For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ

జుట్టు రాలడానికి కారణాలు, లక్షణాలు, చికిత్స మరియు నివారణ .జుట్టురాలడాన్ని వైద్యపరిభాషలో అలోపిషియా అని పిలుస్తారు. ఈ పరిస్థి కేవలం తలలో మాత్రమే కాదు, మొత్తం శరీరం మీద ప్రభావం చూపుతుంది. తలపై జుట్టు రా

|

జుట్టురాలడాన్ని వైద్యపరిభాషలో అలోపిషియా అని పిలుస్తారు. ఈ పరిస్థి కేవలం తలలో మాత్రమే కాదు, మొత్తం శరీరం మీద ప్రభావం చూపుతుంది. తలపై జుట్టు రాలడంతో పాటు, శరీరంలోని ఇతర భాగాల్లో వెంట్రుకులు రాలిపోవడం జరుగుతుంది.

సాధారణం పెద్దవారిలో పది నుండి పదిహేను లక్షలున్న వెంట్రుకల్లో రోజుకు 80 నుండి 100వరకు వెంట్రుకలు రాలుతుంటాయి. ఇది నార్మల్ కండీషన్ మరియు సహజంగా జరుగుతుంది. కానీ నార్మల్ కంటే ఎక్కువగా జుట్టు రాలుతుంటే తప్పనిసరిగా వైద్యపరంగా తగిన చికిత్స తీసుకోవాలి.

అలోపిషియాకు ఒక 5% మంది మాత్రమే ప్రభావితులవుతారు. మిగిలిన వారిలో తిరిగి జుట్టు మొలవడం జరుగుతుంది. జుట్టు రాలడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు వ్యాధులు, వంశపారంపర్యం మరియు మందుల దుష్ప్రభావాలు .

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు :

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు :

జుట్టు రాలడం ప్రతి రోజూ జరుగుతుంది. రోజూ వంద వెంట్రుకలు రాలిపోతున్నా, అవి తిరిగి పెరుగుతున్నట్లు చాలా మంది గ్రహించరు. సాధారణ పరిస్థితుల వల్ల జుట్టు రాలిపోతుంటే , తిరిగి ఆ ప్రదేశంలో తిరిగి జుట్టు పెరిగి సమతుల్యం అవుతుంటుంది. ఇలా కాకుండా మరికొన్ని ప్రత్యేక సందర్బాల్లో జుట్టు రాలడానికి కారణాలు ఉన్నాయి. అవి..

 జుట్టు రాలడానికి కారణాలు ఉన్నాయి. అవి..

జుట్టు రాలడానికి కారణాలు ఉన్నాయి. అవి..

హెరిడిటి: జన్యు ప్రభావం వల్ల జుట్టు రాలడం లేదా బట్టతల వస్తుంది.

హార్మోనుల్లో మార్పులు:

హార్మోనుల్లో మార్పులు:

ప్రెగ్నెన్సీ, మోనోపాజ్, చైల్డ్ బర్త్ లేదా థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలుతుంది.

మందులు:

మందులు:

డిప్రెషన్ , గౌట్ , ఆర్థ్రైటిస్ మరియు హై బ్లడ్ ప్రెజర్ కు తీసుకునే కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు జుట్టుపై పడుతాయి.

ఒత్తిడి:

ఒత్తిడి:

ఒత్తిడి లేదా ఎమోషనల్ షాక్స్ వల్ల జుట్టు రాలుతుంది.

కీమోథెరఫీ డ్రగ్స్ :

కీమోథెరఫీ డ్రగ్స్ :

క్యాన్సర్ చికిత్స సమయంలో కీమోథెరఫీ డ్రగ్స్ వల్ల జుట్టు రాలుతుంది.

