For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలి కాలంలో వాడాల్సిన ‘సబ్బు’..?

|

Which Soap Is Worthfull In Beautiful Winter
చలి సీజన్ ప్రారంభమైంది. శీతల ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా చర్మం పై ప్రభావం చూపుతున్నాయి. వాతవరణంలో ఒక్క సారిగా శీతల మార్పులు కారణంగా చర్మం పొడిబారటమే కాకుండా బిరుసుగా తయారవుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా చర్మం పొడిబారటం, తెల్లగా పొట్టుపోయినట్లు దర్శనమిస్తుంది. కొంత మందిని పెదాల పగుళ్లతో బాధిస్తుంటాయి.

- సబ్బు వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి, ముఖ్యంగా చలికాలంలో గ్లిజరిన్ శాతం ఎక్కువున్న సబ్బును ఎంచుకోండి. చలి కాలంలో సబ్బును రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రమే ఆప్లై చేయాలి.

- చలికాలం శరీర సంరక్షణ చర్యల్లో భాగంగా ముందుగానే వ్యాజలిన్ తో పాటు మన్నికైన కోల్డ్ క్రీమును దగ్గరపెట్టుకోండి.

- పెదాల పగుళ్లతో భాదపడేవారు రాత్రుళ్లు నిద్రించే ముందు పెదాలకు వెన్నలేదా నెయ్యిను రాసుకోవాలి.

- బయటకు వెళ్ళి వచ్చిన ప్రతి సందర్భంలో చేతులు, కాళ్లును శభ్రపరుచుకోండి.

- చర్మం పొడిబారకుండా ఉండేదుకు స్నానానికి ముందు కొబ్బరి నూనెతో శరీర భాగాలను మర్దనా చేసుకోండి.

- కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకుని ఓ సీసాలో భద్రపరుచుకోండి. స్నానానికి ముందు శరీరా భాగాలకు ఆప్లే చేయండి.

- నిద్రపోయే ముందు ముఖానికి మన్నికైన 'కోల్డ్ క్రీమ్' రాసి ఉదయాన్నే గోరువెచ్చిటి నీటితో శభ్రం చేసుకోండి. ఇలా చేయటం వల్ల ముఖ వర్చస్సు మరింత కాంతివంతంగా తయారవుతుంది.

English summary

Which Soap Is Worthfull In Beautiful Winter | చలి కాలంలో వాడాల్సిన ‘సబ్బు’..?

Winter is just not about warm clothes, fireside reading, snuggling close to the pillows wrapped from head to toe with a comfy quilt. It is time to battle the cold winds that hampers your body and hair. A little care will keep the wintry troubles at bay.
Story first published:Tuesday, November 8, 2011, 11:58 [IST]
Desktop Bottom Promotion