అదరాలు అధరహో అనాలంటే..లిప్‌స్టిక్‌ ఎలా వేసుకోవాలి?

Posted By:
Subscribe to Boldsky

మనకి లిప్ స్టిక్ వేసుకోవడమంటే చాలా ఇష్టం.లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల మన ముఖానికి ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. వేసుకోవడమైతే వేసుకుంటాం కానీ, ఎలా వేసుకోవాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పై అసలు దృష్టి పెట్టం.

అదరాలు అధరహో అనాలంటే..లిప్‌స్టిక్‌ ఎలా వేసుకోవాలి?

లిప్‌స్టిక్‌ వేసుకోవడానికి కూడా కాసింత కళాపోషణా... కూసింత ఓపికా అవసరమే. ఎంచుకునే రంగూ, వేసుకునే విధానం తెలిసినప్పుడే దాన్ని మనం బాగా ఉపయోగించుకోగలుగుతాం. మరి మన అదరాలు అదరహో అనాలంటే..లిప్‌స్టిక్‌ ఎలా వేసుకోవాలి? వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దామా..

డ్రై లిప్స్, డెడ్ స్కిన్ సమస్యలకు 7 న్యాచురల్ రెమెడీస్

స్కిన్ టోన్ బట్టి లిప్ స్టిక్ ఎంపిక

స్కిన్ టోన్ బట్టి లిప్ స్టిక్ ఎంపిక

ముందుగా మన స్కిన్ టోన్ బట్టి మనకు ఎలాంటి లిప్ స్టిక్ సూటవుతోందో చూసుకోవాలి. పేల్ స్కిన్ వాళ్లయితే కొంచెం లైట్ షేడ్, గ్లాసీ లిప్ స్టిక్ ఉపయోగించడం మంచిది. అదే డార్క్ స్కిన్ అయితే నేచురల్ గా ఉండేవి (గోల్డ్, బ్రౌన్, రెడ్) వాడటం మంచిది.

పెదవులపై మృతకణాలు లేకుండా

పెదవులపై మృతకణాలు లేకుండా

పెదవులపై మృతకణాలు లేకుండా చూసుకుంటే.. అవి ఆరోగ్యంగా ఉండటమే కాదు.. వేసుకునే లిప్‌స్టిక్‌ కూడా ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. ఇందుకు బజారులో దొరికే లిప్‌ స్క్రబ్‌ ఎంచుకోవచ్చు. లేదంటే టూత్‌ బ్రష్‌ని పెదవులపై నెమ్మదిగా మర్దనా చేసినా మృతకణాలు తొలగిపోతాయి. పెదవులూ మృదువుగా తయారవుతాయి. అలాగే లిప్‌స్టిక్‌ వేసుకునే ముందు పెదవులు తాజాగా ఉండేలా చూసుకోవాలి.

పెదాలపై ముడుతలను మాయం చేసే హో రెమెడీస్..!

తేనె, పంచదారతో లిప్ స్క్రబ్

తేనె, పంచదారతో లిప్ స్క్రబ్

లిప్ స్టిక్ వేసుకోవడం చాలా తేలికైన పని. కానీ చాలా మంది ఆడవాళ్ల పెదవులు లిప్ స్టిక్ వేసుకున్నప్పటికీ ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి. దీనిని నివారించాలంటే ముందుగా పెదవుల పై ఉన్న డెడ్ స్కిన్ పోగొట్టాలి. వారానికి రెండుసార్లు తేనె, పంచదార కలిపిన మిశ్రమాన్ని పెదవులకి రాసి రబ్ చేస్తే సాఫ్ట్ గా తయారవుతాయి.

పెదవులకు అప్పుడప్పుడూ లిప్‌బామ్‌ రాసుకుంటూ ఉంటే..

పెదవులకు అప్పుడప్పుడూ లిప్‌బామ్‌ రాసుకుంటూ ఉంటే..

పెదవులకు అప్పుడప్పుడూ లిప్‌బామ్‌ రాసుకుంటూ ఉంటే.. అవి మృదువుగా కనిపిస్తాయి. లిప్‌స్టిక్‌ వేసుకునే పది నిమిషాల ముందు లిప్‌బామ్‌ రాసుకోవాలి. దానివల్ల మీరు వేసుకున్న రంగును పెదవులు పీల్చుకోవు.

ముందుగా పెదవులకు లిప్‌స్టిక్‌ రాసుకుని.

ముందుగా పెదవులకు లిప్‌స్టిక్‌ రాసుకుని.

ముందుగా పెదవులకు లిప్‌స్టిక్‌ రాసుకుని.. బ్లాటింగ్‌ పేపర్‌తో అద్దుకోవాలి. ఆ తరవాత మరోసారి రంగు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాస్త సమయం పడుతుంది కానీ ఎక్కువ సేపు ఉంటుంది.

చివరగా పెదాలపై పౌడర్‌తో అద్దుకుంటే చాలు..

చివరగా పెదాలపై పౌడర్‌తో అద్దుకుంటే చాలు..

చివరగా పెదాలపై పౌడర్‌తో అద్దుకుంటే చాలు. అదనంగా లిప్‌గ్లాస్‌ రాయాల్సిన అవసరంలేదు. అయితే ఏదయినా వేడుకలకు వెళ్తుంటే మాత్రం.. కొద్దిగా లిప్‌గ్లాస్‌ అద్దుకుంటే.. పెదవులు మెరుస్తున్నట్లు ఉంటాయి.

పెదాల మీద మొటిమలను, ఇన్ఫెక్షన్ మాయం చేసే చిట్కాలు

లిప్ లైనర్ తో ఇప్పుడు పెదవులను ఫిల్ చేసుకోవాలి

లిప్ లైనర్ తో ఇప్పుడు పెదవులను ఫిల్ చేసుకోవాలి

లిప్ లైనర్ తో ఇప్పుడు పెదవులను ఫిల్ చేసుకోవాలి. లిప్ స్టిక్ ట్యూబ్ నుండి డైరెక్ట్ గా కాకుండా బ్రష్ తో వేసుకోవాలి. పెదవుల పక్కన ఎదైనా కొంచెం రంగు అంటుకుంటే కన్సీలర్ బాగా ఉపయోగపడుతుంది. పెదవుల అంచులకి అంటుకున్న రంగును ఇది సులభంగా పొగొడుతుంది.

English summary

Ways to Apple Lipstick Perfectly

Though there are several other ways, these seven steps to apply lipstick perfectly can give you an even look and you can easily follow these at home as well.
Story first published: Wednesday, August 2, 2017, 16:41 [IST]
Subscribe Newsletter