For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకర్షణీయమైన ఐబ్రోస్ కి ఎఫెక్టివ్ హోం రెమిడీస్

By Nutheti
|

కళ్లు ఏ ఆకారంలో ఉన్నాసరే వాటిని అద్భుతంగా చూపించగలిగేవి కనుబొమ్మలే. అవి అందంగా, ఆకర్షణీయంగా ఉంటేనే.. ఎదుటివాళ్లనే ఇట్టే ఆకట్టుకోవచ్చు. మన అందాన్ని మరింత పెంచుతాయి కనుబొమ్మలు. కనుబొమ్మలు చక్కటి ఆకృతిలో, ఒత్తుగా కనిపిస్తే.. ఆ అందమే వేరు.

మీ పర్సనాలిటీ గురించి మీ ఐబ్రోస్ ఏం చెబుతున్నాయి ? మీ పర్సనాలిటీ గురించి మీ ఐబ్రోస్ ఏం చెబుతున్నాయి ?

శరీరంలో అందంగా కనిపించేది ముందుగా ముఖం. ముఖాకృతికి కళ్లు, ముక్కు ఒక ఎత్తైతే.. హావ భావాలు పలికించే కనుబొమ్మలు మరో ఎత్తు. అవి రెప్ప వేసినా... మూసినా.. రెప రెపలాడినా... నవరసాలు పండిస్తాయి. ఎలాంటి శబ్ధం లేకుండా.. మనసులోని భావాలను తెలుపుతాయి ఐబ్రోస్. కనుబొమ్మలు కొందరికి ఒత్తుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ మరికొందరికి పలుచగా ఉంటాయి. ఐబ్రోస్ తక్కువగా ఉన్నాయని ఢీలా పడుతున్నారా ? ఒత్తుగా ఉంటే బాగుండేదని ఫీలవుతున్నారా ? అయితే ఈ సింపుల్ అండ్ నేచురల్ టిప్స్ ఫాలో అవండి.. ఎట్రాక్టివ్ ఐబ్రోస్ సొంతం చేసుకోండి.

ఆముదం

ఆముదం

కనుబొమ్మలు అందంగా పెరగడానికి పూర్వం నుంచి ఉపయోగిస్తున్న మార్గాలలో ఆముదము ఒకటి. ఐబ్రోస్ కి ఆముదాన్ని రోజూ రాసుకుంటే అవి దట్టంగా పెరుగుతాయి. రోజు పడుకునే ముందు క్యాస్ట్రో ఆయిల్‌ రాసుకుంటే.. వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

కొబ్బరి నూనెను జుట్టు పెరగడానికే కాదు.. కనుబొమ్మలు పెరగడానికి ఉపయోగపడతాయి. రాత్రి పడుకోవడానికి ముందు కాస్త కొబ్బరినూనె తీసుకుని కనుబొమ్మలపై మసాజ్ చేస్తే.. వేగంగా కనుబొమ్మలు మంచి ఆకృతిలో ఉండేలా చేస్తుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలలో సల్ఫర్‌ అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల అది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఉల్లిపాయ రసం రాయటం ద్వారా మీ కనుబొమ్మల జుట్టు వేగంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరినూనె, నిమ్మ

కొబ్బరినూనె, నిమ్మ

కొబ్బరి నూనె, నిమ్మ తొక్క కనుబొమ్మలు పెరిగేలా చేస్తాయి. రెండు చెంచాల కొబ్బరినూనెలో నిమ్మ తొక్కను వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఐబ్రో పలుచగా ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని రాస్తే ఐబ్రోస్ పెరుగుతాయి.

అలోవెరా

అలోవెరా

పలుచటి ఐబ్రోస్ ఉన్నవాళ్లు అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ జెల్ రాసుకుని సున్నితంగా మర్దనా చేయాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే రిజల్ట్స్ మీకే తెలుస్తాయి.

మెంతులు

మెంతులు

మెంతుల్లో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇవి హెయిర్‌ గ్రోత్‌ కు బాగా ఉపయోగపడుతాయి. కాబట్టి మెంతి పేస్ట్‌ ను రాత్రిపూట ఐబ్రోస్ మీద రాసి ఉదయం శుభ్రం చేసుకోవడం వల్ల హెయిర్‌ గ్రోత్‌ పెరిగి కనుబొమ్మలు అందంగా మారుతాయి.

పాలు

పాలు

పాలు లేదా పాల ఉత్పత్తులలో ప్రోటీనులు మరియు విటమిన్స్‌ ఎక్కువగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు పాలలో కాటన్‌ బాల్స్‌ ముంచి కళ్ల చుట్టూ మసాజ్‌ చేసి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల హెయిర్‌ ఫాస్ట్‌గా పెరుగుతుంది.

వేజిలైన్

వేజిలైన్

వేజిలైన్ ను ఐబ్రోస్ కి రాసుకోవడం వల్ల కనుబొమ్మలకు కావాల్సిన నీటి శాతాన్ని అందిస్తాయి. ఇది బలమైన వెంట్రుకలు పెరగడానికి సహాయపడుతుంది. ఒత్తుగా, ఆకర్షణీయంగా కనిపించే కనుబొమ్మలు పొందడానికి ప్రతి రోజు 2 లేదా 3 సార్లు వేజిలైన్‌ రాసుకోవాలి.

ఆలివ్‌ నూనె

ఆలివ్‌ నూనె

ఆలివ్‌ నూనె కూడా కనుబొమ్మలకు మంచిది. కనుబొమ్మలకు ఆలివ్‌ ఆయిల్ రాయటం వల్ల ఐబ్రోస్ ఆకర్షణీయంగా పెరుగుతాయి.

నిమ్మచెక్క

నిమ్మచెక్క

నిమ్మచెక్క కనుబొమ్మల ఆకారానికి అద్భుతంగా పనిచేస్తుంది. అప్పుడప్పు నిమ్మచెక్కతో కనుబొమ్మలను రుద్దుతూ ఉండాలి. దీనివల్ల ఐబ్రోస్ ఒత్తుగా పెరుగుతాయి.

ఎగ్

ఎగ్

గుడ్డులోని పచ్చసొన తీసుకుని కనుబొమ్మలకు రాయాలి. 15 లేదా 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుండటం వల్ల గుడ్డులోని పోషకాల వల్ల కనుబొమ్మలు ఎట్రాక్టివ్ గా మారతాయి.

English summary

11 Natural Ways To Make Your Eyebrows Grow

Eyebrows are one of the important features that accentuates the appearance. But, we tend to ignore it compared to the other facial features. If taken proper care of, it can change the look of a person drastically.
Story first published: Friday, December 4, 2015, 16:48 [IST]
Desktop Bottom Promotion