కర్లీ (రింగురింగుల జుట్టు)హెయిర్ కోసం ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే అద్భుతమైన హెయిర్ మాస్క్స్

Subscribe to Boldsky

ఉంగరాల జుట్టు కలిగిన మగువలకు ఈ రకమైన జుట్టువలన వలన కలిగే కష్టనష్టాలు బాగా పరిచయమే. సరైన కేర్ తీసుకోకపోతే ఇటువంటి హెయిర్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం.

ఇవన్నీ పక్కన పెడితే, ఉంగరాల జుట్టు కలిగిన వారు అందంగా కనిపించడం సహజం. ఉంగరాల జుట్టు సంరక్షణకై ఎన్నో కాస్మెటిక్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే, DIY నేచురల్ హెయిర్ మాస్క్స్ కు ఇవేమీ సాటి రావు.

ఈరోజు బోల్డ్ స్కై లో ఉంగరాల జుట్టుని ఆరోగ్యంగా అందంగా ఉంచేందుకు తోడ్పడే DIY హెయిర్ మాస్క్ ల గురించి ప్రస్తావించాము.

Wonderful DIY Hair Masks For Curly Locks

ఈ DIY మాస్క్స్ లనేవి సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్నవి. అలాగే, శిరోజాల సంరక్షణకు అవసరమైన న్యూట్రియెంట్స్ తో పాటు విటమిన్స్ కూడా వీటిలో పుష్కలంగా లభిస్తాయి. అందువలన, మీ ఉంగరాల జుట్టు మరింత ప్రకాశవంతంగా అలాగే ఆరోగ్యంగా మారేందుకు అవకాశాలు పుష్కలం.

ఈ ఆల్ నేచురల్ హెయిర్ మాస్క్ లపై ఓ లుక్కేయండి మరి:

మాస్క్ 1: యోగర్ట్ మరియు కోకోనట్ ఆయిల్

మాస్క్ 1: యోగర్ట్ మరియు కోకోనట్ ఆయిల్

ఎలా వాడాలి:

-ఒక పాత్రని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ యోగర్ట్ ని అలాగే రెండు టీస్పూన్ల కోకోనట్ ఆయిల్ ని కలపాలి.

-ఈ మిశ్రమం పేస్ట్ లా తయారయ్యే వరకు బాగా కలపాలి.

-ఇప్పుడు మీ హెయిర్ ను సెక్షన్స్ గా డివైడ్ చేయండి. ఈ మాస్క్ తో స్కాల్ప్ పై బాగా మసాజ్ చేయండి.

-ఇప్పుడు మీ హెయిర్ ని డ్రై షవర్ క్యాప్ తో కవర్ చేయండి.

-ఈ మాస్క్ ని ఒక గంటపాటు అలాగే ఉంచండి.

-ఇప్పుడు మీ హెయిర్ ని గోరువెచ్చటి నీటితో అలాగే రెగ్యులర్ షాంపూతో శుభ్రపరుచుకోండి.

లాభాలు:

ఈ ప్రభావవంతమైన DIY హెయిర్ మాస్క్ వలన మీ ఉంగరాల జుట్టు అనేది మేనేజబుల్ గా మారుతుంది. ఫ్రిజ్జీనెస్ తొలగిపోతుంది.

మాస్క్ 2: మయోన్నైస్ మరియు క్యాస్టర్ ఆయిల్:

మాస్క్ 2: మయోన్నైస్ మరియు క్యాస్టర్ ఆయిల్:

- రెండు టేబుల్ స్పూన్ల మయోన్నైస్ ను మరియు అర టీస్పూన్ క్యాస్టర్ ఆయిల్ ను తీసుకుని ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోండి.

- ఇప్పుడు మీ హెయిర్ ను సెక్షన్స్ గా డివైడ్ చేసి పైన చెప్పిన విధంగా తయారుచేయబడిన మిశ్రమంతో స్కాల్ప్ కి మసాజ్ చేయాలి.

- ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కర్లీ లాక్స్ కు అప్లై చేయండి.

- ఈ మాస్క్ ని ఒక గంట పాటు మీ శిరోజాలపై ఉండనివ్వండి.

- గోరువెచ్చటి నీటితో అలాగే రెగ్యులర్ షాంపూతో మీ శిరోజాలను శుభ్రపరుచుకోండి.

లాభాలు:

ఈ మాస్క్ ని అప్లై చేయడం ద్వారా మీ శిరోజాలు మరింత మృదువుగా మారతాయి.

మాస్క్ 3: ఆలివ్ ఆయిల్ మరియు ఆపిల్ సిడర్ వినేగార్

మాస్క్ 3: ఆలివ్ ఆయిల్ మరియు ఆపిల్ సిడర్ వినేగార్

ఎలా వాడాలి:

- రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ను ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కలపండి.

- ఇప్పుడు మీ హెయిర్ ను మూడు లేదా నాలుగు సెక్షన్స్ గా విడదీసి ఈ మిశ్రమంతో మీ స్కాల్ప్ ని సున్నితంగా మసాజ్ చేయండి.

- ఇప్పుడు ఈ మాస్క్ ని 40-45 నిమిషాల వరకు ఆరనివ్వండి.

