For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భ్రింగరాజ్ ఆయిల్: జుట్టుకు కలిగే ప్రయోజనాలు, ఎలా ఉపయోగించాలి

|

ఒక మంచి హెయిర్ ఆయిల్ మసాజ్ మన జుట్టుకు అందించే పోషణ అంతా ఇంతా కాదు. హెయిర్ ఆయిల్ మసాజ్ మనకేమీ కొత్త కాదు. జుట్టుకు మంచి పోషణను అందించే క్రమంలో భాగంగా తరచుగా హెయిర్ ఆయిల్ మసాజ్లను అనుసరించడం సర్వసాధారణమైన విషయంగా ఉంటుంది. మరియు, ఈ విధానం మీ జుట్టుకు మంచి పోషణను, ప్రకాశవంతమైన జుట్టు చర్మాన్ని అందివ్వడమే కాకుండా, వివిధరకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

భ్రింగ్రాజ్ నూనె, మనలో చాలామంది వినే ఉంటారు, అయితే ఇంకా ప్రయత్నించకుండా ఉండవచ్చు. కానీ మీ జుట్టుకు పోషణను అందించడంలో, ఈ భ్రింగ్రాజ్ నూనె చేసే సహాయం అత్యుత్తమమైనదిగా చెప్పబడుతుంది. ఒక వేళ మీరు మీ జుట్టుకు కొత్తగా మసాజ్ ఇవ్వాలని భావిస్తున్న ఎడల, ఖచ్చితంగా మీరు ప్రయత్నించదగిన హెయిర్ ఆయిల్ గా, భ్రింగ్రాజ్ ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

Bhringraj

' కింగ్ ఆఫ్ హెర్బ్స్ ' గా ప్రసిద్ధి చెందిన భ్రింగ్రాజ్, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఉత్తమ ప్రభావాలను కలిగి ఉండే సుప్రసిద్ధ ఆయుర్వేద మూలికగా చెప్పబడుతుంది. ఇది జుట్టుకు బలాన్ని చేకూర్చడంలో, జుట్టు చిట్లడాన్ని ఎదుర్కోవడంలోనే కాకుండా, రాలిపోయిన మీ జుట్టును తిరిగి భర్తీ చేయడంలో కూడా సహాయపడుతుంది.

భ్రింగ్రాజ్ నూనెతో మసాజ్, తలలో రక్తప్రసరణను మెరుగుపరచడంతోపాటు, జుట్టు కుదుళ్ళకు పోషణను అందిస్తుంది., మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ఇది ఒక ఆరోగ్యకరమైన జుట్టు చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండి, మీ జుట్టుకు ప్రయోజనకారిగా ఉంటుంది.

ఈ అద్భుతమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈరోజు ఈవ్యాసంలో, మేము మీ జుట్టుకు భ్రింగ్రాజ్ నూనె యొక్క ప్రయోజనాలను, మరియు మీ జుట్టుకు ఈ నూనెను అనుసరించే మార్గాల గురించిన వివరాలను పొందుపరచడం జరిగింది.

జుట్టుకు భ్రింగ్రాజ్ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు :

• ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

• ఇది జుట్టు చిట్లడాన్ని అరికడుతుంది.

• ఇది అకాల తెల్ల జుట్టును నివారిస్తుంది.

• ఇది చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

• ఇది మీ జుట్టుకు మంచి షైనింగ్ జోడిస్తుంది.

• ఇది చిట్లిన జుట్టు కొనలను చికిత్స చేయడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.

• ఇది దురదగా ఉన్న జుట్టు చర్మానికి చికిత్స చేయడానికి సహాయపడుతుంది.

జుట్టుకు భ్రింగ్రాజ్ ఉపయోగించు విధానం :

1. భ్రింగ్రాజ్ నూనె మసాజ్ :

1. భ్రింగ్రాజ్ నూనె మసాజ్ :

భ్రింగ్రాజ్ నూనెతో మీ తలపై మర్దన చేయడం మూలంగా తలలో రక్తప్రసరణ మెరుగుపడి, తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల భ్రింగ్రాజ్ నూనె

ఉపయోగించు విధానం :

• భ్రింగ్రాజ్ నూనెను ఒక గిన్నెలో తీసుకోండి.

• తక్కువ మంటపై, కాసేపు వేడి చేయండి. ప్రత్యామ్నాయంగా, మీరు 10 నుండి 20 సెకన్లపాటు మైక్రోవేవ్ ఒవెన్లో వేడిచేయవచ్చు.

