Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కళ్ల అందాన్ని మరింత రెంటింపు చేసే ఐలైనర్..!

1. ఐలైనర్ అప్లై చేయాలనుకొనేవారు అందుకు వారి చర్మ ఛాయకు తగ్గ కలర్ ను, కను రెప్పలకున్న హెయిర్ కలర్ ను ఎంపిక చేసుకోవాలి. సున్నితంగా ఉన్న పెన్సిల్ లైనర్ కు మాచ్ అయ్యే ఐలాష్ ను నేచురల్ లుక్ ను అందిస్తుంది. ముఖ్యంగా డార్క్ కలర్ బ్లాక్ ఐలైనర్ చాలా అందంగా కనబడుతుంది. షేడ్ కూ ఐలాష్ కు తగ్గ షేడ్, బేస్ వేసుకోవడం వల్ల అందంగా కనబడుతుంది. పేల్ స్కిన్ ఉన్నవారు చర్మ పేల్ గా ఉన్నవారు బ్రౌన్ కలర్ లేదా చార్కోల్ గ్రే కలర్ బాగా నప్పుతాయి.
2. వేసుకునే దుస్తుల రంగుని బట్టి కనురెప్పల మీదా అదే వర్ణంలోని పౌడర్‌ను తక్కువగా అద్దాలి. దానితో కళ్లు అందంగా కనిపిస్తాయి. ముందురోజు రాత్రి ఆలివ్ నూనెను కళ్లకు రాయండి. కళ్లకు మేకప్ వేసుకునే సమయంలో ఐలైనర్ తప్పనిసరి.
3. కళ్ల కింద నల్లని వలయాలుంటే ఐలైనర్ వాడకపోవడం మంచిది. బ్రష్‌ను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. అజాగ్రత్త చేస్తే చర్మానికి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.
4. ఐలైనర్ మరీ కళ్లకు దగ్గరగా వేయకూడదు. ఎందుకంటే రసాయనాల ప్రభావం వల్ల కళ్లకు హాని కలుగుతుంది. కళ్లు మంటపుట్టి, నీళ్లు కారతాయి. అంతేకాదు.. కన్నీటి నాళాలు మూసుకుపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు రసాయన రహిత సహజ ఉత్పత్తుల్ని ఎంచుకోవాలి.
5. కాటుక లేదా ఐపెన్సిల్ వంటి ప్రత్యామ్నాయాలనూ ఎంచుకోవచ్చు. ఒకవేళ ఐలైనరే వాడుతుంటే.. ప్రతి మూణ్నెల్లకోసారి మార్చడం మంచిది. అలాగే మస్కారా వాడిన ప్రతిసారీ అందులో బ్యాక్టీరియా చేరుతుంది. ఫలితంగా కళ్లకు ఇన్‌ఫెక్షన్ల సమస్య.
6. ఇలాంటి సమస్యల్ని నివారించాలంటే.. వాటిని భద్రపరచడంలో జాగ్రత్త పాటించాలి. మస్కారా, ఐలైనర్ లాంటి ఉత్పత్తుల్ని చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచాలి. ఏ కారణంగానైనా అవి ఎండిపోతే వాటిల్లో నీళ్లు పోసి వాడుకునే ఆలోచనను మానేయాలి.



Click it and Unblock the Notifications