For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన జీవితాన్ని...అందంగా.. గడపటం ఎలా..!

|

ఆరోగ్యంగా జీవించడానికి మార్గం ఏమిటి? ప్రతి ఒక్కరిలో ఉదయించే పెద్ద ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు సమాధానమే సరైన పౌష్ఠికాహారం. చక్కటి ఆరోగ్యాన్ని ఆశించనివారు ఉండరు. ఆరోగ్యంగా, అందంగా ఉండడం అంత పెద్ద కష్టమేమీ కాదు కాని కాస్త శ్రద్ధ చూప వలసి ఉంటుంది. ఆరోగ్యమే మహా భాగ్యం అనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ఈ నాటి ఆధునిక యుగంలో, ప్రతి ఒక్కరు ధనార్జనే ధ్యేయంగా పరుగులు తీస్తున్నారు.

ఈ పరుగులలో ఏంతో ముఖ్యమైన ఆరోగ్యం కోసం తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తలని కూడా విస్మరిస్తున్నారు. ఎవరో ఒకరు పక్కన ఉండి మనకి ఆరోగ్యం గురించి శ్రద్ద వహించమని గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎంత సంపాదించినా అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి. అందుకే, ఆరోగ్యమే మహా భాగ్యం. జీవన శైలిలో కొన్ని మార్పులతో వయసు మరియు లింగభేధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యం గా ఉండడానికి ఈ క్రింది సూచనలను పాటించండి.

ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

అల్పాహారం: ఉదయాన్నే అల్పాహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అల్పాహారాన్ని దాటవేసిన ప్రతి సారి మన జీవిత కాలం తగ్గిపోతుందనే నానుడి ఉంది. అల్పాహరమనేది జీర్ణకోశ సంబంధిత ఆరోగ్యానికి ఎంతో కీలకమైనది.

ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

మంచి నిద్ర: ఆరోగ్యకరమైన శరీరాన్ని మరియు మనసుని ప్రసాదించగలిగేది ఆరోగ్యకరమైన నిద్ర. రోజుకి సుమారు 8 గంటల నిద్రా సమయం అవసరం. ఆరోగ్యకరమైన నిద్రకి ఎంత సేపు నిద్రపోయమన్నదే కాకుండా ప్రశాంతంగా నిద్రపోయామా లేదా అన్నది కూడా ముఖ్యం.

ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

నీరు బాగా త్రాగాలి: మంచినీరు ఎన్నో రోగాలకి దివ్య ఔషదం వంటిది. ప్రతి రోజు అవసరమైనంత నీరు శరీరానికి అందే విధంగా చూసుకోవాలి. సుమారు 8 లీటర్ల నీరు ప్రతి రోజు త్రాగాలి. మంచి నీరు శరీరాన్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఏంతో అవస్యకమైనది అన్న విషయం మరువకూడదు.

ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

స్నేహితులు-సంబంధ బాంధవ్యాలు: కుటుంబంలో గాని సమాజంలో గాని తోటివ్యక్తులతో ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలని ఏర్పరచుకోవడం ప్రశాంతమైన, ఆనందకరమైన జీవనానికి మూలకారణం. దిని వలన మన మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక గంట చిన్నపిల్లలతోను, వృద్డులతోను గడపగలిగితే అది మనకి రోజువారీ ఉండే ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

నడక: ప్రతిరోజూ నడకని మీ దినచర్యలో భాగంగా మార్చుకోండి. నడక అనేది కొవ్వుని కరిగించడం ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది.

ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

యోగా(ధ్యానం): ఆరోగ్యాన్ని పొందేందుకు ధ్యానం మరియు యోగాలని ముఖ్య అంశాలుగా పరిగణించవచ్చు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం యోగా మరియు ధ్యానం చెయ్యడం ద్వారా పొందవచ్చు. ప్రతి రోజు అరగంట సేపు వీటికి కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

దంత సంరక్షణ: దంత సంరక్షణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం దంత ధావనం చెయ్యడం ద్వారా దంత సంరక్షణ చేసుకుని ఆరోగ్యమైన దంతాలను పర్సుభ్రమైన నోటిని పొందవచ్చు. దీనివలన్ నోటినుండి సంభవించే అనారోగ్యలని దూరంగా ఉంచవచ్చు.

ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

కూరగాయలు, పండ్లు: చిరుతిండ్లు తగ్గించి పండ్లు మరియు కూరగాయాలని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. పండ్లలో మరియు కూరగాయాలలో లభించే పోషకాల ద్వారా జ్ఞాపక శక్తి పెరగడంతో, శరీరానికి సరిపడా పోషకాలు లభిస్తాయి.

English summary

How to Lead a Healthy Life | ఆరోగ్యకరమైన జీవితాన్నిఅదంగా గడపటం ఎలా?

Healthy habits are not taken care of by a majority of the people. In this techno savvy world with people running after money, there is need for some one to keep reminding us to take care of our health. Here are a few healthy habits that can be practiced in our every day life with no extra efforts, regardless of our age or gender.
Desktop Bottom Promotion