For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హుందాతనాన్ని ఉనికిని తెలియజేసే డ్రెస్ సెన్స్

|

Dressing Ideas for Women
గతంతో పోల్చుకుంటే నేడు వివిధ షాపింగ్ మాల్స్, షోరూంలు డెకరేషన్ లలో కొత్త దనాన్ని సంతరించుకుంటూ చూపరులను ఆకట్టుకొంటున్నాయి. ముఖ్యంగా సీజన్ బట్టి కూడా షాపింగ్ మాల్స్, షోరూంలు, అలంకరణలు ప్రాయంగా ఉండటాన్ని ఎంతో ఆకట్టుకుంటోంది. పండుగ వేళల్లో అయితే షాపింగ్ మాల్స్ శోభాయమానంగా చూపిస్తున్నాయి. పేపర్ యాడ్ లు, టీవీ యాడ్ లతో సరికొత్త డిజైన్లను తెలియజేస్తు కస్టమర్లను ఆకట్టుకొనేలా చేస్తున్నాయి.

మారుతున్న కాలనికి అనుగుణంగా మారుతున్న అలంకరణ షోరూంలవైపే ఎక్కువ మగ్గుచూపుతున్నారు తప్ప సాధారణంగా ఉండే షోరూంలకు నేడు ఎవరూ వెళ్లడం లేదు. ముఖ్యంగా ఈతరం యూత్ కైతే వెరైటీ గా ఉండాల్సిందే. ఈ తరం యూత్ ఎక్కువగా బ్రాండెడ్ వస్త్రాల పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అందుకు కారణం ఏదో కొత్తదనంతో ఆకట్టుకోవడమే. కాలేజీ స్టూడెంట్స్, టీనేజర్స్ మాత్రమే కాకుండా ఉద్యోగినులు, గహిణిలు సైతం కొత్తదనం కోరుకుంటున్నారు.

ముఖ్యంగా స్త్రీలు అందంగా..ఆకర్షణీయంగా అలంకరించుకోవటంలో ఎవరికి వారే నేర్పరులు. డ్రెస్పింగ్, అలంకరణ వస్తువులు, కంఠాభారణాలు, చెవులకు ఆభరణాలు, చేతులకు వివిధ డిజైన్లకు ఆకర్షితులై తమకంటూ ఒక స్టైల్‌ను అలవర్చుకుంటారు. ఆభరణాలను ఇష్టపడినట్టుగానే, కేశాలంకరణలో కూడా రకరకాల స్టైల్స్‌లో అలకరించుకోవడం. లేదా హెయిర్ స్టైల్ మార్చేయడం. కట్ చేసుకోవడం వంటి వాటితో ముచ్చటపడిపోతారు మగువలు. సింపుల్ డ్రెస్సింగ్ కొందరికి నప్పితే... కొందరు డ్రెస్ ఖరీదు వేలల్లో ఉంటే గాని ధరించడానికి ఇష్టపడరు. ఎంతలేదనుకున్నా, ఎవరుకాదన్న మన వేషధారణే ముందుగా మనల్ని ఇతరులకి పరిచయంచేస్తుంది. ‘ఐ డోంట్ కేర్‌‘ అనుకోకుండా మనం ధరించే దుస్తులపై, మన అలంకరణ పై తప్పకుండా ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి.

అలంకరణలలో ఎవరి ఇష్టం వారిదే ఐన్నప్పటికీ...కొన్ని చిన్న చిన్న విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ‘ఫ్యాషన్ ఐకాన్’ గా అందరి దగ్గర నుండి ప్రశంసలు పొందవచ్చు. ఆఫీస్‌ లకు వెళ్లే ఆడవాళ్లు సౌకర్యవంతంగా ఉండే కాటన్స్, లెనిన్స్ మెటీరియల్ దుస్తులను ధరించాలి. అవి హుందాగా ఉండటమే కాదు మనకంటూ ఒక ఉనికిని క్రియేట్ చేస్తాయి. ఆభరణాలు, మేకప్ అతిగా చేసుకోకుండా మినిమమ్‌గా ఉండేట్టు చూసుకోవాలి. జుట్టుని కూడా సింపుల్ పోనిటెయిల్, జడ లేదా ఈజీగా మ్యానేజ్ చేయగలిగే హెయిర్ కట్ చేసుకోవాలి. ఆభరణాలు, మేకప్, హెయిర్ స్టైయిల్స్ ప్రత్యేక సందర్భాలలో ధరించాలి.

ఇక కాలేజీ అమ్మాయిలు కూడా కాలేజీ డ్రెస్ కోడ్ ని అనుసరించి డ్రెస్ అవ్వాలి. డిగ్నిఫైడ్‌గా ఉండే దుస్తులని మాత్రమే ఎంచుకోవాలి. ఫిల్మ్‌స్టార్లు వేసుకునే దుస్తులు నిజజీవితంలో ధరించటం వీలుకాదు. పార్టీలు లాంటి స్పెషల్ అకేషన్స్‌కి మాత్రమే ఈ తరహా డ్రెస్సింగ్‌ని పరిమితం చేయాలి.

ఇక పండుగలు, శుభకార్యాల వంటి సందర్భాలలో కూడా ఫ్యాషన్లో ఉన్నాయి కదా అని ఏది పడితే అది కొనేయకుండా మన బాడీస్టైల్ కి నప్పే విధంగా, లైఫ్‌స్టైయిల్ అవి సరిపడతాయో లేదో గమనించి తీసుకోవాల్పి ఉంటుంది. కాబట్టి మార్కెట్లోకి వచ్చే వందలకొద్ది వెరైటీలలో దుస్తులు... సినీతారలని మరిపించే హెయిర్ అండ్ మేకప్ స్టైల్స్... వీటికి మరిన్ని మెరుగులను అద్దే యాక్సెసరీస్...ఇలా ఎన్నో రకాలుగా ఈ తరం వారికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎంపిక విధానం, వినియోగించే విధానంలో జాగ్రత్తలు పాటిస్తే ఆ ష్యాషన్ ఐకాన్ మీరే కావచ్చు....

English summary

Dressing Ideas for Women...| ఆ ష్యాషన్ ఐకాన్ మీరే కావచ్చు....

Every woman nurtures a common desire to look beautiful and they go through all the ways to cater their wish. But some of them get quite depressed as they are completely unable to find out the important factors that could claim to make her good looking and charming. Being a good looking is not a tough task as it sought and anyone who has such a great desire of becoming a good looking and sexy, certainly can make them so just by changing her dressing sense.
Story first published:Thursday, April 12, 2012, 14:06 [IST]
Desktop Bottom Promotion