For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రుల్లో తలస్నానం చేసే అలవాటుందా, అయితే ఖచ్చితంగా ఇది మీకోసమే...

రాత్రుల్లో తలస్నానం చేసే అలవాటుందా, అయితే ఖచ్చితంగా ఇది మీకోసమే...

|

సాధారణంగా జుట్టును శుభ్ర పరుచుకోవడం చాలా మంది నిరక్ష్యం చేస్తుంటారు. అందువల్ల జుట్టు సమస్యలు పెరుగుతుంటాయి. కొంత మంది ఉదయం సమయం ఉండదని, రాత్రుల్లో తలస్నానం చేస్తుంటారు. ఈ పద్ధతి ఏమాత్రం మంచిది కాదని బ్యూటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి రాత్రుల్లో తలస్నానం చేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఖచ్చితంగా అలా చేయకూడదు. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల మీ జుట్టుకు చాలా హాని జరగుతుందే విషయం మీకు తెలియదు.

రాత్రి సమయంలో తలస్నానం చేయడం అనేది ప్రతి కోణంలోనూ తప్పే. ఇలా చేయడం ద్వారా, మీ జుట్టు మరియు మూలాలు బలహీనపడతాయి. రాత్రిపూట తలస్నానం చేసి అలాగే నిద్రించడం వల్ల జుట్ట మరింత దెబ్బతింటుంది . కాబట్టి జుట్టుకు తగిన జాగ్రత్తలు వహించాలని మీకు సూచన.. రాత్రుల్లో తలస్నానం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం..

జుట్టు మరింత తెగిపోతుంది.

జుట్టు మరింత తెగిపోతుంది.

రాత్రుల్లో తలస్నానం చేసి, తడి జుట్టుతో నిద్రపోయే సమయంలో బెడ్ పై అటు ఇటు తిరిగి పడుకునేటప్పుడు బెడ్ కు లేదా తలగడలకు అంటుకుని పొడి జుట్టుకంటే త్వరగా, సులభంగా మరింత తెగిపోవడం జరుగుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టు యొక్క క్యూటికల్ మరింత పైకి వస్తుంది, ఇది జుట్టు విచ్ఛిన్నానికి కారణమవుతుంది.

జుట్టు అల్లికలు క్షీణిస్తాయి

జుట్టు అల్లికలు క్షీణిస్తాయి

ఇదే కాకుండా, రాత్రిపూట తలస్నానం చేయడం వల్ల మరొక ప్రతికూలత ఉంది, ఏమిటంటే, జుట్టు సరిగ్గా తడి ఆరినప్పుడు మీరు నిద్రపోయే విధానం వేర్వేరు ఆకృతులను ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీ జుట్టు మరింత చిక్కుబడి చూడటానికి, మీ జుట్టు ఆకృతిని కోల్పోయి చిందరవందరగా కనబడుతుంది.

వెంట్రుకలు చిక్కు పడతాయి

వెంట్రుకలు చిక్కు పడతాయి

తరచుగా, చాలా మంది మహిళలు రాత్రిపూట తలస్నానం చేసి తర్వాత తలను దువ్వడం అవసరం లేదని భావిస్తారు. దీనివల్ల తడిగా ఉన్న వెంట్రుకల ముద్దగా ఉంటాయి మరియు దాని వల్ల ముడులు, తల దువ్వినా విడదియడానికి వీలు పడని చిక్కు ముడులు ఏర్పడుతాయి. మరుసటి రోజు మీరు ఈ ముడులు తొలగించుకోవడానికి ఎక్కువ సమయం దువ్వాల్సి వస్తుంది. కారణంగా జుట్టు యొక్క స్థితిస్థాపకతకు కారణమవుతుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్యలు వస్తాయి.

తలలో ఫంగల్ పెరిగే అవకాశం ఉంది

తలలో ఫంగల్ పెరిగే అవకాశం ఉంది

తడి జుట్టు మరియు తలలో తెమతో అలాగే నిద్రపోవడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. తడి జుట్టు తేమ కారణంగా వేగంగా ఫంగల్ పెరుగుదలకు కారణమవుతుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే, ఈ అవకాశం మరింత వేగంగా పెరుగుతుంది.

జలుబు లేదా అలెర్జీలు పెరగవచ్చు

జలుబు లేదా అలెర్జీలు పెరగవచ్చు

రాత్రి సమయంలో తలస్నానం చేసుకోవడం వల్ల అలెర్జీల వంటి సమస్యలు పెరగడమే కాక, తలనొప్పి మరియు తల భారానికి కూడా కారణమవుతుంది. తేమ కారణంగా, తల చల్లగా ఉంటుంది మరియు శరీరం వెచ్చగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఇది చల్లగా మరియు వేడిగా మారుతుంది. అదే సమయంలో, జుట్టు ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల తలనొప్పి, మైగ్రేన్ సమస్య కూడా తలెత్తుతుంది. అదే సమయంలో, తడి జుట్టుకు ఎక్కువ సమయం అలాగే ఉండటం వల్ల తలలో దుమ్ము చేరడం మొదలైన వెంట్రుకలకు అంటుకోవడం ద్వారా అలెర్జీ ప్రమాదం కూడా పెరుగుతుంది.

దీన్ని జాగ్రత్తగా చూసుకోండి

దీన్ని జాగ్రత్తగా చూసుకోండి

ఇటువంటి పరిస్థితిలో మీరు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా?అయితే మీరు రాత్రి పూట ఖచ్చితంగా మీరు తలస్నానం చేయకూడదని మేము మీకు చెప్పము, కానీ తలస్నానం చేసిన తర్వాత తలను బాగా ఆరబెట్టి, తడి పూర్తిగా ఆరిన తర్వాత నిద్రించాలి. జుట్టు చిక్కుబడకుండా ఉండాలంటే మంచి కండీషనర్ , హెయిర్ సీరంను వాడండి.

English summary

Why You Shouldn't be Washing Your Hair at Night

does washing your hair at night make you sick,when is it best to wash your hair,washing hair at night styling in the morning,washing hair at night headache,showering at night hair tips,wash hair at night straighten in morning,how often should you wash your hair, wash hair at night or morning reddit,
Story first published:Monday, November 25, 2019, 15:58 [IST]
Desktop Bottom Promotion