For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గంధాన్ని చర్మసౌందర్యానికి ఎలా వాడాలి ?

|

అందం.. దీనికోసం అందరూ తహతహలాడుతుంటారు. ఎల్లవేలళా కాంతివంతంగా మెరిసిపోవాలని.. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని.. ఆరాటపడటం కామన్. అయితే అందంగా.. ఆకర్షణీయంగా కనిపించడానికి ఏవో మార్కెట్ లో దొరికే ఫేస్ ప్యాక్ లు వేసుకోకుండా.. చక్కగా.. ఓపిగ్గా ఇంట్లోనే ప్యాక్ లు తయారుచేసుకుంటే బెటర్.

అందరికీ తెలిసిన.. అందరికీ అందుబాటులో ఉండే.. గంధం.. మీ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తుంది. సహజసిద్ధంగా దొరికే గంధంలో ఎన్నో సుగుణాలుండటమే కాక.. చర్మానికి ఎలాంటి హాని చేయదు. గంధం వాడటం వల్ల ముఖవర్చస్సు పెరగడమే కాదు.. స్మూత్ గానూ ఉంటుంది. అయితే చాలామందికి గంధం ఎలా వాడాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకే సింపుల్ గా ఈజీగా గంధంను ఫేస్ కి ఎలా అప్లై చేయాలో చూసేద్దాం.

sandal

స్టెప్ 1
ఒక టీ స్పూన్ గంధం పొడి తీసుకోవాలి. ఒకవేళ పొడి లేకపోయినా.. గంధం చెక్క ఉంటే మరీ మంచిది. గంధపు చెక్కను కొద్దిగా నీటితో తడిపి.. రాతిపై రుద్దినా.. పేస్ట్ వస్తుంది.

sandal
స్టెప్ 2
ఈ గంధం పొడి లేదా.. మిశ్రమానికి టీ స్పూన్ పాలు లేదా టీ స్పూన్ రోజ్ వాటర్.. మరో టీ స్పూన్ పసుపు కలపాలి. పసుపు యాంటీ సెప్టిక్ లా పనిచేస్తుంది. పాలు మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది.

sandal
స్టెప్ 3
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి ఒకసారి ప్రయత్నించి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది. మొటిమలు, మచ్చలు ఉన్నా కూడా.. గంధం ప్యాక్ పనిచేస్తుంది.

English summary

How To Apply Sandalwood Powder On Face: beauty tips in telugu

If you have the patience and time, natural remedies are the best. Using sandalwood on face can have a very soothing and a healing effect on your skin. We already know about the myriad number of benefits of sandalwood powder. Let us discuss how to use it on your face.
Desktop Bottom Promotion