Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషపుంగవులను కైపెక్కించే పెదాలు...

పెదవుల అలంకరణ ఒక భాగమైతే.. అందంగా నవ్వడంతో ముఖ అందానికి రెండవ భాగం. అటువంటి పెదాలు.. మత్తెక్కించే, మరులు గొలిపించే, మైమరిపించే, ఆ పెదవులు మహిళవైతే...హరివిల్లువంటి పెదవి వంపులోంచి చిరుమందహాసాన్ని ఓరగా అలా ఒలికిస్తే... ఆ మందహాసానికి...దరహాసానికి పాదాక్రాంతులు కాని పురుషపుంగవులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా... అలాంటి చిరునవ్వులు చిందించే పెదవులకు నిగారింపు లేకుంటే ఎలా ఉంటుంది...? అందవిహీనంగా కనబడుతుంది?
1. పెదవులకు లిప్ స్టిక్ రాసే ముందు మెత్తటి పూతమందును మృదువుగా అద్దాలి. దీనివల్ల మీ పెదవులు తడిగా ఉండటమే కాక సున్నితంగా మారుతాయి.
2. ముందుగా పెదవి చుట్టూ సన్నటి పెన్సిల్‌తో గీత గీయాలి. తర్వాత ఇష్టమైన రంగు పెన్సిల్‌తో నోటి బాగం మొత్తంలో లిప్ స్టిక్ రాయాలి.
3. పెదవుల పరిమాణాన్ని పెద్దగా చేయాలంటే మ్యాచింగ్ గ్లాస్ లేదా ముదురు రంగు లిప్ స్టిక్‌ను ఉపయోగించాలి. రంగు సమాంతరంగా అంటేందుకోసం గ్లాస్ లేదా లిప్ స్టిక్ ను లిప్ బ్రష్ తో మెత్తగా అద్దాలి. అద్దిన రంగు కారకుండా ఉండాలంటే మెత్తడి పౌడర్‌ను మీ పెదవి అంచుల చుట్టూ అద్దాలి.
4. పెదాలకు రంగు ఇచ్చే సాధనం పేరే లిప్ గ్లాస్. ఇది పెదాలను కళకళలాడించడమే గాక మృదువుగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది. లిప్ స్టిక్ పై దీనిని వాడొచ్చు. లేకుంటే లేతగా కన్పించేందుకు దీనిని మాత్రమే వాడవచ్చు.
5. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కలిగిన లిప్ గ్లాస్‌లు కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. లిప్‌స్టిక్ పై దీనిని వాడే సమయంలో గట్టిగా రుద్దకూడదు. లేదంటే లిప్‌స్టిక్ అలాగే కారిపోతుంది.
6. పెదవులపై చర్మం ఆరిపోయి పొరలుగా పైకి లేవడం, పగలటం జరుగుతాయి. కాబట్టి లిప్‌స్టిక్ మెరవడం కోసం లిప్‌గ్లాసుకు బదులు పెట్రోలియం జెల్లి రాయటం మంచిది.
7. రాత్రుళ్లు పడుకునే ముందు పెదాలపై పేరుకుని ఉన్న నెయ్యి రాయడం వల్ల ఉదయానికి పెదాలు మృదువుగా, మెరుస్తూ కనపడతాయి.
8. కలబంద రసాన్ని పూయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కీరా ముక్కను పెదాలపై రాయడం వల్ల పెదాలు మృదువుగా ఉంటాయి.



Click it and Unblock the Notifications