హెయిర్ కలర్ మరియు హెయిర్ స్టైల్ :

హెయిర్ కలర్ మరియు హెయిర్ స్టైల్ :

జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం జుట్టుకు టైట్ గా ఉండే హెయిర్ బ్యాండ్స్ వాడటం, హెయిర్ ఫాలిసెల్స్ ఇన్ఫ్లమేషన్ వంటి కారణాలు. అలాగే హెయిర్ కలర్స్ లో ఉన్నటువంటి కెమికల్స్ హెయిర్ ఫోలిసెల్స్ ను డ్యామేజ్ చేస్తుంది.

స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్:

స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్:

ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా రింగ్ వార్మ్స్ కారణంగా జుట్టు రాలుతుంది.

పోషకాహార లోపం:

పోషకాహార లోపం:

ప్రోటీన్లు మరియు విటమిన్లు లోపం వల్ల కూడా జుట్టు ఊడుతుంది.

జుట్టు రాలడంలో రకాలు :

జుట్టు రాలడంలో రకాలు :

జుట్టు పెరగడాన్ని అడ్డుకోవడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో

1.అలోపిషియా టోటలిస్: ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల జుట్టు రాలుతుంది.

2. ఇన్వాల్యూయేషన్ అలోపిషియా : ఏజింగ్ వల్ల జుట్టు రాలుతుంది

3. అలోపిషియా ఏరియట: శరీరంలో ఏభాగంలో అయినా ప్యాచెస్ ఏర్పడటం ద్వారా జుట్టు రాలడం జరుగుతుంది.

4. ట్రాక్షన్ అలోపిషియా: మహిళ్ళల్లో స్ట్రెస్ లేదా టైట్ పోనీటైల్ వల్ల జుట్టు రాలుతుంది.

5. టెలోజెన్ ఎఫ్లూవియం: ఒత్తిడి వల్ల అనారోగ్యం లేదా భావోద్వేగం వల్ల జుట్టు రాలుతుంది.

6. అనాజెన్ ఎఫ్లూవియం: శరీరంలో మొత్తంలో వెంట్రుకలు రాలిపోవడం అనేది క్యాన్సర్ చికిత్సలో కీమోథెరఫీ వల్ల .

7. అలోపేసియా బార్బే: పురుషుల్లో ముఖం లేదా గడ్డం భాగంలో వెంట్రుకల రాలిపోవడం.

లక్షణాలు:

లక్షణాలు:

జుట్టు రాలడం శాస్వతంగా మరియు తాత్కాలికంగా కూడా ఉంటుంది. అది వీటి రెండింటిలో ఒక్కదాన్ని బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. జుట్టు రాలే లక్షణాలు:

జుట్టు పల్చగా మారడం

తలపై వెనుక భాగంలో రౌండ్ గా ప్యాచ్ ఏర్పడటం

గడ్డం మరియు ఐబ్రోస్ పై జుట్టు రాలుతుంది

జుట్టు రాలడానికి ముందు ఆ ప్రదేశంలో దురదగా ుండటం.

తలదువ్వుడం లేదా తస్నానం చేసే సమయంలో సడెన్ గా గుప్పెడు వెంట్రుకలు చేతిలోకి ఊడి రావడం.

వెంట్రుకలు మద్యలోకి తెగిపోవడం లేదా తలలో వాపు .

జుట్టు రాలడాన్ని నిర్థారించడం :

జుట్టు రాలడాన్ని నిర్థారించడం :

మొదట డాక్టర్లు ఫ్యామిలి హిస్టరి గురించి తెలుసుకుంటారు. జన్యుపరమైన కారకాలను గురించి తెలుసుకుంటారు. దాని తర్వాత వారి ఈ క్రింది టెస్ట్ ల ద్వారా జుట్టు రాలడాన్ని నిర్థారిస్థారు.

రక్త పరీక్ష: రక్త పరీక్ష ద్వారా జుట్టు రాలడానికి సరైన వైద్య కండీషన్స్ ద్వారా తెలుసుకుంటారు.

స్కాల్ప్ బయోస్పి: ఈ పద్దతిలో వ్యక్తి తలలో నుండి కొన్ని వెంట్రుకలు తీసుకుని, వెంట్రుకల మొద్దల్లో పరీక్షలు జరిపి ఏవై ఇన్ఫెక్షన్స్ ఉన్నాయోమో అన్న విషయం తెలుసుకుంటారు.

