For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖచ్చితంగా తలరుద్దుకోవడానికి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలిసి ఉండకపోవచ్చు!

ఖచ్చితంగా తలరుద్దుకోవడానికి సంబంధించిన ఈ విషయాలు మీకు తెలిసి ఉండకపోవచ్చు!

|

మార్కెట్లో రకరకాల షాంపూలు, కండీషనర్లు లభించడం వలన ఏది కొనుగోలు చేస్తే మేలనే సందిగ్ధానికి లోనవుతాం. వ్యాపార ప్రకటన్లలో గందరగోళంతో కూడిన సమాచారం అందిస్తారు. కొన్నిసార్లు ఇవి మనను తప్పుదోవ పట్టిస్తాయి. కనుక, ఈ సామాగ్రిని ఎంపిక చేసుకునే ప్రక్రియలో, మీ మనసు చెప్పిన మాట వినండి.

మంచి పోషకాలతో కూడిన ఆహారం మాత్రమే ఆరోగ్యమైన మరియు బలమైన కేశాలను పొందడానికి దగ్గర దారి. నిజానికి, రసాయనాలతో కూడిన షాంపూలు జట్టులో ఉండే పోషకాలను హరించివేస్తాయి.

We Bet You Didnt Know These Things About Shampooing Your Hair!

ఇప్పుడు, మీ జుట్టును షాంపూ చేసుకున్న ప్రతిసారి, మీ మనసులో ఉంచుకోవలసిన పది విషయాలను గురించి తెలుసుకుందాం.

1. అన్ని గృహవైద్య చికిత్సలు అత్యుత్తమం కాకపోవచ్చు:

1. అన్ని గృహవైద్య చికిత్సలు అత్యుత్తమం కాకపోవచ్చు:

కేశాలకు గృహవైద్య విధానాలు ప్రతిసారి మంచి చేయకపోవచ్చు. అనాదిగా ఈ చిట్కాలు, ఒక తరం నుండి ఇంకో తరానికి అందించబడ్డాయి. కానీ ఇవి జుట్టు యొక్క నాణ్యత మరియు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు, చుండ్రు నివారణకు మాడుపై నిమ్మకాయను రుద్దుకోవడం వలన, చర్మం ఇంకా పొడిబారిపోయి, కురుపులు అయ్యే అవకాశం ఉంది.

2. కొంచెం షాంపూ వాడితే అదే చాలా ఎక్కువ!:

2. కొంచెం షాంపూ వాడితే అదే చాలా ఎక్కువ!:

మీరు ఎక్కువ షాంపూతో బాగా మాడును రుద్దుకుంటే జుట్టు బాగా శుభ్రపడుతుంది అనే ఉద్దేశ్యం కలిగి ఉండవచ్చు. కానీ అది నిజం కాదు. ఎక్కువ షాంపూ వాడినపుడు, నురుగు ఎక్కువగా ఏర్పడి, అది మీ కుదుళ్లను పూడ్చేసి, మురికి, జిడ్డును పట్టి ఉంచుతుంది. షాంపూచేసుకున్న అనంతరం ప్రతిసారి కండీషనర్ వాడటం వలన జుట్టు పొడిబారకుండా, కురులు తేమతో నిండి ఉంటాయి.

3. మీ జుట్టు ఒక ఖచ్చితమైన షాంపూకి అలవాటు పడటం అంటూ ఉండదు:

3. మీ జుట్టు ఒక ఖచ్చితమైన షాంపూకి అలవాటు పడటం అంటూ ఉండదు:

మీరు షాపింగ్ కి వెళ్లిన ప్రతిసారి, ఇదివరకు వాడిన షాంపూ నప్పలేదని,ఒక కొత్తరకం షాంపూ కొంటూ ఉంటారా? అయితే మీరు తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే, మీ జుట్టు ఏ షాంపూకి అలవాటుపడదు. ఎప్పుడూ సల్ఫేట్ లేని మామూలు షాంపూ కొనండి. షాంపూ మీ మాడును శుభ్రపరచడం మాత్రమే చేస్తుంది. దాని కన్నా మీరు వాడే కండీషనర్, మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.

4. ప్రతిఒక్కరికి తలరుద్దుకోవడానికి తమకు నప్పే పద్ధతి, రివాజు ఉంటుంది:

4. ప్రతిఒక్కరికి తలరుద్దుకోవడానికి తమకు నప్పే పద్ధతి, రివాజు ఉంటుంది:

ప్రతిఒక్కరు, ప్రతిరోజూ జుట్టును శుభ్రఓరచుకోవలసిన అవసరం లేదు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, ప్రతి వ్యక్తికి తన కేశాల తీరును అనుసరించి, తలరుద్దుకునే క్రమం ఒకటి ఉంటుంది. అది తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఒకసారి మీరు ఇది తెలుసుకుంటే, మీరు ఏ షాంపూ వాడుతున్నారనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే, ఏ షాంపూ వాడినప్పటికీ, మీ జుట్టు రాలకుండా, ఆరోగ్యంగా ఉంటుంది.

5. తల రుద్దుకునే ముందు మీ జుట్టును నానబెట్టండి:

5. తల రుద్దుకునే ముందు మీ జుట్టును నానబెట్టండి:

మీ తలను రుద్దుకోబోయే ముందు మీ జుట్టును నానబెట్టకపోతే, మీరు ఊహించిన దానికన్నా మీ జుట్టుకు ఎక్కువ నష్టం చేసుకున్న వారవుతారు. జుట్టును నానబెట్టడం వలన షాంపూ పలుచబడి, జుట్టంతా వ్యాపిస్తుంది. ఇలా చేయకపోతే, మీ మాడు షాంపూ పూసుకోవడం వలన,అక్కడ ఉండే జుట్టు పలుచబడిపోతుంది. కండీషనర్ రాసుకునే ముందు, జుట్టును శుభ్రంగా షాంపూ మొత్తం తొలగిపోయేలా కడుక్కోండి.

