Just In
- 2 hrs ago
రంజాన్ 2021: పవిత్రమైన ఉపవాసం నెల గురించి ఇవన్నీ తెలిసి ఉండాలి
- 2 hrs ago
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- 3 hrs ago
రంజాన్ 2021: డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉండటం సురక్షితమేనా?
- 4 hrs ago
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో ధనస్సు రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
Don't Miss
- Sports
RCB vs RR: శాంసన్ ఆటను ఎక్కువగా ఆస్వాదిస్తా.. అతడి షాట్లను బాగా ఇష్టపడతా: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Finance
భారీ నష్టాల నుండి లాభాల్లోకి మార్కెట్, సెన్సెక్స్ 375 పాయింట్లు జంప్
- News
జీహెచ్ఎంసీ పరిధిలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు, హౌజ్ క్లస్టర్లు ఇవే, పటిష్ట చర్యలు
- Automobiles
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జుట్టు వేగంగా పెరగాలా? అయితే ఈ నూనెలు మాత్రమే వాడి చూడండి..!!
ప్రపంచవ్యాప్తంగా అందమైన పొడవాటి, మందపాటి జుట్టును మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. పొడవాటి జుట్టు అందానికి సంకేతం అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ పొడవాటి జుట్టు లేకుండా, ఒత్తైన ఆరోగ్యకరమైన జుట్టుకు కలిగి ఉండటం వల్ల కూడా అందం పెరుగుతుందని చెప్పవచ్చు. మగ లేదా ఆడవారైనా జుట్టు వారి శారీరక రూపాన్ని మరియు అందాన్నిపెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆరోగ్యకరమైన జుట్టు ఉన్నవారు కూడా అందంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు ఇప్పటికే అందమైన లేదా ఒత్తైన జుట్టు కలిగి ఉన్నా, మరియు అందమైన జుట్టును లేని వారు మీ జుట్టుకు ఏమి అవసరమో మీరు గ్రహించాలి. అలాగే జుట్టు సమస్యలుండి జుట్టు సరిగా పెరగకపోతే.. మీ జుట్టు సహజంగా వేగంగా పెరగడానికి సహాయపడే కొన్ని పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ఉత్పత్తుల గురించి తెలుసుకోవడం వల్ల మీ జుట్టును సరళమైన, సహజమైన రీతిలో పెంచుకోవచ్చు.

జుట్టు పెరుగుదల
జుట్టు పెరుగుదలకు నూనెలు చాలా ముఖ్యమైనవి. సాధారణంగా, తల స్నానం చేయడం మరియు తలకు నూనె రాయడం ఈ రోజుల్లో చాలా తక్కువ. సమయం మరియు జుట్టు మీద ప్రత్యేక శ్రద్ద లేకపోవడం వల్ల చాలా మంది జుట్టుకు నూనె రాయడం విస్మరిస్తారు. అయినప్పటికీ, జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లను బలోపేతం చేయవచ్చు మరియు జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా కొన్ని నూనెలు జుట్టుకు ఉపయోగపడతాయి. కొన్ని నూనెలు వేగంగా జుట్టు పెరగడానికి, పేలను నిర్మూలించడానికి, చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించడంలో మంచి నివారణులుగా పనిచేస్తాయి. సాధారణంగా చాలా మందిని ప్రభావితం చేసే జుట్టు సమస్యలను పరిష్కరించడం ద్వారా జుట్టు పెరుగుదల సాధ్యమవుతుంది.

జుట్టును ఎలా పెంచాలి?
కొన్ని నూనెలతో హెయిర్ మసాజ్ చేయడం మరియు కొన్ని నూనెలను కండీషనర్ గా వాడటం వల్ల జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని నూనెలు మరియు వాటిని ఉపయోగించే పద్ధతులు ఇక్కడ ఉన్నాయి.
ఒత్తైన పొడవాటి జుట్టు పొందడానికి, క్రింద పేర్కొన్న నూనెల గురించి తెలుసుకోండి. వీటిని ఉపయోగించి ఆరోగ్యకరమైన జుట్టును పొందండి.

లావెండర్ నూనె
లావెండర్ ఆయిల్ అన్ని రకాల జుట్టుకు అనువైన నూనె. లావెండర్ ఆయిల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తలలో ఇన్ఫెక్షన్స్ నివారించడానికి సహాయపడతాయి. లావెండర్ ఆయిల్ మీ తలలో చుండ్రు నివారించి, ఒత్తైన జుట్టు పొందడానికి ఉత్తమ చికిత్సగా పనిచేస్తుంది. ఒక పాన్ లో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ తీసుకుని దానికి మీరు రెగ్యులర్ గా పెట్టుకునే నూనె కలపండి.
గోరువెచ్చగా చేసి నేరుగా అలాగే పెట్టుకోవచ్చు లేదా ఈ నూనెను మూడు, నాలుగు వారాల పాటు అలాగే ఉంచి, ఆపై ఈ నూనెను తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. నూనెను రాత్రి తలకు రాసి , మరుసటి రోజు ఉదయం తేలికపాటి మూలికా షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు పొడవాటి, మెరిసే జుట్టు పొందుతారు.

రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్
రోజ్మేరీ ఆయిల్ మరొక నూనె, ఇది ఎటువంటి వివక్ష లేకుండా అన్ని రకాల జుట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నూనె వాసన మరియు ఉత్తేజపరిచే గుణాలు జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది మరియు ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రోజ్మేరీ ఆయిల్ వాడటం వల్ల జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది. కాబట్టి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడం వల్ల జుట్టు అందంగా కనబడుతుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఒక గొప్ప మార్గం రోజ్మేరీ ఆకులను కొద్దిగా తీసుకొని నూనెలో వేసి బాగాఉడకబెట్టండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు నల్ల రంగులోకి వస్తుంది. లేదా, రోజ్మేరీ నూనె కొన్ని చుక్కలను తీసుకొని ఆలివ్ నూనెతో కలిపి తలకు రాయడం వల్ల జుట్టు కుదుళ్లు మరియు సహజంగా దట్టమైన జుట్టు పెరుగుతుంది. మీ జుట్టు సహజ పెరుగుదలకు మరొక మార్గం రోజ్మేరీ నూనెతో తయారు చేసిన షాంపూలను తలకు కండీషనర్ గా ఉపయోగించండి.

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్
ఏ రకమైన నిమ్మకాయ అయినా జుట్టుకు మేలు చేస్తుంది. నిమ్మకాయలో ఇన్ఫెక్షన్స్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీకు పొడి జుట్టు ఉంటే దానిని మ్రుదువుగా చేయడానికి నిమ్మ నూనెను ఉపయోగించవచ్చు. లెమన్ ఆయిల్ శరీరంలో జిడ్డుగల గ్రంథులను ప్రోత్సహిస్తుంది మరియు ఆ గ్రంథుల నుండి ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, దీని ఫలితంగా మునుపటి కంటే సున్నితమైన మెరిసే జుట్టు పెరుగుతుంది.
ఈ అన్ని ప్రయోజనాల పైన, చుండ్రుకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడానికి నిమ్మ నూనె సహాయపడుతుంది. మరియు చుండ్రును శాశ్వతంగా దూరం చేస్తుంది. మీరు మీ జుట్టుకు షాంపూ చేసిన తర్వాత, నాలుగు చుక్కల నిమ్మ నూనెను మీ చేతుల్లోకి తీసుకుని, మీ జుట్టు మొత్తానికి అప్లై చేయండి. ఒక గంట లేదా రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే మీ జుట్టు సహజంగా మెరుస్తుంది. అయితే, ఇది సిట్రస్ ఆయిల్ కాబట్టి, ఇది జుట్టు అస్పష్టతను పెంచుతుంది. అందువల్ల ఎండలో ఎక్కువగా తిరగకుండా జుట్టును కాపాడుకోవడం చాలా అవసరం, లేకపోతే జుట్టు రంగు ఎర్రగా రఫ్ గా మారే అవకాశం ఉంది.

కిచిలి ఆయిల్
జుట్టు రాలడం మరియు సంబంధిత సమస్యలకు ఈ నూనె ఉత్తమ పరిష్కారం. మీరు ఈ నూనెను నేరుగా తలపై రాయవచ్చు. ఈ నూనెను రోజూ జుట్టుకు రాయడం వల్ల జుట్టు స్ట్రక్చర్ మెరుగుపరుస్తుంది. అలాగే, ఈ నూనెలో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను జోడించడం వాడటం వల్ల జుట్టు పెరుగుదలకు ఒక అద్భుతమైన మూలిక సుగంధ నూనె తయారవుతుంది.
ఈ నూనెలో పిహెచ్ బ్యాలెన్స్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ నూనెను మీ జుట్టుకు కండీషనర్‌గా వారానికొక ఒకసారి వర్తించవచ్చు. ఆయిల్ జిడ్డుగా ఉండటం వల్ల ఎండకు సున్నితంగా ఉంటుంది కాబట్టి, నిమ్మ నూనె లాగా, ఎండకు ప్రత్యక్షంగా గురికాకుండా జుట్టును రక్షించాలి.

సైప్రస్ ఆయిల్
ఈ నూనె జుట్టు రాలడాన్ని నివారించడంలో సమర్థవంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. సైప్రస్ ఆయిల్ దానిలోని పూర్తి ప్రయోజనాలను పొందడానికి అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. జాజికాయ, లావెండర్ లేదా రోజ్మేరీ నూనెతో మిక్స్ చేసిన మిశ్రమం జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. సైప్రస్ నూనెను ఉపయోగించడానికి ఇది ఒక గొప్ప మార్గం. కండీషనర్‌లో ఒకటి లేదా రెండు చుక్కల సైప్రస్ ఆయిల్‌ను అప్లై చేసిన తర్వాత, మీ జుట్టుకు షాంపుతో తలస్నానం చేయండి. దీన్ని క్రమం తప్పకుండా వాడుతుంటే తక్కువ సమయంలో మీ జుట్టు పెరుగుదలలో గొప్ప మార్పును మీరు గమనించవచ్చు.

బాదం నూనె
పొడి జుట్టుకు బాదం నూనె ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. బాదం నూనెను గోరువెచ్చగా చేసి మీ జుట్టుకు రాయండి. ఇలా రోజూ రాయండి. ఈ నూనెను తలకు రాయడం వల్ల మరియు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ఆయిల్ గ్రంథులు ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి, మీ జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడం నివారిస్తుంది.

క్యారెట్ ఆయిల్
ఒత్తైన మరియు ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి, క్యారెట్ ఆయిల్ ఉపయోగించండి. మీరు ఈ నూనెను నేరుగా మీ జుట్టుపై రాయవచ్చు. లేదా మీరు దీనిని జోజోబా నూనెతో కలిపి ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. క్యారెట్ ఆయిల్లో కెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం.ఈ నూనెతో జుట్టు పెరుగుదల మరియు చర్మ పునరుజ్జీవనం రెండింటినీ సాధ్యం చేస్తుంది. కాబట్టి, ఇక వేచి ఉండకండి ... క్యారెట్ ఆయిల్ వాడటానికి సిద్ధంగా ఉండండి .. ఒక చిట్కా - క్యారెట్ ఆయిల్ చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతిసారీ కొద్ది మొత్తాన్ని మాత్రమే ఉపయోగించడం మర్చిపోవద్దు.