సంగీత్ ఫంక్షన్ల కోసం మేటి 10 మెహందీ డిజైన్లు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

హెన్నా అని కూడా పిలవబడే మెహందీను దక్షిణాసియా పెళ్ళిళ్ళలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇదివరకు, గోరింటాకు చాలా ముఖ్యమైన సంప్రదాయంగా చేసేవారు. కానీ ఏళ్ళు గడుస్తున్నకొద్దీ అది ట్రెండ్ గా మారిపోయింది.

కుటుంబసభ్యులు, బంధువులు ఒకచోట కలిసి సమయం గడిపే పెళ్ళి,సంగీత్ ఫంక్షన్లు ప్రతిఒక్కరి జీవితంలో కీలకమైనవి. సంగీత్ ఫంక్షన్లలో అందరు స్త్రీలు ఒకచోట చేరి ఆటపాటలతో ఆనందిస్తారు.

గోరింటాకు ఎర్రగా పండటానికి 10 చిట్కాలు

చాలా కుటుంబాలకి,గోరింటాకు ముఖ్యమైన ఆచారం. పెళ్ళికూతురు చేతులు అందమైన గోరింటాకు డిజైన్లతో అలంకరించటం తప్పనిసరి.సంగీత్ ఫంక్షన్లకే కాక, ఇతర పండగలైన కర్వాచౌత్,తీజ్, ఈద్ వంటి వాటికి కూడా గోరింటాకును పెట్టుకుంటారు.ఈ మెహందీ డిజైన్లు ఎంతో అందంగా ఉంటాయి.ఈ డిజైన్లు పువ్వులు లేదా నెమళ్ళతో అందమైన వంపులు,రింగులు తిరిగి వుంటాయి.మధ్యలో అసలు ఖాళీయే ఉండదు లేదా కొంచమే ఉంటుంది, దానితో డిజైన్ చాలా భారీగా, సంపూర్ణంగా మారుతుంది.మీరు తెలుసుకోవాల్సిన వివిధ గోరింటాకు డిజైన్లను ఇవిగో మీకోసం.

భారతీయ మెహందీ డిజైన్లు

భారతీయ మెహందీ డిజైన్లు

భారతీయ గోరింటాకు డిజైన్లలో అందమైన పూలు,నెమళ్ళు లేదా మనుషుల ఆకారాలతో వరుసగీతలు ఉంటాయి. మధ్యలో ఖాళీ వదలరు. ఇది ఆ డిజైన్ ను సంపూర్ణంగా మారుస్తుంది. ఈ డిజైన్లు చాలా జటిలంగా, క్లాసీగా ఉండి చేతులను చాలా అందంగా మారుస్తాయి.

అరబిక్ మెహందీ డిజైన్లు

అరబిక్ మెహందీ డిజైన్లు

అరబిక్ డిజైన్లు చాలా మందంగా ఉంటాయి. ఈ డిజైన్లు అలంకరించే ఔట్ లైన్లలాగా ఉంటాయి కానీ మధ్యలో నింపేసిన గీతలలాగా ఉండవు.ఇవి భారతీయ డిజైన్లతో పోలిస్తే చాలా సింపుల్ గా ఉంటాయి. ఈ డిజైన్లలో పువ్వులు, తీగలు, ఆకులు ఉంటాయి.సంగీత్ లాంటి ఫంక్షన్లకి ఈ డిజైన్లను ఎక్కువ వాడతారు.

పాకిస్తానీ మెహందీ డిజైన్లు

పాకిస్తానీ మెహందీ డిజైన్లు

పాకిస్తానీ డిజైన్లు భారతీయ మరియు అరబిక్ కలిపిన డిజైన్లలాగా ఉంటాయి. ఇవి పువ్వులు, పైస్లే మరియు రేఖల డిజైన్లు సరైన పాళ్ళలో కలిసి ఉంటాయి. ఎవరైనా స్త్రీలు తమ డిజైన్లు భారతీయ డిజైన్లలాగా భారీగా కాకుండా, అరబిక్ లాగా తేలిగ్గా కాకుండా ఉండాలనుకున్నవారు తప్పక పాకిస్తానీ డిజైన్లను ఎంచుకోండి. ఇవి చేతులను మరింత అందంగా మార్చేస్తాయి.

