For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తైన, అందమైన జుట్టు కోసం ఇంట్లో చేసుకునే వేడి నూనె చికిత్స

|

జడలు కట్టిన, ఎండిపోయిన, కాంతి లేని, నిగారింపులేని జుట్టుని ఎవరూ కోరుకోరు. అదృష్టవశాత్తు అందమైన, ఒత్తైన మరియు నిగారింపు కలిగిన జుట్టుని సొంతం చేసుకునేందుకు మీ వంట ఇంటిలో లభించే ఎన్నో అద్భుతమైన ఔషదాలతో ఇప్పుడు సాధ్యం. వంటకి వాడే వెజిటబుల్ ఆయిల్ మీ జుట్టుకి పోషణ కలిగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు చివర్ల చిట్లినా, కాంతి పోయినా వెజిటబుల్ ఆయిల్ వాడడం వల్ల తిరిగి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. మీ జుట్టుకి అందించే వేడి నూనె చికిత్సకు పువ్వులు, మూళికలు వంటివి అదనపు కండిషనింగ్ శక్తిని ప్రసాదిస్తాయి.

వేడి నూనె చికిత్స విధానం

1. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ మరియు ద్రాక్ష విత్తనాల నూనె లని తీసుకుని ఒక గిన్నెలో కలుపుకోవాలి. పది సెకండ్ల పాటు ఈ ఆయిల్ ని మైక్రోవేవ్ లో వేడి చేసుకోవాలి. దీనికి ప్రత్యామ్నాయంగా, ఈ నూనె గిన్నెని వేడి నీళ్ళు కలిగిన గిన్నెలో పెట్టుకోవడం వల్ల నూనె వేడెక్కుతుంది. మూడు చుక్కలు సుగంధ తైలాలైన రోజ్ మేరీ మరియు లావెండర్ నూనెలు, మరియు సెజ్ నూనె రెండు చుక్కలు ఈ వేడి నూనె కి జోడించండి. చెక్క గరిటె తో ఈ మిశ్రమాన్ని బాగా కలపండి.

How to Do a Hot Oil Treatment for Hair at Home

2. ఇప్పుడు మీ జుట్టుని నాలుగు విభాగాలుగా విభజించండి. మీరు తయారు చేసుకున్న నూనె ని కొంచెం మీ చేతికి వెనుక భాగంలో రాసుకుని నూనె వేడి మీకు సరిపోయినట్లుగా ఉందో లేదో నిర్ధారించుకోండి. నూనె వేడి మీకు తగినట్లుగా ఉన్నాక, మీ తలపై ఉండే చర్మంపై ఈ నూనెతో మర్దనా చేసి, జుట్టు చివరి వరకు నూనెతో రాయండి. ప్రతి విభాగంలో జుట్టుని ఇదే విధంగా మర్దనా చెయ్యండి.

3. మర్దనా చెయ్యబడిన మీ జుట్టుని ప్లాస్టిక్ కండిషనింగ్ కేప్ తో కప్పి ఉంచండి. పది నుండి పదిహేను నిమిషాల వరకు బోన్నెట్ డ్రైయర్ కింద లేదా హీటింగ్ కేప్ కింద కూర్చోండి. ప్రత్యామ్నాయంగా, మీ తలపై ఒక వేడి టవల్ ని చుట్టుకుని, ఆ టవల్ ని ఇంకొక టవల్ తో చుట్టి వెయ్యండి. అనుకున్న సమయం పూర్తయిన తర్వాత మీకు నచ్చిన ఉత్పత్తులతో యధావిదిగానే తలస్నానం చెయ్యండి.

చిట్కాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు

వేడి నూనెతో మర్ధనాని ముందు రోజు రాత్రి చేసుకుని మరునాడు ఉదయం తలస్నానం చేసి కండిషనింగ్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

ఇంతకు ముందు మీరు వాడని నూనెలని మీ జుట్టుపై చేసే ఈ వేడి నూనె చికిత్సలో వాడే ముందు అవి మీ శరీర తత్వానికి సరిపడతాయో లేదో తెలుసుకోవాలి. మీ మెడ వెనుకభాగంలో లేదా మీ చంక భాగంలో వీటిని ముందుగా కొంచెం అప్లై చేసి గమనించాలి. ఒక వేళ తెలియకుండా సరిపడని ఆయిల్స్ ని వాడితే దుష్ఫలితాలు కలిగీ అవకాశాలు గలవు.

English summary

How to Do a Hot Oil Treatment for Hair at Home | ఒత్తైన జుట్టుకోసం హాట్ ఆయిల్ మసాజ్..!

Nobody likes a bad hair day, or battling with dry, unmanageable locks. Fortunately, a cheap and easy solution can be found in your kitchen pantry. The same vegetable oils that you use for cooking are excellent natural hair conditioners that penetrate hair strands to restore suppleness and shine, and prevent split ends.
Story first published: Saturday, December 22, 2012, 15:32 [IST]
Desktop Bottom Promotion