Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
గృహ వైద్యంతో మాడుపై జిడ్డుకు సెలవు చెప్పండి!
మనలో చాలా మందికి తల పై చర్మం జిడ్దోడుతూ ఉంటుంది. దీనివలన ప్రతిదినం తలస్నానం చేయవలసి వస్తుంది. ప్రతి రోజు తలంటుకోవడమంటే కొన్నిసార్లు అసౌకర్యంగా అనిపించవచ్చు. ముఖ్యంగా అధిక కేశ సంపద ఉన్న వారికి మరీ ఇబ్బందిగా ఉంటుంది. అధికంగా షాంపూ చేసుకోవడం వలన జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతే కాక సహజంగా కురులకుండే తేమను కోల్పోతాయి.
సాధారణంగా వారానికి రెండు సార్లు తల రుద్దుకోవాలని పెద్దలు చెప్తారు. కాని మాడు జిడ్డుగా ఉండే వాళ్లకు ఇది సాధ్యపడదు. జుట్టు జిడ్డ్డుగా ఉంటే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది.
మాడు జిడ్డుగా ఉండటానికి కారణాలు అనేకం ఉంటాయి. దీనికి సముతులాహార లేమి, ఒత్తిడి, అధికంగా రసాయన ఉత్పత్తులు వాడటం లేదా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకడం కారణాలు కావొచ్చు. దీనివలన మాడు దురదగా, జుట్టు జిడ్డుగా, నిర్జీవంగా తయారవుతుంది.
ఇటువంటి సమస్యలు మీకున్నట్లయితే, మన ఇంట్లో సాధారణంగా ఉండే కొన్ని రకాల పదార్ధాలతో ఉపశమనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. అప్పటికి మీ సమస్య పరిష్కరింపబడకపోతే చర్మ వైద్యుడిని సంప్రదించాల్సిందే!
ఆ గృహ వైద్య చిట్కాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం!

1. తినే సోడా:
మాడుపై అధికంగా ఉత్పత్తి అయ్యే జిడ్డును పీల్చుకునే లక్షణం దీని సొంతం. దీనిలోని క్షార గుణం pHను బాలన్స్ చేస్తుంది. బేకింగ్ సోడా ను నీటితోకలిపి మాడుకు మాత్రమే పై పూతగా వెయ్యండి. జుట్టు మొత్తానికి రాయకండి. 15-20 నిమిషాలు ఉంచి షాంపూతో కడిగేయండి. తరువాత కండిషన్ చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన జిడ్డుతో పాటుగా దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

2. కలబంద గుజ్జు:
కలబంద గుజ్జు మాడుపై ఉన్న మలినాలు తొలగించడమే కాకుండా పోషణను అందిస్తుంది. కలబందలో ఉండే విటమిన్లు సీబం ఉత్పత్తిని నియంత్రిస్తుంది. కలబంద గుజ్జును మాడుతో పాటుగా జుట్టంతటికి పట్టించండి.
పదిహేను నిమిషాలపాటు అది బాగా అరెదాక ఉంచి షాంపూతో కడిగేయండి. ఇది మంచి కండీషనర్ మాత్రమే కాదు జుట్టును మెరిసే మెత్తటి కుచ్చులా మారుస్తుంది.

౩. యాపిల్ సిడార్ వెనిగర్:
దీనికి తలపై చర్మం యొక్క నూనెల ఉత్పత్తి స్థాయిని మరియు pHను బాలన్స్ చేస్తుంది. దీనికి గాఢమైన వాసన ఉన్నప్పటికీ, నీటితో కడిగేయడం వలన అది తగ్గిపోతుంది.
మూడు భాగాల నీటిలో ఒక భాగం యాపిల్ సిడార్ వెనిగర్ ను కలిపి మాడుకు బాగా పట్టించండి. దానిని శుభ్రంగా ఆరనిచ్చి షాంపూ తో కడిగేయండి. ఇది చుండ్రును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

4. నిమ్మ రసం:
నిమ్మ రసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం మీ కురుల pH ను సమతుల స్థాయికి తీసుకురావడానికి దోహదపడుతుంది. అంటే కాకుండా ఇది సీబం ఉతపత్తిని సాధారణ స్థితికి తీసుకువస్తుంది. మీరు జుట్టును షాంపూ చేసుకోవడానికి అరగంట ముందు మాడుకు శుభ్రంగా పట్టేలా నిమ్మరసాన్ని రాసుకోండి. ఇలా షాంపూ చేసుకున్న ప్రతిసారి చేయటం వలన మీ తలపై చర్మంలో నూనెల ఉత్పత్తి తగ్గుతుంది.

5. గ్రీన్ టీ:
గ్రీన్ టీ మాడును జుడ్డుపట్టకుండా ఉంచుతు తేమని అందిస్తుంది. మీ తలపై మొటిమలు లేదా కురుపులు ఉన్నట్లయితే గ్రీన్ టీ అధిక సీబం ఉత్పత్తిని తగ్గించి తద్వారా మీ సమస్యను పరిష్కస్తుంది.
ఒక మగ్గులో గ్రీన్ టీని తయారు చేసి చల్లార్చండి. మీ జుట్టును షాంపూ చేసుకున్నాక గ్రీన్ టీతో కడిగేయండి.ఇలా చేయడం వలన జిడ్డు తొలగడమే కాకుండా మీ కురులు మృదువుగా మెరుపులీనుతాయి.

6. టొమాటో:
టొమాటోలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. నిమ్మ రసంలో కనుక సిట్రిక్ ఏసిడ్ గాఢత ఎక్కువగా ఉంటుందని మీకనిపిస్తే టొమాటోని వాడవచ్చు. దీనిలో సిట్రిక్ ఆమ్ల గాఢత తక్కువ. టొమాటో గుజ్జును మాడుకు బాగా పట్టించి, అరగంటసేపు ఉంచుకోవాలి. తరువాత మీ జుట్టును షాంపూ మరియు కండీషనింగ్ చేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేయటం వలన మంచి ఫలితముంటుంది.



Click it and Unblock the Notifications