షాంపూ మరియు కండీషనర్ తో తలస్నానం చెయ్యడం ఎలా ?

By Sindhu
Subscribe to Boldsky

ఏ కాలం లో అయినా చర్మం కాంతివంతంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు కాంతి వంతంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగటంతో పాటు రోజూ షాంపూయింగ్ చేస్తూ ఉండాలి. ప్రతి రోజూ తల స్నానం చేస్తే జుట్టు రాలిపోతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ప్రతి రోజూ తల స్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోవడం ఏమీ ఉండదు. మనం వాడే షాంపులు, అనారోగ్య కారణాలే జుట్టు రాలిపోడానికి కారణం.

తలస్నానం చెయ్యడం, వినడానికి ఎంతో సులభంగా అనిపించినా, ఎక్కువ మంది తప్పు పద్దతిలో జుట్టుని వాష్ చేస్తారు. అయితే, మెరుస్తున్న, ఆరోగ్యకరమైన జుట్టుని పొందేందుకు తలస్నానం చేసే సరైన పద్దతిని ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

How to take proper Head Bath

పద్దతులు

1. షాంపూ, కండిషనర్ మరియు ఒక దువ్వెనని తీసుకోండి.

2. చిక్కు పడకుండా ఉండేందుకు తలస్నానానికి వెళ్ళే ముందు మీ జుట్టుని చక్కగా దువ్వుకోండి.

3. గోరువెచ్చని నీటితో మీ జుట్టుని పూర్తిగా కడగండి. 30 సెకండ్ల పాటు జుట్టుని తడిగా ఉంచుకోండి.

4. మీ అరచేతిలో కొంత షాంపూని తీసుకోండి. మీ జుట్టు పొడుగు మరియు ఒత్తుని బట్టి షాంపూ ని వాడే మొత్తం మారుతుంది. సాధారణంగా ఒక డాలర్ లేదా కాయిన్ సైజులో తీసుకోవచ్చని అంచనా.

5. మీ ముని వేళ్ళతో తలపై నున్న చర్మంపై సుతారంగా మర్దనా చెయ్యాలి. గోర్లని వాడవద్దు. తలపై న భాగంలో మర్దనా చేయండి. షాంపూ తో జుట్టు కుదుళ్ళకి కండిషన్ ని జుట్టు చివర్లకి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

6. గోరు వెచ్చని నీటితో జుట్టుని కడగండి. షాంపూ మొత్తం పోయేవరకు జుట్టుని శుభ్రపరచాలి.

7. ఇప్పుడు కొంత కండీషనర్ ని మీ అర చేతిలోకి తీసుకోండి. మెడ వెనుక భాగంలో నుండి మీ మునివేళ్ళతో జుట్టుని కండీషనర్ తో రాయండి. మీ జుట్టు మొనలని చేరే వరకు ఇలా రాయండి.

8. తరువాత రెండు మూడు నిమిషాలు కండీషనర్ జుట్టుకి పట్టేంతవరకు సమయం ఇవ్వండి. జుట్టు మొత్తానికి కండీషనర్ వ్యాప్తి చెందేందుకు మెల్లగా దువ్వండి.

9. ఇప్పుడు గోరువెచ్చని నీటితో కండీషనర్ మొత్తం తొలగిపోయేవరకు జుట్టుని కడగండి.

10. మీ కేశాలు అందంగా మెరవడం కోసం చల్లని నీటితో మీ జుట్టుని శుభ్రం చెయ్యండి.

11. ఒక తువ్వాలు తీసుకుని జుట్టు తడి అరిపోయేవరకు తుడవండి. జుట్టుని గట్టిగా పిండకండి.

12. జుట్టుని సహజంగా తడి ఆరబెట్టండి. డ్రైయర్ వాడడం మంచిది కాదు.

చిట్కాలు

రేడియో వింటూ తలస్నానం చెయ్యడం ఏంటో ఆనందాన్ని కలుగచేస్తుంది. ఎంతో ఆహ్లాదంగా, రిలాక్సింగ్ గా ఉంటుంది. అయితే, మీ రేడియోని లేదా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువుల పై తడి పడకుండా జాగ్రత్తపడండి.

హెచ్చరిక

తలస్నానం తరువాత జుట్టుని జాగ్రత్తగా శుభ్రం చెయ్యండి. లేకపోతే జుట్టు జిడ్డుగా ఉంటుంది.

తడిగా ఉన్నప్పుడు జుట్టుని దువ్వకండి. జుట్టు చిట్లి, పాడైపోయే అవకాశం ఉంటుంది. జుట్టు బాగా తడి ఆరాక దువ్వితే మంచిది. జుట్టు పైన షాంపూని రాసేటప్పుడు చిక్కు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా తలస్నానం చెయ్యండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How to take proper Head Bath | జుట్టు రాలకుండా తలస్నానం చేయడానికి సులభ చిట్కాలు

    It is important to know how to shower properly. Head wash doesn't men applying a few dabs of shampoo and washing your head in a jiffy. Spend enough time on this activity. Spend at least a minute patiently doing it. Take a few drops of shampoo and distribute it uniformly on your hair. Spread it evenly from the roots till the ends.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more