For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ స్కిన్ టోన్ బట్టి ఎంపిక చేసుకోవాల్సిన ఫర్ఫెక్ట్ లిప్ స్టిక్..!?

లిప్ స్టిక్ వేసుకోవాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతారు. ఎందుకంటే, వారికి లిప్ స్టిక్ సూట్ అవుతుందో లేదో, ఎలాంటి లిప్ స్టిక్ ను ఎంపిక చేసుకోవాలి. అనే అపోహచాలా మందిలో ఉంటుంది. బ్యూటి నిపుణుల ప్రకారం ఎంప

By Lekhaka
|

లిప్ స్టిక్ వేసుకోవాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతారు. ఎందుకంటే, వారికి లిప్ స్టిక్ సూట్ అవుతుందో లేదో, ఎలాంటి లిప్ స్టిక్ ను ఎంపిక చేసుకోవాలి. అనే అపోహచాలా మందిలో ఉంటుంది. బ్యూటి నిపుణుల ప్రకారం ఎంపిక చేసుకునే లిప్ స్టిక్ స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా నప్పేదై ఉండాలి. అప్పుడే అందంగా కనబడుతుంది.

స్కిన్ టోన్ బట్టి వివిధ రకాల లిప్ స్టిక్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, మీకు స్కిన్ టోన్ కు నప్పే షేడ్స్ ను ఫర్ఫెక్ట్ గా ఎంపిక చేసుకోవాలి. మీ స్కిన్ టోన్ పట్టి, ఎలాంటి లిప్ స్టిక్ ను ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం

1. డార్క్ స్కిన్ టోన్ ఉన్న వారు

1. డార్క్ స్కిన్ టోన్ ఉన్న వారు

డార్క్ స్కిన్ ఉన్న వారు వారి స్కిన్ టోన్ కు తగ్గట్లు బ్రైట్ కలర్స్ అద్భుతంగా నప్పుతాయి. రిచ్ గా కనబడుతారు. డార్క్ కలర్స్ వీరికి బాగా నప్పుతాయి. వీరి స్కిన్ టోన్ కు, స్కిన్ కంప్లెక్షన్ కు గ్రేట్ గా సూట్ అవుతుంది. డార్క్ రెడ్, బర్గుండి, విత్ స్కిన్ కంప్లెక్షన్స్ కు నప్పడమే కాదు, రిచ్ కూడా కనబడుతారు.

1. డార్క్ స్కిన్ టోన్ ఉన్నవారు అవాయిడ్ చేయాల్సిన కలర్స్

1. డార్క్ స్కిన్ టోన్ ఉన్నవారు అవాయిడ్ చేయాల్సిన కలర్స్

డార్క్ స్కిన్ ఉన్నవారు, ఖచ్చితంగా పాస్టల్ షేడ్స్ లేదా లైట్ షేడ్ లిప్స్ స్టిక్స్ కు దూరంగా ఉండాలి. ఇవి మీ స్కిన్ ను మరింత డార్క్ గా కనబడేలా చేస్తాయి. పాస్టల్ కలర్స్ వేసుకోవడం వల్ల మీకున్న నేచురల్ స్కిన్ కలర్ కూడా షేడ్ అవుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి. అలాగే ఈ మద్య కాలంలో మెటాలిక్ షేడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి జోలికి అస్సలు పోకూడదు. పాస్టల్ షేడ్స్ లిప్ స్టిక్స్ ఖచ్చితంగా నివారించడాలి.

2. వైట్ స్కిన్ టోన్

2. వైట్ స్కిన్ టోన్

వైట్ గా ఉన్న వారు చాలా తక్కువగా ఉంటారు. ముఖ్యంగా వైట్ స్కిన్ కు అనేక రకాల లిప్ స్టిక్స్ నప్పుతాయి. వైట్ స్కిన్ టోన్ ఉన్న వారు ఏ రంగును ఎంపిక చేసుకున్నా రాణిలాగా కనబడుతారు. వైట్ స్కిన్ టోన్ ఉన్నవారు బ్రైట్ ఆరెంజ్ , రెడ్, బ్రౌన్ , పింక్, ఇంకా మీకు ఏది నప్పుతుందో ..నచ్చుతుందో ఎంపిక చేసుకోవచ్చు. అదనంగా గోల్డెన్ మెటాలిక్ షేడ్స్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు .

2. వైట్ స్కిన్ టోన్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి:

2. వైట్ స్కిన్ టోన్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి:

ముందుగా మనం మాట్లాడుకున్నట్లు వైట్ స్కిన్ టోన్ ఉన్నవారు డార్క్ బ్లూ, డార్క్ రెడ్ లేదా పర్పుల్ వంటి ఫ్లంటింగ్ కలర్స్ కు దూరంగా ఉండాలి. ఈ కలర్స్ నేచురల్ గా వైట్ స్కిన్ టోన్ లోకి కల్సిపోవడం వల్ల ఎలాంటి వ్యత్యాసం ఉండదు. అలాగే షిమ్మర్ లేదా ఎక్కువ గ్లాసీ లిప్ స్టిక్స్ ను ఎంపిక చేసుకోకపోవడమే మంచిది.

3. ఫెయిర్ స్కిన్ టోన్

3. ఫెయిర్ స్కిన్ టోన్

స్కిన్ టోన్స్ లో బెస్ట్ స్కిన్ టోన్ ఫెయిర్ స్కిన్ టోన్. ఫెయిర్ స్కిన్ టోన్ ఒక వరం అనే అనుకోవచ్చు. వైటిష్ కాంప్లెక్షన్, ఫెయిర్ స్కిన్ టోన్ కు కూడా ఏ కలర్ అయినా నప్పుతుంది. ముఖ్యంగా లైట్ పర్పుల్, మీడియం రెడ్ మరియు పింక్ షేడ్స్ సూట్ అవుతాయి. డిఫరెంట్ కలర్ బ్లూ కరల్ కూడా ఫెయిర్ స్కిన్ టోన్ కు బాగా నప్పుతుంది.

3. వీరు ఎలాంటి కలర్స్ ను అవాయిడ్ చేయాలి

3. వీరు ఎలాంటి కలర్స్ ను అవాయిడ్ చేయాలి

ఫెయిర్ గా ఉండే మహిళలు రెడ్ తప్పా చాలా డార్క్ గా ఉన్న బ్లాక్, గ్రీన్ , బ్లూ ఆరెంజ్ కలర్స్ ను నివారించాలి.

4. పేల్ స్కిన్ టోన్

4. పేల్ స్కిన్ టోన్

పేల్ స్కిన్ టోన్ ఉన్నవారు మరింత ఎఫొర్ట్ అవసరం అవుతుంది. ఈ లిప్ కలర్ వీరికి మంచి ఆప్షన్ . పాస్టల్ మరియు లైట్ షేడ్ లిప్ స్టిక్స్ ను ఎంపిక చేసుకోవచ్చు.. ఈ పాస్టల్ కలర్స్ వీరికోసమే తయారుచేసినట్లు ఉంటుంది. రెడ్, పర్పుల్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల గ్లామర్ పెరుగుతుంది.

4. ఎలాంటి కలర్స్ కు దూరంగా ఉండాలి:

4. ఎలాంటి కలర్స్ కు దూరంగా ఉండాలి:

పేల్ స్కిన్ ఉన్నవారు బ్రౌన్, రెడ్, మెరూన్ వంటి డార్క్ కలర్స్ ను అవాయిడ్ చేయాలి. డార్క్ కలర్ షేడ్స్ వేసుకోవడం వల్ల ఇంప్రెషన్ పోతుంది. మరింత పేల్ గా కనబడేలా చేస్తుంది. అందువల్ల బ్రోంజ్, మెటాలిక్ , బ్రౌన్ షేడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. మెటాలిక్ లిప్ స్టిక్ పేల్ స్కిన్ టోన్ కు ఖచ్చితంగా సరిపడదు.

English summary

How To Choose A Perfect Lipstick According To Your Skin Tone

Read on to know how to choose the perfect lipstick according to your skin tone.
Story first published:Monday, April 24, 2017, 11:25 [IST]
Desktop Bottom Promotion