ఇండో-అరబిక్ మెహందీ డిజైన్లు

ఇండో-అరబిక్ మెహందీ డిజైన్లు

అరబిక్ స్టైల్ మొత్తం అందమైన సంప్రదాయ వరుసగీతలతో సున్నితంగా ఉంటుంది. ఈ గోరింటాకు డిజైన్లు భారతీయ పెళ్ళిళ్లకి చాలా సరిపోతాయి.

మొరాకో గోరింటాకు డిజైన్లు

మొరాకో గోరింటాకు డిజైన్లు

మొరాకన్ డిజైన్లు మధ్యధరా తీరం నుంచి వచ్చినవి. ఇవి రేఖలతో కూడిన పూలగీతలతో నిండి వుంటాయి. వీటిల్లో పెద్ద, చిన్న చతురస్రాలు,త్రిభుజాలు,దీర్ఘచతురస్రాలు ఉంటాయి. వీటిని మరింత కొత్తగా మార్చటానికి పూలతో కొత్త డిజైన్లు ప్రయత్నించవచ్చు.

మొగలాయీ మెహందీ

మొగలాయీ మెహందీ

మొగలాయి మెహందీ చాలా నీటుగా, లోతుగా ఉంటుంది. అవి చాలా అందమైన,ప్రత్యేక స్టైల్ కలిగివుండి, చుక్కలు, మెలికలను చాలా ప్రస్ఫుటంగా కన్పించేట్లా చేస్తాయి.ఇవి చాలా పురాతన మరియు సంప్రదాయ గోరింటాకు డిజైన్ల రకాలకి చెందినవి.

వివాహానికి ముందు మెహంది వేడుక ఎందుకు జరుపుకుంటారు

పెళ్ళికూతురు గోరింటాకు డిజైన్లు

పెళ్ళికూతురు గోరింటాకు డిజైన్లు

పెళ్ళికూతురు మెహందీ డిజైన్లలో వరుసగీతలు,కళారూపాలు, తీగలు, పువ్వులు అన్నీ ఉంటాయి. ఈ డిజైన్లను పైనుంచి కిందవరకూ వేస్తారు. కొన్నిడిజైన్లలో అందమైన మనుషుల రూపాలను పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుకి ప్రతీకగా గీస్తారు. ఈ డిజైన్లు చాలా భారీగా ఉండి చేతులు అలంకరణతో అందంగా కన్పించేట్లా చేస్తాయి.

అడ్డదిడ్డమైన గీతల డిజైన్లు

అడ్డదిడ్డమైన గీతల డిజైన్లు

ఇవి చాలా ప్రత్యేకమైనవి మరియు సింపుల్ వి.చేతులపై త్రిభుజాలను గీస్తారు, అవి కూడా చాలా అందంగా ఉంటాయి. చిన్న అందమైన కళారూపాలను ఈ ఆకారాల లోపల వేసి డిజైన్ ను పూర్తిచేస్తారు.అది ప్రత్యేకమైన డిజైన్ గా మారుతుంది.

పువ్వుల గోరింటాకు డిజైన్లు

పువ్వుల గోరింటాకు డిజైన్లు

పువ్వుల మెహందీ డిజైన్లలో ప్రత్యేక పూలు,తీగల వరుసగీతలతో చేతులు స్టైలిష్ గా , క్లాసీగా కన్పిస్తాయి. ఈ డిజైన్లు సంగీత్ కి, పెళ్ళిళ్ళకి మేటి డిజైన్లలాగా భావిస్తారు.

రాజస్థానీ మెహందీ డిజైన్లు

రాజస్థానీ మెహందీ డిజైన్లు

ఈ రాజస్థానీ మెహందీ డిజైన్లలో అందమైన పువ్వులు, నెమళ్ళు, వంపులు అసలు డిజైన్ మధ్యలో ఖాళీ లేకుండా అన్నీ ఉంటాయి. రాజస్థానీ డిజైన్లు భారతీయ డిజైన్లలాగానే ఉంటాయి. ఈ డిజైన్లు కూడా వేళ్ల నుంచి మోచేతులవరకు నింపేస్తాయి.

మీ అపాయింట్మెంట్లను ఇక్కడ బుక్ చేసుకోండి.

Book Your Mehendi Appoitments Here

English summary

Top 10 Best Mehendi Designs For Sangeet Ceremony

Here are the best mehendi designs for sangeet ceremony . These henna designs are a must try designs for your sangeet ceremony.
Subscribe Newsletter