Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చామన ఛాయ కలిగిన వారికి మేకప్ లో మెళుకువులు....

చర్మం కోమలంగా, మెరిసేలా ఉండటం కోసం నెలలో ఒక సారి ఫేషియల్, 15రోజుల కొకసారి బ్లిdచింగ్ చేయించాలి. కాళ్ళు, చేతులకి వారానికి ఒకసారి మేనిక్యూర్, పెడిక్యుర్ చేయించాలి. అవాంఛిత ప్రదేశాలలో వెంట్రుకలను తొలగించుకునేందుకు వాక్సింగ్ లేదా హెయిర్ రిమూవర్ క్రీమ్ ఉపయోగించాలి. వారంలో రెండుసార్లు ఫేస్ స్క్రభ్ ఉపయోగించాలి. ఇలా చేస్తే చామనఛాయ చర్మం కూడా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. దీనితో ఆకర్షణీయమైన శరీరం మీ సొంతమవుతుంది.
అందాల పోటీలకే కాదు, ఉద్యోగాలకైనా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఆకట్టుకునే కనుముక్కు తీరు వుండటం ముఖ్యం. అంతే కానీ శరీరఛాయ నలుపు లేదా ఎరుపు రంగులో వున్నదా అన్నది ముఖ్యం కాదు. దీనితో బాటు పొజిటివ్ బాడీ లాంగ్వేజ్ కూడా అవసరం. అసభ్యత, ఓవర్ బోల్డ్‌నెస్ కెరీర్ ను ముందుకు నడిపించలేవు. ఆఫీసులో పనిచేయడానికి అందమైన ముఖంతో బాటు పనిలో నిర్దారిత లక్ష్యాలను సాధించే నేర్పు కూడ ఎంతో అవసరం.
దుస్తుల్ని సెలక్ట్ చేసుకునేటప్పుడు వాటి రంగు, డిజైన్ మీకు సూట్ అవుతుందా లేదా అని గమనించండి. చామనఛాయ రంగు ఉన్న అమ్మాయిలు ఆకర్షణీయంగా కనబడే రంగుల దుస్తుల్ని వేసుకోవాలి. బ్రైట్ కలర్స్, నీలి, రస్ట్, గూలాబీ, బెజ్, ఆరెంజ్ రంగులన్నీ చామనఛాయ రంగున్న వారికి సందర్భోచితంగా సరిపోతాయి.
గులాబి రంగు మేని ఛాయ గల వారు వాడవలసిన రంగుల గురించి వివరంగా వర్ణించనవసరం లేదు. వారికి ముదురు రంగులతోపాటుగా, లేత రంగులు కూడా నప్పుతాయి. ఎరుపైనా నలుపైనా తమలో వున్న పాజిటివ్ అంశాల వైపు దృష్టి సారిస్తే అందాల మహరాణులు వారే అవుతారు.



Click it and Unblock the Notifications
