త్వరగా...అందంగా..మేకప్ వేసుకోవడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ !

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనందరం మన మేకప్ రోజంతా అలానే ఉండాలని ఆశిస్తాం కదా? కానీ కొన్నిసార్లు, పైగా వేడి ఎక్కువగా ఉండే వేసవికాలంలో, రోజంతా మేకప్ అలానే ఉండటం అసాధ్యం. అందుకని రోజంతా నిలిచి ఉండేలా కొన్ని మేకప్ చిట్కాలను మీకు ఈ వ్యాసంలో తెలియచేస్తాం.

కొన్నిసార్లు, తేమ ఉన్నప్పుడు మేకప్ మీ మొహంపై కరిగిపోవచ్చు. అది అస్సలు చూడటానికి బాగోదు. ఏదో గట్టిగా, బరువుగా అన్పిస్తూ అస్సలు మొహంపై భరించడం నచ్చదు కూడా. ఇక్కడ ట్రిక్ సరైన మేకప్ వాడటంలో మరియు దాన్ని ఎలా వాడి సరిచేసుకుంటారో అందులో ఉంది.

మనదేశపు వాతావరణంలో, ఇంత వేగంగా, రోజంతా మేకప్ ఉండేలా వేగంగా సరి చేసుకోవడం అసాధ్యంగా అన్పించవచ్చు కానీ అసాధ్యం కాదు.ఇది నిజానికి చాలా సింపుల్. ఎలానో చదవండి.

1. ఐలైనర్ మరియు కాటుక;

1. ఐలైనర్ మరియు కాటుక;

వాటర్ ఫ్రూఫ్ ఐలైనర్లు మరియు మస్కారా కూడా చెమట, తేమను తప్పించుకోలేవు, కదా? మీరు ద్రవ ఐలైనర్ వాడేముండి ఐషాడో ప్రైమర్ ను వాడి ఐలైనర్ కి బేస్ లాగా చేయండి. కాటుక విషయానికొస్తే, కొంచెం ట్రాన్స్ లూసెంట్ సెట్టింగ్ పౌడర్ ను వేసుకొని తరవాత కాటుక ఉపయోగించండి.

2. ముఖం

2. ముఖం

ఏదైనా జరిగేముందు ముందుగా ఫౌండేషన్ లో పగుళ్ళు వచ్చి కరిగిపోవటం మొదలవుతుంది. మీరు పాటించగలిగే ట్రిక్ ఏంటంటే మేకప్ మొదలుపెట్టేముందు మీ ముఖాన్ని మంచుగడ్డతో రుద్దుకోండి. మరో విషయం మేకప్ ముందు ప్రైమర్ ను వాడండి. అయిపోయాక పైపైన సెట్టింగ్ స్ప్రే లేదా ట్రాన్స్ లూసెంట్ పౌడర్ ను పైపైన చల్లుకుని సరి చేయండి.

3. పెదవులు;

3. పెదవులు;

శుభ్రమైన, స్క్రబ్ చేసిన పెదవులతో మొదలుపెట్టండి. అలా అయితే లిప్ స్టిక్ వేసుకున్నాక పొడి పగుళ్ళు, ముక్కలు ముక్కలుగా పెదవులు కన్పించకుండా ఉంటాయి. లిప్ స్టిక్ వాడే ముందు ఎప్పుడూ పెదవులను లిప్ బాంతో లేదా ప్రైమర్ తో మాయిశ్చరైజ్ చేయండి. మీరు టిష్యూ పేపర్ ట్రిక్ తో కూడా లిప్ స్టిక్ ను రోజంతా ఉండేలా చేసుకోవచ్చు.

4. కన్సీలర్ ;

4. కన్సీలర్ ;

మీరు సరిగా నిద్రపోని రోజుల్లో కన్సీలర్ మీ అక్కరకు వస్తుంది. కన్సీలర్ కొంచెం గాఢంగా ఉండి సులభంగా కరుగుతున్నట్లు కానీ పగుళ్ళు కానీ వస్తున్నట్టు అన్పించదు. అది వేసుకున్న వెంటనే ట్రాన్స్ లూసెంట్ పౌడర్ ను చాలా వత్తుగా దానిమీద వేసుకోండి. అలా దాన్ని కదలకుండా అక్కడే ఉంచవచ్చు.

5. ఐషాడో;

5. ఐషాడో;

మంచి ఐషాడోలన్నీ 7 గంటల వరకూ దాదాపుగా ఉంటాయి. కానీ రోజంతా ఉంచుకోటానికి ఐషాడో ప్రైమర్ ను మొదట వాడి తర్వాత మీ చర్మ రంగుకి దగ్గరలో ఉన్న ఐషాడో షేడ్ ను వాడండి. దీని వల్ల రంగు బాగా కన్పిస్తూ రోజంతా అలానే ఉంటుంది.

English summary

Tricks To Set Your Makeup Fast

Don't we all wish our makeup would last all day? However, sometimes, especially in hot summer months, it is impossible for our makeup to last all day. So, we will tell you about some tricks to set your makeup to make sure that it lasts all day long no matter what.
Subscribe Newsletter