6. ఎప్పుడూ జుట్టును చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి:

6. ఎప్పుడూ జుట్టును చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి:

మీ జుట్టును వేడి నీటితో శుభ్రం చేసుకోవడం వలన, జట్టులో సహజంగా ఉండే అత్యవసర తైలాలు తొలగింపబడటమే కాక కుదుళ్ళు బలహీనంగా మారతాయి. మీ జుట్టును చల్లని నీటితో శుభ్రం చేసుకున్నప్పుడు, కుదుళ్ళు గట్టిపడి, మూసుకుని వెంట్రుకను దృఢంగా పత్తి ఉంచుతాయి. మీరు చల్లని నీటిని భరించలేనట్లైతే, గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. కానీ వారానికి మూడుసార్లు కంటే ఎక్కువగా ఇలా చేయరాదు. చల్లని నీరు వెంట్రుకల పై కండీషనర్ ను అట్టేపట్టి ఉంచుతుంది, కనుక జుట్టు అధిక సమయం పాటు తేమగా ఉంటుంది.

7. షాంపూలో ఉన్నాయని చెప్పే ఫాన్సీ పదార్ధాల పేరు విని మోసపోకండి:

7. షాంపూలో ఉన్నాయని చెప్పే ఫాన్సీ పదార్ధాల పేరు విని మోసపోకండి:

షాంపూలలో గ్లైకాల్ డైస్టీరేట్, కోకామిడోప్రొపైల్ బిటైన్, అమ్మోనియం లారైల్ సల్ఫేట్, సైక్లోమేథికాన్ ఆక్టైల్ సాల్సిలేట్ మరియు నీరు వంటి పదార్థాలు ఉంటాయి. వివిధ పదార్థాలు, జుట్టు సంరక్షించే వివిధ ప్రత్యేక విధులు నిర్వర్తిస్తాయి. ఒక్క ఆయుర్వేద షాంపూలు తప్పితే మిగిలిన షాంపూలు ప్రయోగశాలలో తయారు చేయబడతాయి. వీటిలో ప్రకృతి సహజమైన పదార్థాలు అయిన పువ్వులు, కూరగాయలు మరియు మట్టి కాకుండా, రసాయన పదార్థాలు ఉంటాయి. కనుక వాణిజ్య ప్రకటనలను చూసి మోసపోకండి.

8. షాంపూ రాసుకున్నాక మాడును రుద్దకండి:

8. షాంపూ రాసుకున్నాక మాడును రుద్దకండి:

మర్దన చేసుకోవడానికి, రుద్దడానికి చాలా తేడా ఉంది. వేళ్ళ కొనలతో సున్నితంగా షాంపూ ను మాడుపై మర్దన చేసుకోవాలి. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, నురుగు ఏర్పడటం అనేది ముఖ్యం కాదు. ఒకవేళ మీకు జిడ్డు వదలనట్టు అనిపిస్తే, రెండవసారి షాంపూ రాసుకోండి. మాడును పట్టి పట్టి రుద్దితే, జుట్టు బలహీనపడుతుంది. దీని మూలంగా జుట్టు రాలడం మొదలవుతుంది. మీరు వాడే షాంపూ ఎంత ఖరీదైనది అయినా ఫలితం ఉండదు.

9. షాంపూ చేసుకోవడం జుట్టును శుభ్రపరచుకోవడంలో అతి ముఖ్యమైన భాగం కాదు:

9. షాంపూ చేసుకోవడం జుట్టును శుభ్రపరచుకోవడంలో అతి ముఖ్యమైన భాగం కాదు:

జుట్టును శుభ్రపరచుకోవడంలో , షాంపూ చేసుకోవడం కేవలం ఒక భాగం మాత్రమే. షాంపూ చేసుకోవడానికి ముందు, జుట్టుకు నూనె రాసుకుని ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకుని, గంటసేపు ఆగు, షాంపూతో రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. తరువాత కండీషన్ చేసుకుని, జుట్టును శుభ్రంగా కడగాలి. తరువాత తువ్వాలుతో పొడిగా ఒత్తుకుని లీవ్-ఇన్ కండీషనర్ లేదా సీరం రాసుకుంటే, జుట్టు చిక్కుపడదు.

10. డ్రై షాంపూ మరీ నష్టకారి కాదు:

10. డ్రై షాంపూ మరీ నష్టకారి కాదు:

సాధారణంగా, డ్రై షాంపూ జుట్టుకు నష్టం కలిగిస్తుందని అపోహపడతారు కానీ అది నిజం కాదు. డ్రై షాంపూ వాడటంవలన జుట్టు ఉపరితలంపై పేరుకున్న జిడ్డు తొలగి, కేశాలు తాజాగా కనిపిస్తాయి. సమయాభావం కలిగినప్పుడు వీటిని వాడవచ్చు. అయినప్పటికీ, వారానికి రెండుసార్లు మించి వరుసగా వాడరాదు.


English summary

We Bet You Didn't Know These Things About Shampooing Your Hair!

While we resort to traditional Indian home remedies when our hair gets too dry, it isn't always the best thing to do. One should know how to choose a good shampoo and how to shampoo their hair properly. When you use too much shampoo, the lather formed can block hair follicles and keep the dust and oil locked in.
Story first published:Tuesday, July 3, 2018, 18:27 [IST]
Desktop Bottom Promotion