For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే కరివేపాకును ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా పెరుగుతుంది

జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే కరివేపాకును ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా పెరుగుతుంది

|

అందమైన, ఒత్తైన మెరిసే జుట్టును ఎవరు ఇష్టపడరు చెప్పండి? జుట్టు అంటే అందరికీ ఇష్టమే. కానీ, అయితే మన జుట్టు ఎప్పుడూ మనం అనుకున్నట్లుగా ఉండదు. ఈ మద్య కాలంలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా జుట్టు రాలడం, పల్చబడటం, చుండ్రు మరియు గ్రే హెయిర్ వంటి అనేక రకాల సమస్యలను మనం ప్రతిరోజూ ఎదుర్కొంటాము.తల దువ్విన ప్రతిసారీ జుట్టు రాలిపోవడం చూసి మనం చింతించవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు కోరుకునే సిల్కీ మెరిసే ఒత్తైన జుట్టును పొందడానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వీటిని మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. వంటలోనే కాదు మీ జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో కూడా కరివేపాకు మొదటి స్థానంలో ఉంటుంది.

Ways to Use Curry Leaves for Voluminous Hair in Telugu

అవును, కరివేపాకులో చాలా ఆయుర్వేదిక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీనికి ఆర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి మీ జుట్టుకు అద్భుతాలు చేస్తాయి మరియు ఒత్తైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. కాబట్టి, స్త్రీ మరియు పురుషుల ఇద్దరిలో ఈ సమస్య ఎక్కువగా బాధిస్తుంటే, మీ జుట్టు రాలడాన్ని ఆపడానికి మరియు ఒత్తైన జుట్టును పొందడానికి మన పెరట్లో ఉండే కరివేపాకులను ఎలా ఉపయోగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం...

కరివేపాకు ప్రయోజనాలు

కరివేపాకు ప్రయోజనాలు

కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. ఇంకా ఇవన్నీ సెల్యులార్ పునరుత్పత్తికి దోహదం చేస్తాయి. దాంతో నెత్తి మీద రక్తనాళాలకు ఆరోగ్యకరమైన ప్రసరణను ప్రోత్సహిస్తాయి.దాంతో జుట్టును ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుతాయి. తల దురద నుండి ఉపశమనం పొందడం నుండి గ్రే హెయిర్ ను భర్తీ చేయడం మరియు జుట్టు రాలడం నుండి నిస్తేజంగా ఉన్నజుట్టుతో పోరాడటం వరకు, కరివేపాకుకు లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ లక్షణాలు జుట్టు పెరుగుదల మరియు చర్మపు పునరుద్ధరణను ప్రోత్సహించడంలో సహాయపడతాయి మరియు స్కాల్ప్ యొక్క మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతాయి

కొబ్బరి నూనె-కరివేపాకు

కొబ్బరి నూనె-కరివేపాకు

ఆరోగ్యకరమైన మరియు ఒత్తైన జుట్టు పెరగడానికి ఆరోగ్యకరమైన మరియు శుభ్రమైన స్కాల్ప్ అవసరం. అందుకు మీకు కొబ్బరి నూనె మరియు కరివేపాకు సహాయపడుతాయి. కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు నిండుగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయడుతాయి. ఒక గిన్నెతీసుకుని అందులో సరిపడా కొబ్బరి నూనె పోసి, ఒక గుప్పుడు కరివేపాకులను జోడించాలి. ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. నూనెలో కరివేపాకు బాగా నల్లగా మారే వరకు తక్కు మంట మీద వేడి చేయాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత వడకట్టి, జుట్టుకు పట్టించాలి. ఇది మీ జుట్టును నల్లగా మార్చుతుంది. ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

ఉసిరికాయ, మెంతులు మరియు కరివేపాకు

ఉసిరికాయ, మెంతులు మరియు కరివేపాకు

ఉసిరికాయ, మెంతులతో పాటు కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల పెరుగుతుంది. కరివేపాకులో విటమిన్ బి జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పేస్ట్ చేయడానికి, అరకప్పు కరివేపాకు మరియు మెంతులు తీసుకుని దానికి ఒక ఉసిరికాయ రసాన్ని జోడించండి. ఈ మూడు పదార్థాలను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని తలకు పట్టించి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును బాగా కడగాలి. ఈ నేచురల్ రెమెడీ మీ జుట్టు రాలడాన్ని ఆపివేసి, జుట్టు వేగంగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

 పెరుగు మరియు కరివేపాకు హెయిర్ మాస్క్

పెరుగు మరియు కరివేపాకు హెయిర్ మాస్క్

కరివేపాకు హెయిర్ మాస్క్ చేయడానికి, పెరుగును కరివేపాకు పేస్ట్ తో కలపండి. పెరుగు మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. కాబట్టి స్కాల్ప్ క్లెన్సర్ మరియు స్కాల్ప్ నుండి అన్ని మృతకణాలను మరియు చుండ్రును తొలగిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ముందుగా కొన్ని కరివేపాకులను తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక కప్పులో పెరుగు తీసుకుని, అందులో ఒక టీస్పూన్ కరివేపాకు పేస్ట్ వేయాలి. ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకు బాగా కలపండి. ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని మీ తల నుండి మొత్తం జుట్టుకు అప్లై చేయండి. 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత షాంపూతో కడిగేయాలి. ఇది మీ జుట్టుకు చక్కని మెరుపును ఇస్తుంది.

జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయ మరియు కరివేపాకు

జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉల్లిపాయ మరియు కరివేపాకు

ఉల్లిపాయ రసం మరియు కరివేపాకు కలయిక జుట్టుకు చాలా ప్రత్యేకమైనది.చిన్న వయస్సులోనే జుట్టు నెరవడాన్ని నివారించడంలో, జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో ఉల్లి మరియు కరివేపాకు సహాయపడతాయి. 15-20 తాజా కరివేపాకు తీసుకుని, ఆకులను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఆ పేస్ట్‌లో ఉల్లిపాయ రసాన్ని కలపండి. ఈ పేస్ట్‌ని మీ జుట్టు మీద సుమారు గంటసేపు ఉంచండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.

English summary

Ways to Use Curry Leaves for Voluminous Hair in Telugu

Here we are talking about the ways to use curry leaves for voluminous hair in telugu
Desktop Bottom Promotion