For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై హెయిర్ (పొడిజుట్టు) వల్ల కలిగే సమస్యలు ఏమిటి ? ఈ సమస్యలను దూరంగా ఉంచడానికి మీరు ఈ 8 చిట్కాలను ప్రయత్నించండి !

|

పొడిజుట్టు ! వేగంగా కదిలే మన జీవితాల్లో చాలామంది సాధారణంగా అనుభవించే ఒక బాధాకరమైన సమస్య ఇది. దీనికి గల కారణాలు చాలానే ఉండవచ్చు కానీ, దాని ఫలితంగా మన ప్రతిరూపాన్ని ప్రభావితం చేసే పొడిజుట్టు మనల్ని అందవిహీనంగా కనపడేలా చేస్తుంది. కానీ మీరు చింతించకండి !

పొడిజుట్టు నిర్వహణకు సంబంధించి చేయవలసిన పనులను & చేయకూడని పనులు జాబితాను సిద్ధం చేశాము. అవి ఖచ్చితమైన ఫలితాలను తీసుకురాగలవు.

పొడిజుట్టు ఏర్పడటానికి గల కారణాలేమిటి?

జుట్టు పొడిగా మారడానికి చాలా రకాల అంశాలు కారణాలుగా ఉన్నాయి. వాటిలో అతి సాధారణమైనవి కొన్ని ఈ క్రింద తెలుపబడ్డాయి. అవి,

1. హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను (లేదా) టూల్స్ను తరచుగా వాడటం.

2. హెయిర్ డైస్ను ఎక్కువగా వాడటం.

3. మన చుట్టూ ఉన్న పర్యావరణం.

4. ఎక్కువ తలస్నానం చేయడం.

5. పోషకాహారం లోపం.

6. థైరాయిడ్ సంబంధిత రుగ్మతలు.

పొడిజుట్టును వదిలించుకోవటానికి పాటించవలసిన చిట్కాలు !

పొడిజుట్టును వదిలించుకోవటానికి పాటించవలసిన చిట్కాలు !

మీరు పొడిజుట్టు సమస్యలను అధిగమించడానికి ఎక్కువ చిట్కాలను అనుసరించినట్లయితే మీరు ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు.

1. తేలికపాటి షాంపూ ఉపయోగించండి:

మీరు పొడిజుట్టు సమస్యలతో బాధపడుతున్నట్లయితే, మీరు జుట్టును శుభ్రపరచుటకు ఒక తేలికపాటి షాంపూని ఉపయోగించడం మంచిది. రసాయనాలతో కూడిన షాంపూలను ఉపయోగించడం వల్ల మీ జుట్టు సంరక్షించడంలో మాడు పై ఉత్పత్తి అయ్యే సహజమైన శ్లేష్మమును కోల్పోయేలా చేస్తుంది, అది మీ జుట్టును & మాడును మరింత కఠినంగా మారేలా చేస్తుంది. అయితే, మీరు తేలికపాటి షాంపూను ఉపయోగించడం వల్ల మీ జుట్టును ఇంకా సమర్థవంతంగా శుభ్రపరచి, మీ జుట్టుకు & మాడుకు ఏ హానిని కలుగజేయదు, ఇంకా మీ జుట్టుకు కూడా ఎలాంటి అలెర్జీలను కలుగచేయదు.

2. కండీషనర్ను తప్పక ఉపయోగించండి :

2. కండీషనర్ను తప్పక ఉపయోగించండి :

షాంపూ అనేది జుట్టును శుభ్రం చేయడానికి మాత్రమే అవసరమవుతుంది, దీనితో పాటు కండిషనింగ్ కూడా సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉంది కాబట్టి దీనిని ఎప్పుడూ ఉపయోగించాలి. మీ జుట్టును షాంపూతో పూర్తిగా శుభ్రం చేసిన తరువాత జుట్టుకు కండీషనర్ను అప్లై చేయాలి. అయితే ఈ కండిషనర్ను మీ జుట్టుకు మాత్రమే అప్లై చేయాలి, మాడుకు కాదు. కండీషనర్ను అప్లై చేసిన 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత శుభ్రం చేసుకోవడం ద్వారా శుభ్రమైన, కాంతివంతమైన, మెరిసే జుట్టును మీరు పొందగలరు.

3. మీ జుట్టుకు సరిపడే హెయిర్ ప్రొడక్ట్స్ను మాత్రమే ఉపయోగించండి :

3. మీ జుట్టుకు సరిపడే హెయిర్ ప్రొడక్ట్స్ను మాత్రమే ఉపయోగించండి :

జుట్టు సంరక్షణ కోసం వాగ్దానాలు చేసే అనేక రకాలైన హెయిర్ ప్రొడక్ట్స్ను చూడగానే, మనలో చాలామంది కొనుగోలు చేసే అలవాటును కలిగి ఉంటారు. ఉదాహరణకు, మీ జుట్టు సహజసిద్ధంగా మెరుస్తూ, పొడవుగా, పట్టులాంటి పటుత్వాన్ని కలిగి ఉండటంతో పాటు, జుట్టు ఊడిపోవటాన్ని నిరోధించేందిగా మీకు భరోసా ఇవ్వవచ్చు. కానీ, జుట్టు మీద చాలా రకాల ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల, జుట్టు నాణ్యతలో ప్రతికూలమైన ప్రభావమును కలుగజేస్తాయి ? అందువల్ల, మీ జుట్టును సూర్యరశ్మి, దుమ్ము-ధూళి, కాలుష్యం నుండి రక్షించడమే కాక, మీ జుట్టును ఎల్లప్పుడూ తేమగా ఉంచడం సహాయపడే కొన్ని పరిమితమైన హెయిర్ ప్రొడక్ట్స్ను మాత్రమే ఉపయోగించడానికి మీరు కట్టుబడి ఉండటం మంచిది.

