For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేడి నీళ్ళ స్నానంతో విశ్రాంతి పొందడం ఎలా...?

|

బాగా పనిచేసిన రోజు సాయంత్రం విశ్రాంతినిచ్చే స్నానం చేయాలంటే, మీ స్నానాన్ని ఒక స్పా లాగా బాగా విశ్రాంతిగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

చర్యలు :

1. మీ కోసం మీరు చివరిసారిగా ఒత్తిడులన్నీ దూరం అయ్యేలా ఎప్పుడు స్నానం చేసారో గుర్తు తెచ్చుకోండి.

2. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించుకోండి. మీరు విశ్రాంతి తీసుకునేలోగా మీ దైనందిన చర్యలు, ఇంటి పనీ చేసేసుకోండి. కాసేపు మీ మనసు, శరీరం, ఆత్మ మీద ధ్యాస వుంచి మీ బాధలన్నీ కాసేపు మర్చిపోండి.

3. స్నానాన్ని ప్రత్యేకం చేసుకోండి. ఫోన్ ను హుక్ మీద నుంచి తీసివేయండి. మీకోసం గ్లాసులో వైన్ పోసుకోండి, ఒక పుస్తకం తీసుకోండి, స్నానాల గదిలో లైట్లు ఆర్పివేసి కొవ్వొత్తి వెలిగించండి(సుగంధ భరితమైనవి ఐతే మంచిది), బాత్ ఆయిల్, బుడగలు లేదా బాత్ బాంబ్స్ ఉపయోగించి వేడి నీళ్ళు కలుపుకొండి. ఈ మధ్య సుగంధ చికిత్సల ఎంపికలు కూడా చాలానే దొరుకుతున్నాయి. బజార్లో చాలా మంచి స్నానపు ఉత్పత్తులు దొరుకుతున్నాయి - అవి కొని తెచ్చుకోవడం కూడా మంచి ఆలోచనే.

How to Relax With a Hot Bath

4. మిమ్మల్ని మీరు టబ్ లో ముంచుకోండి - మీ బాధలన్నీ టబ్ లోంచి బయటకు పొంగే నీటితో పాటు కొట్టుకు పోనీండి.

5. విశ్రాంతిగా వుండండి. మీ బాధలన్నీ నీటిలో కరిగిపోనీయండి. సూర్యుడు తారాడే సాగర తీరాలు, తారలతో వెలిగిపోయే ఆకాశాలు లాంటి సంతోషకరమైన ఆలోచనలు రానీయండి - పిల్లలు, పని, డబ్బుల గురించిన ఆలోచనలు ఆవిరైపోనీయండి. మీ మనసును తెరవండి, ధ్యానం చేయండి, కేవలం ఆస్వాదించండి.

6. సాధ్యమైనంత ముందుగానే స్నానం చేయండి, దాని వల్ల మీరు త్వరగా శుభ్ర పడతారు - అలా మురికిగా ఎక్కువ సేపు ఉండకుండా.

7. స్నానం చేసేటప్పుడు వినడానికి హాయిగా వుండే పాటల ప్లే లిస్టు తయారు చేసుకోండి.

8. మంచి స్నాన౦ చేయడానికి ముఖానికి పూత, మంచి పుస్తకం కూడా అవసరమే. కాస్త సృజనాత్మకంగా ఆలోచించి ఇంట్లోనే ఒక అరటి పండు (గుజ్జు చేసినది), ఒక టేబుల్ స్పూన్ తేనె, అయిదు టేబుల్ స్పూన్ల ఓట్లు కలిపి ముఖానికి పూత తయారు చేయండి. కాస్త అందుబాటు ధరల్లో వుండే ముఖం పూతలను దుకాణాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు.

చిట్కాలు :

మీరు నీటిలో నానుతుండగా మీకు ఇష్టమైన పానీయాన్ని తాగడానికి బాత్ టబ్ పక్కనే ఉంచుకోండి.

ముఖం మీద పూత వేసుకుని నిజంగా స్పా లో వున్న అనుభూతి పొందండి.

హెచ్చరికలు :

స్నానపు తొట్టె లో వుండగా ధ్యానం చేయడం ప్రమాదకరం కావచ్చు, మునిగి పోకుండా ఉండేలా అభ్యాసం చేయ౦డి, లేదా మీరు ఎక్కడ వున్నారో, ఏం చేస్తున్నారో ఇతరులకు చెప్పి మిమ్మల్ని ఆటంక పరచ వద్దని చెప్పండి.

స్నానం చేసేటప్పుడు మరీ ఎక్కువగా వైన్ తాగకండి. అది ఒలికిపోవచ్చు లేదా కారిపోవచ్చు. గోరువెచ్చటి లేదా వేడి నీళ్ళలో కూర్చుని ఆల్కహాల్ తాగితే మీకు బాగా నెప్పులు కూడా రావచ్చు.

స్నానం చేసేటప్పుడు మీకు రేడియో, టేపులు లేదా సి డి లు వినడం ఇష్టమైతే, మీరు వాడుతున్నది ఏదైనా సరే పొరపాటున కూడా జారి నీళ్ళలోకి పడనటువంటి ప్రదేశంలో వుంచండి.

మీరు గమని౦చ గలిగేంత సురక్షితమైన దూరంలో కొవ్వొత్తి వుంచండి.

నీళ్ళలో మరీ ఎక్కువ సేపు ఉండకండి - దాని వల్ల చర్మం త్వరగా వయసు మీరుతుంది.

English summary

How to Relax With a Hot Bath | వేడి నీటి స్నానంతో సేద తీరడం ఎలా?

If you need to have a relaxing bath after a hard day's work, read this article for what to do to make your bath as relaxing as a spa.
Desktop Bottom Promotion