్ ను అల్లికలో జోడిస్తూ ఉండాలి. ఇలా రెండవ సెక్షన్ హెయిర్ మొత్తం అల్లికలో జోడయ్యే విధంగా చేయాలి.

మీ హెయిర్ ఒత్తుగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ కాస్తంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకవేళ మీ హెయిర్ పలచగా ఉంటే ఈ ప్రాసెస్ కొంచెం తక్కువ సమయంలో పూర్తవుతుంది. ఇలా అల్లటంలో మీరు ప్రావీణ్యత సాధించాక ఈ హెయిర్ స్టైల్ అనేది మీకు సులువుగా మారుతుంది. ఈ హెయిర్ స్టైల్ లుక్ ను మరింత పెంపొందించేందుకు మీరు హెయిర్ ను మరింత సహనంతో చక్కగా అల్లాలి. ఈ లుక్ అనేది ఈసారి ఆఫీస్ పార్టీలో మిమ్మల్ని కచ్చితంగా హైలైట్ చేస్తుంది.

3. ట్విస్టెడ్ అప్ డూ:

3. ట్విస్టెడ్ అప్ డూ:

మీ హెయిర్ ను మూడు ఈక్వల్ సెక్షన్స్ గా డివైడ్ చేసుకోండి. ముందు భాగంలోని రెండు సెక్షన్స్ కి తక్కువ అమౌంట్ లోని హెయిర్ సరిపోతుంది. వెనక భాగంపై కాస్తంత ఎక్కువ అమౌంట్ లో హెయిర్ అవసరం. వెనుకవైపు సెక్షన్ ను బన్ లా ట్విస్ట్ చేయండి. ఫ్రంట్ సెక్షన్ లోని రెండు భాగాలలో ప్రతి భాగాన్ని రెండు ఈక్వల్ పార్ట్శ్ లా డివైడ్ చేయండి. ఇప్పుడు ప్రతి సెక్షన్ ని ఒక డైరెక్షన్ లో ట్విస్ట్ చేసి ఆ తరువాత అపోజిట్ డైరెక్షన్ లో ట్విస్ట్ చేయండి. రోప్ బ్రెయిడ్ వచ్చే విధంగా ఇలా చేయండి.

ఇప్పుడు రోప్ బ్రెయిడ్స్ ను మీ బన్ కి ఒక క్లిప్ సహాయంతో పిన్ చేయండి. ఇప్పుడు హెయిర్ స్ప్రే ను అప్లై చేస్తే హెయిర్ స్టయిల్ కుదురుగా ఉంటుంది.

4. వాటర్ ఫాల్ బ్రెయిడ్:

4. వాటర్ ఫాల్ బ్రెయిడ్:

ఇది ఇంకొక స్టైలిష్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ ను ట్రై చేసే ముందు హెయిర్ ను శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్స్ చేసుకోవాలి. ఆ తరువాత హెయిర్ ను ఆరబెట్టుకోవాలి. స్మార్ట్ సైడ్ పార్ట్ గా జుట్టును డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ లైన్ వద్ద మూడు ఈక్వల్ పోర్షన్స్ లో హెయిర్ ను తీసుకుని ఫ్రెంచ్ బ్రెయిడ్ ను చేసుకోవాలి.

క్రాస్ సెక్షన్ ని మిడిల్ పీస్ పార్ట్ కి దగ్గరగా ఉండే విధంగా క్రాస్ చేస్తూ ఈ ప్రాసెస్ ని ప్రారంభించవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు క్రాసోవర్ వీవ్ మధ్యలో కొంత ఏరియాను వదిలేసి హెయిర్ లోని మిగతా సెక్షన్ ని దాని మీంచి డ్రాప్వ చేయాలి.

ఇప్పుడు మరికొంత హెయిర్ ను జోడించాలి. అలా హెయిర్ మొత్తాన్ని కవర్ చేయాలి. హెయిర్ మొత్తం కుదురుగా ఉండేందుకు క్లిప్స్ ని వాడాలి.

 5. జంబో డచ్ బ్రెయిడ్:

5. జంబో డచ్ బ్రెయిడ్:

ఈ హెయిర్ స్టైల్ అనేది ఒత్తైన శిరోజాలు ఉన్నవారికి బాగా సూట్ అవుతుంది. మొదటగా, హెయిర్ ను మూడు సెక్షన్స్ గా డివైడ్ చేయండి. ఆ తరువాత, జుట్టును అల్లడం ప్రారంభించాలి. అల్లేటప్పుడు మధ్య పాయకి కిందగా ఉన్న పార్ట్ ని కలుపుకుంటూ అల్లాలి. ఇలా చేసిన తరువాత, మీరు మీ చెవికి దగ్గరగా ఉన్న పాయను అల్లాలి(కొత్త మిడిల్ స్ట్రాండ్ కింద ఉన్న పాయ).

English summary

Top 5 Hairstyles You Must Try For Your Next Office Party

Attending an office party requires a lot of things, including chic clothes, proper hairdo and makeup. When choosing a hairstyle for an upcoming office party, make sure to check out the trendy hairstyles of the season. The next office party you attend, ditch the hair ties and bobby pins and let your hair down with those wavy curls and curves.
Desktop Bottom Promotion