• ఇప్పుడు మంట నుండి పక్కకు వేరు చేసి, కాసేపు చల్లారనివ్వాలి.

• మీ తలపై నూనెను అప్లై చేసి, సుమారు 5 నుండి 10 నిమిషాలపాటు వలయాకారంలో మీ తలపై సున్నితంగా మర్దన చేయండి.

• 30 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• తేలికపాటి షాంపూ ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

• ఉత్తమ ఫలితాల కోసం ఈ రెమెడీని వారంలో కనీసం రెండు మార్లు పునరావృతం చేయండి.

2. భ్రింగ్రాజ్ నూనె మరియు కొబ్బరి నూనె :

2. భ్రింగ్రాజ్ నూనె మరియు కొబ్బరి నూనె :

జుట్టుకు కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. క్రమంగా కొబ్బరి నూనెతో కూడిన ఈ మిశ్రమం జుట్టు కుదుళ్ళకు పోషణను అందివ్వడంతో పాటుగా, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది అలాగే మీ జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ భ్రింగ్రాజ్ నూనె

• 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె

ఉపయోగించు విధానం :

• రెండు నూనెలను ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయండి.

• ఈ మిశ్రమాన్ని మీ తలపై అప్లై చేసి, వలయాకృతిలో సుమారు 5 నుండి 10 నిమిషాలపాటు మృదువుగా మర్దన చేయండి.

• 30 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• తేలికపాటి షాంపూ ఉపయోగించి తలస్నానం చేయండి.

• ఆశించిన ఫలితాల కోసం ఈ రెమెడీని వారంలో కనీసం రెండు మార్లు పునరావృతం చేయాలి.

3. భ్రింగ్రాజ్ నూనె, ఆముదం నూనె మరియు కొబ్బరి నూనె :

3. భ్రింగ్రాజ్ నూనె, ఆముదం నూనె మరియు కొబ్బరి నూనె :

ఆముదం నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, జుట్టు కుదుళ్ళను (హెయిర్ ఫొలికల్స్) ఉత్తేజ పరుస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కనుక, భ్రింగ్రాజ్ నూనె, ఆముదం నూనె మరియు కొబ్బరి నూనెల కలయికతో కూడిన ఈ మిశ్రమం, మీ జుట్టును దృడంగా మరియు పొడవుగా చేయడానికి ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పబడింది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల భ్రింగ్రాజ్ నూనె

• 1 టేబుల్ స్పూన్ ఆముదం నూనె

• 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

ఉపయోగించు విధానం :

• ఒక గిన్నెలో అన్ని నూనెలను కలిపి మిశ్రమంగా చేయండి.

• ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడెక్కించండి. మరీ ఎక్కువ వేడిగా లేదని ధృవీకరించుకోండి.

• కొద్దిగా చల్లబడిన తర్వాత, మీ తల చర్మంపై మిశ్రమాన్ని అప్లై చేయండి

• 5 నుండి 10 నిమిషాలపాటు మీ తలపై వలయాకృతిలో మృదువుగా మసాజ్ చేయండి.

• 30 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• తేలికపాటి షాంపూ ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

• ఉత్తమ ఫలితాల కోసం ఈ రెమెడీని వారానికి రెండు లేదా మూడుసార్లు పునరావృతం చేయండి.

4. భ్రింగ్రాజ్ నూనె మరియు ఉసిరిపొడి :

4. భ్రింగ్రాజ్ నూనె మరియు ఉసిరిపొడి :

భ్రింగ్రాజ్ నూనెను, ఉసిరి పొడితో కలిపి, మిశ్రమంగా చేయడం ద్వారా హెయిర్ టానిక్ వలె పనిచేస్తుంది. ఇది స్కాల్ప్ ఉపశమనానికి, మీ జుట్టును బలోపేతం చేయడానికి, మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల భ్రింగ్రాజ్ నూనె

• 1 టేబుల్ స్పూన్ ఉసిరి పొడి

ఉపయోగించు విధానం :

• ఒక పాన్లో భ్రింగ్రాజ్ నూనెను వేసి వేయించాలి.

• దీనికి ఉసిరి పొడిని జోడించి బాగా కలపండి.

• ఒక మీడియం హీట్ మీద పాన్ పెట్టి, దాని రంగు గోధుమ రంగులోకి మారేవరకు ఈ మిశ్రమాన్ని వేడి చేయండి.

