For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Thin Hair Tips: మీ జుట్టు పలుచగా ఉంటుందా.. అయితే ఈ పనులు అస్సలే చేయొద్దు

మంచి జుట్టు వల్ల వచ్చే అందం అంతా ఇంతా కాదు. మంచి సిల్కీ హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జుట్టు ఉంటుంది.

|

Thin Hair Tips: మంచి జుట్టు వల్ల వచ్చే అందం అంతా ఇంతా కాదు. మంచి సిల్కీ హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన జుట్టు ఉంటుంది. దానికి తగినట్లుగా స్టైల్స్ చేసుకుంటే చక్కగా ఉంటుంది.

Things To Stop Doing if you Have Thin Hair in Telugu

కొందరికి జుట్టు చాలా సన్నగా ఉంటుంది. ఇలాంటి సన్నని జుట్టు వల్ల ప్లస్‌లు మరియు మైనస్‌లూ ఉన్నాయి. ఇలాంటి జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. జుట్టు తడిస్తే చాలా త్వరగా ఆరిపోతుంది. చక్కనైన స్టైల్స్ గా జుట్టును వాడుకోవచ్చు. అయితే సన్నని జుట్టు ఉన్న వాళ్లు చేయకూడనివి కొన్ని ఉన్నాయి. వాటిని చేయకుండా ఉంటే మీ జుట్టు అందంగా కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉంటుంది.

1. హాట్ స్టైలింగ్ టూల్స్ ను ఉపయోగించవద్దు

1. హాట్ స్టైలింగ్ టూల్స్ ను ఉపయోగించవద్దు

కర్ల్స్ కోసం హాట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించే ఉంటారు. కానీ సన్నని జుట్టు ఉన్న వారు హాట్ టూల్స్ వాడితే జుట్టు పాడిపోయే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల స్టైలు సంగతి అటు ఉంచితే.. జుట్టు చెడిపోతుంది. తప్పనిసరి పరిస్థితిలో హాట్ టూల్స్ వాడాల్సి వస్తే హీట్ ప్రొటెక్టర్లను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

2. కాటన్ పిల్లోలపై పడుకోవద్దు

2. కాటన్ పిల్లోలపై పడుకోవద్దు

మంచి నాణ్యమైన పత్తి వాడి చేసిన దిండ్లను వాడినా.. జుట్టు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం పత్తికి బదులుగా సిల్క్ వాడాలని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల జుట్టు పాడవకుండా ఉంటుందని అంటున్నారు. సిల్క్ పిల్లోలు వాడితే జుట్టు విరిగిపోకుండా ఉంటుందని సూచిస్తున్నారు.

3. ఎక్కువ లైటింగ్ కు దూరంగా ఉండాలి

3. ఎక్కువ లైటింగ్ కు దూరంగా ఉండాలి

జుట్టుకు కొంత హైలైట్స్ వాడటం బాగుంటుంది. దాని వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. కానీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా హైలైట్స్ వాడవద్దని చెబుతున్నారు నిపుణులు. సన్నని జుట్టు ఉన్న వారు ఎక్కువగా హైలైట్స్ వాడటం వల్ల జుట్టు పాడవుతుంది.

4. సల్ఫేట్స్ ఉన్న ఉత్పత్తులను వాడొద్దు

4. సల్ఫేట్స్ ఉన్న ఉత్పత్తులను వాడొద్దు

మీరు హెయిర్ కేర్ ప్రోడక్ట్‌లను కొనే సమయంలో వాటి లేబుల్ చదవడం అలవాటు చేసుకోవాలి. వాటిలో ఏయే రసాయనాలు వాడారు.. ఎంత మొత్తంలో వాటిని వాడారు అనేది తెలుసుకోవాలి. సల్ఫేట్స్ ఉన్న ఉత్పత్తులను వాడవద్దు. సల్ఫేట్ లేని షాంపూలను వాడటం వల్ల జుట్టును సంరక్షించుకోవచ్చు. తక్కువ సాంద్రత ఉన్న కండీషనర్ లను ఎంచుకోవడం ఉత్తమం.

5. రోజూ షాంపూ చేయొద్దు

5. రోజూ షాంపూ చేయొద్దు

రోజూ షాంపూ వాడవద్దు. దీని వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తింటుంది. జుట్టపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. దీని వల్ల జుట్టు ఎండిపోయి విరిగిపోతుంది. దీని వల్ల జుట్టు అందవిహీనంగా మారుతుంది. అందుకో రెండ్రోజులకోసారి జుట్టును కడగండి. అప్పుడప్పుడు మాత్రమే షాంపూ వాడాలని అంటారు నిపుణులు.

6. బ్లో డ్రైయర్‌ని ఎక్కువగా వాడొద్దు

6. బ్లో డ్రైయర్‌ని ఎక్కువగా వాడొద్దు

ప్రతి ఒక్కరికీ వెంట్రుకలు నిర్వహించదగినవిగా ఉండేలా గాలిని ఆరిపోయేలా కలిగి ఉండరు. కాబట్టి బ్లో అవుట్‌ను పూర్తిగా దాటవేయడం గమ్మత్తైనది. ఇంకా, మీరు సన్నని వెంట్రుకలను కలిగి ఉన్నట్లయితే అది పరిశీలించదగినది కావచ్చు. బ్లో డ్రైయర్ ను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు పొడిగా అవుతుంది.

7. టవల్ తో జుట్టు ఆరబెట్టవద్దు

7. టవల్ తో జుట్టు ఆరబెట్టవద్దు

మీరు స్నానం చేసి బయటకు వచ్చి మీ తలపై టవల్ రుద్దుకుంటున్నారా? అలా అయితే, జుట్టు చెడిపోవడానికి అదే కారణం కావొచ్చు. మీ జుట్టు పొడిబారడానికి గుడ్డ (పాత టీ-షర్టు లేదా మైక్రోఫైబర్ టవల్ వంటివి) ఉపయోగించడం మంచిది.

8. గట్టిగా జుట్టు వేయద్దు

8. గట్టిగా జుట్టు వేయద్దు

మీరు సన్నని వెంట్రుకలతో గట్టిగా జుట్టు వేయాలనుకోవద్దు. బిగుతైన పోనీ టెయిల్స్, బ్రెయిడ్ లకు దూరంగా ఉండాలని. జుట్టును గట్టిగా పట్టి లాగడం వల్ల వెంట్రుకల మొదలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

9. ఎక్కువ ఉత్పత్తులను వాడొద్దు

9. ఎక్కువ ఉత్పత్తులను వాడొద్దు

సన్నని వెంట్రుకలు సహజంగా కొంచెం లింప్‌గా ఉంటాయి. కాబట్టి మీరు అధిక ఉత్పత్తితో దానిని తగ్గించకూడదు. చాలా ఎక్కువ నూనెలు వాడటం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది.

10. పొడిగా ఉన్న జుట్టును కత్తిరించవద్దు

10. పొడిగా ఉన్న జుట్టును కత్తిరించవద్దు

జుట్టు తడిగా ఉన్నప్పుడు మాత్రమే కత్తిరించాలని అంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ నిపుణులు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. జుట్టును కొద్దిగా తడిగా చేసిన మీకు కావాల్సినంత వరకు కట్ చేసుకోవాలని.. జుట్టు ఆరిన తర్వాత పైపైన మరోసారి కత్తిరించుకోవాలని చెబుతున్నారు.

English summary

Things To Stop Doing if you Have Thin Hair in Telugu

read on to know Things To Stop Doing if you Have Thin Hair in Telugu
Story first published:Saturday, September 3, 2022, 13:20 [IST]
Desktop Bottom Promotion