- ఇప్పుడు గోరువెచ్చటి నీటిని, షాంపూని అలాగే కండిషనర్ ని ఉపయోగించి మీ శిరోజాలకు సంరక్షణనివ్వండి.

లాభాలు:

ఈ హోంమేడ్ మాస్క్ తో మీ శిరోజాలు దృఢంగా అలాగే ఆరోగ్యంగా మారతాయి. డాండ్రఫ్ అనేది దరిచేరదు.

మాస్క్ 4: బనానా మరియు అలో వెరా జ్యూస్:

మాస్క్ 4: బనానా మరియు అలో వెరా జ్యూస్:

ఎలా వాడాలి:

- బాగా పండిన ఒక అరటిపండును తీసుకుని దానిని రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జ్యూస్ లో కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంతో మీ స్కాల్ప్ పై అప్లై చేయాలి. ఆ తరువాత లాక్స్ యొక్క టిప్స్ పై కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.

- ఈ మాస్క్ ని 40-45 నిమిషాల వరకు తొలగించకూడదు.

- ఆ తరువాత గోరువెచ్చటి నీటితో అలాగే మీ రెగ్యులర్ షాంపూతో మీ శిరోజాలను వాష్ చేసుకోండి.

- ఆతరువాత లీవ్ ఇన్ కండిషనర్ ని అప్లై చేయండి.

లాభాలు:

ఈ ఆల్ నేచురల్ హెయిర్ మాస్క్ ను వాడటం ద్వారా కర్లీ లాక్స్ ను మృదువుగా చేసుకుని వాటిని మరింత మేనేజబుల్ గా మార్చుకోవచ్చు.

మాస్క్ 5: ఆనియన్ జ్యూస్ తో జింజర్ మరియు ఆల్మండ్ ఆయిల్:

మాస్క్ 5: ఆనియన్ జ్యూస్ తో జింజర్ మరియు ఆల్మండ్ ఆయిల్:

ఎలా వాడాలి:

- ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ జ్యూస్, ఒక టీస్పూన్ జింజర్ జ్యూస్ మరియు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్ తో ఒక మిశ్రమాన్ని క్రియేట్ చేయండి.

- ఈ మాస్క్ ను హెయిర్ కి అప్లై చేయండి.

- షవర్ క్యాప్ తో మీ హెయిర్ ను కవర్ చేయండి. ఈ మాస్క్ ని ఒక గంట పాటు సహజంగా ఆరనివ్వండి.

- ఇప్పుడు గోరువెచ్చటి నీటితో అలాగే మీ రెగ్యులర్ షాంపూతో శిరోజాలను వాష్ చేయండి.

లాభాలు:

ఈ మాస్క్ ని వాడటం ద్వారా బ్రేకేజ్ ను నిర్మూలించి హెయిర్ గ్రోత్ ను మెరుగుపరచుకోవచ్చు.

మాస్క్ 6: తేనె మరియు అవొకాడో:

మాస్క్ 6: తేనె మరియు అవొకాడో:

ఎలా వాడాలి:

- ఒక అవొకాడో ని మ్యాష్ చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనెను కలపండి.

- ఈ మాస్క్ ను స్కాల్ప్ పై సున్నితంగా మసాజ్ చేయండి.

- దీనిని ఒకగంట పాటు తొలగించకండి.

- ఇప్పుడు గోరువెచ్చటి నీటితో అలాగే మీరు వాడే షాంపూతో శిరోజాలను శుభ్రపరుచుకోండి.

లాభాలు:

ఈ DIY హెయిర్ మాస్క్ వలన స్కాల్ప్ ఆరోగ్యంగా మారుతుంది. ఆలాగే, మీ కర్లీ హెయిర్ మరింత ప్రకాశవంతంగా మారుతుంది.

మాస్క్ 7: ఎగ్, మిల్క్ మరియు లెమన్ జ్యూస్

మాస్క్ 7: ఎగ్, మిల్క్ మరియు లెమన్ జ్యూస్

ఎలా వాడాలి:

- ఒక గుడ్డుని పాత్రలోకి తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ పాలను అలాగే మూడు లేదా నాలుగు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి.

- వీటిని బాగా కలపాలి.

- ఇలా తయారైన మిశ్రమంతో స్కాల్ప్ పై మసాజ్ చేయాలి. ఆ తరువాత కర్లీ లాక్స్ పైన కూడా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.

- ఇప్పుడు మీ హెయిర్ ను డ్రై షవర్ క్యాప్ తో కవర్ చేయండి.

- ఈ మాస్క్ ని కనీసం 40-45 నిమిషాల వరకు తొలగించకూడదు.

- ఆ తరువాత గోరువెచ్చటి నీటితో అలాగే రెగ్యులర్ షాంపూతో శిరోజాలను వాష్క్ చేసుకోండి.

లాభాలు:

ఈ ప్రోటీన్ రిచ్ హెయిర్ మాస్క్ అనేది కర్లీ లాక్స్ ని కుదుళ్ళ నుంచి దృఢపరుస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Wonderful DIY Hair Masks For Curly Locks

    Wonderful DIY Hair Masks For Curly Locks,If you have curly hair and want to get it to stay perfectly curled then this is all you need to do. Try these amazing homemade ingredients and follow the correct procedure to get that gorgeous curly hair.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more