For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీరాకృతికి నప్పేవిధంగా డ్రెస్ డిజైన్ చేసుకోవడం ఎలా...?

|

How to Choose Your Type of Salwar Kameez
సాధారణంగా మహిళలు, కాలేజి స్టూడెంట్స్, వర్కింగ్ ఉమెన్స్ మార్కెట్లో కంటికి ఇంపుగా కనిపించిన డ్రెస్ మెటీరియల్‌ని తెచ్చుకోవడం, సల్వార్ కమీజ్‌ని కుట్టించుకోవడం మామూలే! తర్వాత ఆ డ్రెస్‌ని ధరించాక ముందుగా ఊహించుకున్నంత అందంగా కనిపించరు. ఎక్కడ ఉందో లోపం అర్థం కాదు. టైలర్ సరిగా కుట్టలేదని నిరుత్సాహపడతాం. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా పైజామాని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలుసుకుందాం.

చుడీ, పటియాలా, లూజ్ సల్వార్, బూట్ కట్ ప్యాంట్.. అని బాటమ్స్‌లో నాలుగు రకాలు ఉంటాయి. వీటిని డిజైన్ చేయించుకునేటప్పుడు ముందుగా శరీరాకృతి ఎలా ఉందో తెలుసుకోవాలి. మీ లెగ్ షేప్‌ని బట్టి పైజమా కుట్టించుకుంటే ధరించిన డ్రెస్‌లో మీరు అందంగా కనిపిస్తారు. కొందరికి కాళ్లు సన్నగా ఉంటాయి. మరి కొందరికి అప్పర్‌బాడీ హెవీగా ఉండి, లోయర్ బాడీ సన్నగా ఉంటుంది. మరికొందరికి అప్పర్‌బాడీ సన్నగా ఉండి, లోయర్‌బాడీ హెవీగా ఉంటుంది. కొందరికి మోకాళ్ల కింద నుంచి సన్నగా ఉంటుంది. కొందరు మంచి హైట్‌తో ఉన్నా అప్పర్‌బాడీ లెన్త్ ఎక్కువగా ఉండి, లోయర్ బాడీ లెన్త్ తక్కువగా ఉంటుంది. ఇలా బాడీ షేప్స్ రకరకాలుగా ఉంటాయి. వీటిలో ముందుగా మీ శరీరాకృతి ఏ తరహాకు చెందిందో చెక్ చేసుకోవాలి.

ఛాతీ భాగం నుంచి తొడల వరకు లావుగా ఉండి, కాళ్లు సన్నగా ఉండేవారు.. బూట్‌కట్ పైజామా వేసుకొని, మోకాలికి కొంచెం పైకి ఉన్న టాప్ వేసుకోవాలి. బాగా సన్నగా, కాళ్లు పొడుగ్గా ఉండేవాళ్లు పటియాలాలు వేసుకుని, నీ లెన్త్ టాప్ వేసుకోవాలి. లెగ్ షేప్ చక్కగా ఉన్నవారికి చుడీలు, లెగ్గింగ్స్ బాగా నప్పుతాయి. లావుగా ఉన్న వారు లెగ్గింగ్స్ ధరిస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తారు. అందుకే లెగ్గింగ్‌కు బదులుగా థిక్ క్లాత్‌తో చుడీ ధరిస్తే అందంగా కనిపిస్తారు. కొద్దిగా లావు, ఎత్తుగా ఉన్నవారికి వదులుగా ఉండే సల్వార్స్ సూటవుతాయి. సల్వార్‌కి, పటియాలాకు ఎప్పుడైనా నీ లెన్త్ టాప్స్ మాత్రమే వేసుకోవాలి. విశాలమైన పిరుదుల భాగం, పొట్టిగా ఉన్నవారు బూట్ కట్ బాటమ్, నీ లెన్త్ టాప్ వేసుకుంటే కాస్త ఎత్తుగా కనపడే అవకాశం ఉంది.

అనార్కలీకి తప్పనిసరిగా చుడీలే వేసుకోవాలి. లావుగా ఉన్నవారు లెగ్గింగ్స్ ధరించాలనుకుంటే పైన తప్పనిసరిగా అనార్కలీ టాప్ వేసుకోండి. పొట్టిగా ఉన్నవాళ్లు సల్వార్స్, పటి యాలాలు వేసుకోకపోవడమే మంచిది. చుడీల మీదకు స్ట్రెయిట్ కట్, పర్‌ఫెక్ట్ ఫిటింగ్ ఉన్న సల్వార్‌నే వేసుకోవాలి. లూజ్‌గా టాప్ వేసుకుంటే బాటమ్ టైట్‌గా వేసుకోవాలి. పటియాలా లేదా సల్వార్ వేసుకుంటే హీల్స్ వాడితే అందంగా కనిపిస్తారు.

సాధారణ ఎత్తు ఉన్నవారు పటియాలా వేసుకోవాలనిపిస్తే షిఫాన్ లేదా జార్జెట్ క్లాత్‌తో పటియాలా కుట్టించుకుని, నీ లెన్త్ వరకు లైనింగ్ వేయించుకొని, కిందివైపు వదిలేయాలి.పటియాలాను సాఫ్ట్ కాటన్స్, మంచి ఫాల్ ఉన్న క్లాత్‌తో కుట్టించుకోవాలి. బూట్‌కట్‌కి మీడియం టెక్చర్ ఫ్యాబ్రిక్‌నే ఎంచుకోవాలి.బాగా హైట్ ఉన్నవారు అరబిక్ స్టైల్‌లో కూడా సల్వార్స్ డిజైన్స్ చేసుకోవచ్చు. దీని వల్ల హైట్ తక్కువగా కనిపిస్తారు. లావుగా ఉన్నవారు డార్క్ కలర్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే ముదురు రంగు దుస్తులు ధరిస్తే లావు తక్కువగా కనిపిస్తారు. ఎత్తుకు తగ్గ లావు, సన్నగా ఉన్నవారు లేతరంగు ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి.

English summary

How to Choose Your Type of Salwar Kameez...| చుడీదార్..సల్వార్ కుట్టిస్తున్నారా...?

While buying a salwar suit several factors should be kept in mind so that you do not end up buying something which looks absolutely disastrous on you. The most important things to figure out is what style and trend you want to portray. With the growing popularity of western wear the Salwar Kameez too has adapted to changing tastes. The latest designs have a western touch to them while at the same time keeping the basic layout traditional. The resulting dresses have shorter kurtas and more streamlined salwars or pajamis.
Story first published:Saturday, April 14, 2012, 14:48 [IST]
Desktop Bottom Promotion