4. హీట్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మానుకోండి:

4. హీట్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మానుకోండి:

రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం మీ జుట్టును అధికంగా మండించే "హెయిర్ హీట్ టూల్స్ను" మీ జుట్టుకు ఉపయోగించడం చాలా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మీ జుట్టుకు దీర్ఘకాలం పాటు హానిని కలుగ చేసే హీట్ ప్రొడక్ట్స్ నివారించడం చాలా మంచిది.

5. కెమికల్ ప్రొడక్ట్స్కు బదులుగా నేచురల్ ప్రొడక్ట్స్ను వాడండి :

5. కెమికల్ ప్రొడక్ట్స్కు బదులుగా నేచురల్ ప్రొడక్ట్స్ను వాడండి :

రసాయన పదార్ధాలతో కూడిన ప్రొడక్ట్స్ మీ జుట్టుకు చాలా చెడు ప్రభావాన్ని కలుగజేసి, నిర్జీవంగా మారుస్తాయి. మీ జుట్టును సంరక్షించడానికి & తేమగా ఉంచడంలో సహాయపడే సహజసిద్ధమైన ఉత్పత్తులను అనగా కొబ్బరినూనె, ఆర్గాన్ ఆయిల్, బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, అవోకాడో ఆయిల్, షియా బట్టర్, రోజ్ వాటర్, క్లే, చార్ కోల్, తేనె వంటి వాటిని వాడటం వల్ల కాంతివాంతమైన జుట్టును పొందగలరు.

6. గుడ్డుతో చేసిన హైయిర్ ప్యాక్స్ అద్భుతాలు చేస్తాయి:

6. గుడ్డుతో చేసిన హైయిర్ ప్యాక్స్ అద్భుతాలు చేస్తాయి:

గుడ్డు తెల్లసొన & ఆలివ్ నూనెతో తయారుచేసిన హైయిర్ ప్యాక్ - మీ పొడిజుట్టు పై అద్భుతాలను చేయగలదు. గుడ్డులో ఉన్న తెల్లసొనను తీసుకొని, దానిని బాగా చిలికి, దానికి ఆలివ్ నూనెను కలపాలి. ఆ తర్వాత ఈ 2 పదార్థాలను బాగా మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేసే ముందు, మీ జుట్టు కాస్త తడిగా ఉండేలా చూసుకోవాలి. ఒక్క 15-20 నిమిషాల తర్వాత, చల్లని నీటితో మీ జుట్టును కడగాలి. ఆ తర్వాత మీ జుట్టు మెరిసేలా & మృదువుగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు.

7. మీ జుట్టుకు అలోవేరానే మంచి పరిష్కారం:

7. మీ జుట్టుకు అలోవేరానే మంచి పరిష్కారం:

అలోవేరాలో ఉండే వైద్య లక్షణాలు బాగా ప్రాచుర్యం పొందాయి, అలాగే ఇది మీ పొడిజుట్టును చాలా లాభదాయకంగా ఉంటుంది ! మీ మాడు పై అలోవేరా జెల్తో తేలికగా రుద్దడం వల్ల మీ జుట్టు ఫొలికల్స్లోకి చొచ్చుకుపోయి, మీ జుట్టును మరింత సున్నితంగా మారుస్తుంది. మీరు ఒక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయడానికి ఒక గంట ముందు అలోవేరా జెల్ను మీ జుట్టుకి రాసుకోండి.

8. మీ జుట్టుకు అరటి చాలా మంచిది :

8. మీ జుట్టుకు అరటి చాలా మంచిది :

మన శరీరమును & మనసును చైతన్యంగా ఉంచటంలో, ఆరోగ్యకరమైన పండుగా అరటిని పిలుస్తారు, అలాగే ఇది మీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. మీ మాడు పొడిగా మారటం వల్ల జుట్టు చిట్లిపోవడం, డాండ్రఫ్ వంటి జుట్టు సమస్యలకు కారణమవుతుంది. అరటిలో సహజసిద్ధంగా ఉండే ఆయిల్స్, పొటాషియం, విటమిన్స్ వంటివి మీ జుట్టును సహజసిద్ధంగా సంరక్షించడంతో పాటు జుట్టు చివర్లలో ఏర్పడే పగుళ్లను నివారించడంలో సహాయపడుతుంది. చివరగా, ఇది మీ జుట్టును సున్నితంగా ఉంచేందుకు అవసరమైన తేమను అందిస్తుంది.

కాబట్టి, మీరు పైన తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల పొడిజుట్టు సమస్యలకు దూరంగా ఉండగలరు & ఫలితంగా అందమైన కేశసంరక్షణను దీర్ఘకాలంపాటు కలిగి ఉంటారు.

English summary

Dry Hair Problems? Try These 10 Tips & Keep Dry Hair Problems At Bay

Dry hair - a common woe experienced by many of us. The reasons could be many, but the result is the dry dull hair that has the tendency to affect our appearance. Dry hair can be caused due to a number of reasons. But, it can be treated easily using home remedies such as olive oil, avocado, eggs, and aloe vera.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more