పుల్ టెస్ట్: ఈ టెస్ట్ లో డాక్టర్లు పేషంట్ తలలో వెంట్రుకల గట్టిగా లాగి చూస్తారు. దీని ద్వారా ఎన్ని వెంట్రుకుల ఊడివస్తున్నాయో గుర్తించి దాన్ని బట్టి అంచనా వేస్తారు.

లైట్ మైక్రోస్కోపి : ఇక్క కొన్ని ప్రత్యేకమైన జుట్టు పరికరాలను ఉపయోగించడం జరుగుతుంది.

జుట్టు రాలే సమస్యను నివారించడానికి డాక్టర్లు చేసే చికిత్స:

జుట్టు రాలే సమస్యను నివారించడానికి డాక్టర్లు చేసే చికిత్స:

జుట్టు రాలే సమస్యకు చికిత్స చేయడానిక అది స్త్రీ మరియు పురుషుల మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి ఎటువంటి చికిత్స చేసుకోవాలో సూచిస్తుంటారు. సాధారణంగా ఇది కొన్ని మందులు మరియు క్రీములను సూచిస్తారు. వీటితో పాటు ఇతర పద్దతలు:

పద్దతులు

పద్దతులు

స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ : జుట్టు రాలడం ఏరకమైనదో గుర్తించి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కార్టికోకాస్టోరాయిడ్ ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇది చర్మంపై ఏర్పడ్డ ప్యాచ్ లను తొలగిస్తుంది. ఇది అడ్రినల్ గ్రంధిలో హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది,

ఇమ్యూనో థెరఫీ : జుట్టు రాలడానికి అసలైన కారణం తెలుసుకుని దానికి డినిట్రో క్రోరోబెంజిన్ మిరయు డిఫెన్సిప్రోన్ వంటి క్రీములను బట్టతలపై అప్లై చేసి జుట్టు తిరిగి పొందేలా చేస్తుంటారు.

లేజర్ థెరఫీ : తలలోపలికి చొప్పించడం ద్వారా ఈ హెయిర్ లాస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. జుట్టు మొదళ్ళు ఆ ఫోటాన్స్ ను గ్రహించి , జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్: ఈ పద్దతిలో కాస్మొటిక్ సర్జన్ కొన్ని చిన్న స్కిన్ ప్యాచ్ లను తొలగించి, ఆరోగ్యకరంగా జుట్టు పెరిగేలా లేదా జుట్టు ఉండేలా ట్రాన్స్ ప్లాంట్ చేస్తారు.,

యువిలైట్ ట్రీట్మెంట్ : బట్టతలపై యూవి కిరణాలు ప్రభావితం చేస్తారు. ఇది తలలో రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరిగేలా చేస్తుంది.

జుట్టు రాలడం నివారించడం ఎలా ?

జుట్టు రాలడం నివారించడం ఎలా ?

కొన్ని సూచలు, నివారణ పద్దతులు ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. అవి:

జుట్టును ఎక్కువగా టైట్ గా పోనీటైల్ వేయకూడదు. హెయిర్ బ్యాండ్స్ , బన్స్ నివారించండి.

జుట్టును లాగకండి.

రోజూ తీసుకునే ఆహారంలో ఐరన్ మరియు ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోండి.

బ్లో డ్రయ్యర్లు మరియు హెయిర్ స్ట్రెయిటర్నస్ ను వాడటం నివారించండి.

కెమికల్స్ ఉన్న హెయిర్ కలరింగ్స్ కు దూరంగా ఉండాలి.

English summary

Hair Loss: Causes, Symptoms, Treatment And Prevention

Hair loss, named as alopecia in medical science, is a condition that affects not only the scalp but the entire body. The condition is marked by excessive hair fall from the scalp in round patches and other body parts
Desktop Bottom Promotion