• స్టౌ నుండి పాన్ పక్కకు తీసుకుని, ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

• ఈ మిశ్రమాన్ని వడకట్టండి.

• మీ తలపై నూనెను అప్లై చేసి, మీ తలపై సున్నితంగా మసాజ్ చేయండి.

• 5 నుండి 10 నిమిషాలపాటు వలయాకృతిలో మసాజ్ చేయండి.

• 30 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• తేలికపాటి షాంపూను ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

• ఉత్తమ ఫలితాల కోసం ఈ రెమెడీని వారంలో మూడుసార్లు పునరావృతం చేయాలి.

5. భ్రింగ్రాజ్ నూనె, శీకాయ మరియు మందార ఆకులు :

5. భ్రింగ్రాజ్ నూనె, శీకాయ మరియు మందార ఆకులు :

శీకాయ సహజసిద్దమైన షాంపూగా కూడా ఉపయోగపడుతుంది. ఇది జుట్టును శుభ్రపరచడానికే కాకుండా, జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మందార ఆకులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు జుట్టు అకాల వృద్దాప్య చాయలను నిరోధించడానికి సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :

• 2 టేబుల్ స్పూన్ల భ్రింగ్రాజ్ నూనె

• 1 టేబుల్ స్పూన్ శీకాయ పౌడర్

• 10 మందార ఆకులు

ఉపయోగించు విధానం :

• ఒక పాన్లో భ్రింగ్రాజ్ నూనెను వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.

• మందార ఆకులను బాగా రుబ్బుకుని, వాటిని పాన్లోని భ్రింగ్రాజ్ నూనెలో వేసి బాగా గిలకొట్టాలి.

• ఆ మిశ్రమాన్ని దాని రంగు మారడం మొదలుపెట్టే వరకు వేడిచేయండి.

• తరువాత మంట నుండి పక్కకు తీసి అందులో శీకాయ పొడిని వేసి మిశ్రమంగా కలపండి.

• ఈ మిశ్రమాన్ని వడకట్టే ముందు చల్లారనివ్వాలి.

• మీ తలపై ఈ నూనెను అప్లై చేసి, మీ తలపై సున్నితంగా మసాజ్ చేయండి.

• 5 నుండి 10 నిమిషాలపాటు వలయాకృతిలో మసాజ్ నిర్వహించండి.

• 30 నిమిషాలపాటు అలానే వదిలేయండి.

• తేలికపాటి షాంపూ ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

• కండిషనర్తో దానిని పూర్తి చేయండి.

• ఉత్తమ ఫలితాల కోసం ఈ రెమెడీని వారంలో రెండు సార్లు పునరావృతం చేయండి.

6. భ్రింగ్రాజ్ నూనె మరియు నువ్వుల నూనె :

6. భ్రింగ్రాజ్ నూనె మరియు నువ్వుల నూనె :

నువ్వుల నూనె జుట్టు కుదుళ్ళకు మంచి పోషణను అందివ్వడమే కాకుండా, తలలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది. మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

కావలసిన పదార్ధాలు :

• 1 టేబుల్ స్పూన్ భ్రింగ్రాజ్ నూనె

• 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె

ఉపయోగించు విధానం :

• రెండు నూనెలను ఒక గిన్నెలో వేసుకుని మిశ్రమంగా కలుపుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయండి. అది మరీ ఎక్కువ వేడిగా లేదని ధృవీకరించుకోండి.

• మీ తల చర్మంపై అప్లై చేయండి, మరియు 5 నుండి 10 నిమిషాలపాటు మీ తల చర్మంపై వలయాకృతిలో మృదువుగా మసాజ్ చేయండి.

• 30 నిమిషాల పాటు అలానే వదిలేయండి.

• తేలికపాటి షాంపూ ఉపయోగించి దానిని శుభ్రం చేయండి.

• ఉత్తమ ఫలితాల కోసం ఈ రెమెడీని వారంలో కనీసం మూడుసార్లు పునరావృతం చేయండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Bhringraj Oil: Benefits For Hair & How To Use

A good hair oil massage nourishes our hair like no other. Widely known as the 'King of Herbs', Bhringraj is an ayurvedic herb that is especially useful for its hair growth-promoting effect. It imparts strength to the hair and replenishes your hair to tackle hair damage. It can be used with ingredients like coconut oil, amla, shikakai etc. to nourish your hair.
Desktop Bottom Promotion