Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ఈ టోపీ ధరించండి.. బట్టతల నుండి విముక్తి పొందండి.. జుట్టు రాలకుండా ఈ హోమ్ రెమిడెస్ ను పాటించండి..
కోడి గుడ్డులోని పచ్చసోన జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా పురుషుల్లో జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు చాలా మంచిగా పని చేస్తుంది.
ప్రస్తుత సమాజంలో అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా అందమై జట్టు కోసం తెగ ఆరాట పడుతుంటారు. ఈ మధ్య మన దేశంలో బట్టతల బాధితులు బాగా పెరిగిపోతున్నారు. వీరిని చూసి కేవలం జుట్టు రాలే బాధితులు తమకు కూడా ఎక్కడా బట్టతల వస్తుందోనని తెగ ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన వల్ల సరైన సమయానికి సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల అబ్బాయిలు జుట్టును కోల్పోతున్నారు. వీటి నుండి విముక్తి కావాలంటే మీ ఇంటి వద్ద లభించే కొన్ని ఐటమ్స్ తో మీరు హెయిర్ ఫాల్ నుండి త్వరగా బయటపడొచ్చు. జుట్టు రాలడం తగ్గి, బట్టతల నివారణకు ఏమేమి చిట్కాలో పాటించాలో తెలుసుకుందాం..

బట్టతల రాకుండా అనేక రకాల నూనెలను, ఇంకా ఏవేవో ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారికి ఒక కొత్త టెక్నిక్ తెగ ఊరిస్తోంది. అదేంటంటే విస్కాన్ సన్-మాడిసన్ శాస్త్రవేత్తలు ఎటువంటి సర్జరీతో పని లేకుండా ఒక టోపీని కనిపెట్టారట. అది కూడా చాలా చౌకగా లభించేలా తయారు చేశారట. అతి తక్కువ కాలంలోనే మీ బట్టతలపై వెంట్రుకలు మొలిపించే ఆధునాతనమైన టోపీని కనిపెట్టినట్లు అమెరికాకు చెందిన విస్కాన్ సన్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల ప్రకటించారు.

వారు తయారు చేసిన టోపీని తలపై పెట్టుకున్నప్పుడు అందులోని విద్యుత్ పల్స్ బట్టతలపై ఉన్న చర్మకణాలను ఉత్తేజ పరుస్తాయని వీరు చెబుతున్నారు. దీనివల్ల జట్టు తిరిగి పెరగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వారి పరిశోధనల్లో నిర్ధారించారట. ఎలుకలపై చేసిన ప్రయోగాలు కూడా ఫలితాలు ఇచ్చాయట. దీంతో మనుషులపై కూడా సత్ఫలితాలు ఇస్తాయని వారు పేర్కొన్నారు.
కానీ ఇది మార్కెట్లోకి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి అంతవరకు మన ఇంటి వద్ద లేదా మార్కెట్లో కొన్ని రకాల వస్తువులతో మీరు మీ జట్టు రాలడం, బట్టతల నివారణకు ఏమేమి చేయాలో తెలుసుకుందాం.

జుట్టును పెంచే పచ్చసోన, తేనె
కోడి గుడ్డులోని పచ్చసోన జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఇది ముఖ్యంగా పురుషుల్లో జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు చాలా మంచిగా పని చేస్తుంది. ఇందుకోసం మనం ఏమి చేయాలంటే తేనే, పచ్చసోనలను రెండింటినీ సమానంగా తీసుకుని కలపాలి. స్కాల్ప్ కి అరగంట సేపు మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.

ఉసిరికాయ వండర్స్..
బట్టతలను నివారించడంలో ఉసిరికాయ వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఉసిరి కాయలలోని రసం జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా చక్కగా పని చేస్తుంది. నిమ్మరసాన్ని ఉసిరి కాయ జ్యూస్ లోకి కలిపి స్కాల్ప్ కి పట్టించి అరగంట సేపు బాగా మసాజ్ చేయాలి. తర్వాత నీటిగా శుభ్రం చేసుకోవాలి.

జామ ఆకులతో జుట్టుకు బలం..
జామ ఆకులను వేడి నీటిలో వేసి కొంత సమయం వరకు బాగా మరిగించాలి. జామ ఆకులు వేసిన నీళ్లు మొత్తం నల్లగా మారే వరకు మరిగించాలని మరచిపోవద్దు. తర్వాత దూదితో దాన్ని మన స్కాల్ప్ కి పట్టించాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలడాన్ని అతి త్వరలో నివారించవచ్చు.

ఆలివ్ ఆయిల్ ప్యాక్..
రెండు టీ స్పూన్ల తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్కపొడి ఆలివ్ ఆయిల్ ను కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును తలకు పట్టించాలి. 20 నిమిషాల వరకు ఇది ఆరిపోయేంత వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత మైల్ట్ షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే పురుషుల్లో జుట్టు రాలడం బాగా తగ్గిపోతుంది.

అలోవెరా జెల్..
చాలా మందికి ఆలోవెరా జెల్ చర్మ సౌందర్యానికి మాత్రమే పని చేస్తుందని తెలుసు. కానీ ఇది పురుషుల్లో జుట్టు బలపడటానికి కూడా బాగా పని చేస్తుంది. ఈ అలోవెరాలో జుట్టుకు కావాల్సిన విటమిన్-ఈ పుష్కలంగా ఉంది. ఇది స్కాల్ప్ కి మంచి పోషణను అందిస్తుంది. ఇది హెయిర్ అవసరమైన మాయిశ్చరైజర్ ను ఇస్తుంది.

ఉల్లితోనూ జుట్టుకు ఉపయోగాలు..
ఉల్లిపాయతోనూ పురుషుల జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఉల్లిపాయను ముక్కలు ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. కాటన్ బాల్ ని ముంచుతూ స్కాల్ప్ కి పట్టించాలి. తర్వాత 20 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత మంచి నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఆ సమయంలో షాంపూ వాడకూడదు. ఒకవేళ వాసన మీకు నచ్చకపోతే మైల్డ్ షాంపూను వాడొచ్చు. ఇది మీ జుట్టు పెరుగుదలకు చాలా చక్కగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
