మీ రొటీన్ బ్యూటీకి ఫేస్ టోనర్ జత చేయాల్సిన అవసరం ఏంటి?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

అందాల మార్కెట్లో ఇప్పుడు బాగా అమ్ముడు పోతున్న చర్మ సంరక్షణ ఉత్పత్తి "ఫేషియల్ టోనర్".గత కొన్ని ఏళ్ళగా దీని క్రేజ్ బాగా పెరిగిపోయింది మరియు చివరికి చర్మ నిపుణులు కూడా ఇది తప్పనిసరిగా వాడాల్సిన చర్మ సంరక్షణ ఉత్పత్తిగా ప్రకటించారు.

ఫేషియల్ టోనర్ సరిగ్గా క్లెన్సింగ్ కి తరువాత మరియు మాయిశ్చరైజింగ్ కి ముందు వాడతారు.ఈ అందానికి సంబంధించిన ఉత్పత్తిని చర్మం తొందరగా పీల్చుకుంటుంది.అందుకే దీన్ని మాయిశ్చరైజర్ కంటే ముందు రాస్తారు.

పురుషుల చర్మ సంరక్షణకు టోనర్ వాడటం ముఖ్యమా

ఫేషియల్ టోనర్ ఎందుకు వాడాలి:

ఫేషియల్ టోనర్ ఎందుకు వాడాలి:

లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్న మూలాన, టోనింగ్ అనేది తప్పనిసరి గా తీసుకోవాల్సిన చర్మ సంరక్షణ.అంతేకాక బ్యూటీ మార్కెట్లో చాలా రకాల ఫేషియల్ టోనర్స్ అందుబాటులో ఉన్నాయి.కొన్ని రక రకాల చర్మాలని బట్టి రూపొందించినవి, కొన్ని ఏమో నిర్దిష్ట చర్మ సమస్యలని లక్ష్యంగా పెట్టుకొని తయారుచేసినవి.

ఇంకా నమ్మడంలేదా? ఫేషియల్ టోనర్ ని మీ రొటీన్లో చేర్చడం వలన వచ్చే ముఖ్య ప్రయోజనాలను ఈ కింద చూడండి.

మీ చర్మ రంథ్రాలు దగ్గరవుతాయి

మీ చర్మ రంథ్రాలు దగ్గరవుతాయి

అన్నిటికంటే ఫేషియల్ టోనర్ మొదట చేసే పని చర్మ రంద్రాల్ని బిగుసుకునేలా చేస్తుంది.పెద్ద రంద్రాలు మీ చర్మ అందాన్ని పాడుచేస్తాయి మరియు చర్మం విరిగిపోయేలా చేస్తాయి.ఫేషియల్ టోనర్ వాడటం వలన ఈ పరిస్థితికి చికిత్స చేయడమే కాకుండా మళ్ళా రాకుండా కూడా చేస్తుంది.

చర్మం యొక్క పీ హెచ్ ని స్థిరపరుస్తుంది

చర్మం యొక్క పీ హెచ్ ని స్థిరపరుస్తుంది

తక్కువ లేక ఎక్కువ పీ హెచ్ చర్మాన్ని వివిధ అంటువ్యాధులకి మరియు మొటిమలు రావటానికి అవకాశం ఇచ్చి బలహీనం చేస్తుంది.సరైన పీ హెచ్ ఉంచుకోడానికి, ఫేషియల్ టోనర్ వాడటం చాలా ముఖ్యమైనది.దీని వాడకం, చర్మం యొక్క పీ హెచ్ ని సరైన స్థాయిలో ఉండేలా చూసుకుంటుంది.

చర్మంలో తేమని ఇమిడింపచేస్తుంది

చర్మంలో తేమని ఇమిడింపచేస్తుంది

ఫేషియల్ టోనర్ చర్మంలో తేమని నింపి హ్యుమెక్టంట్ పాత్ర పోషిస్తుంది.చర్మం తేమ కోల్పోడం వల్ల ఎన్నో ప్రతికూల ప్రభావాలు కలగటమే కాక చర్మ సౌందర్యం కూడా పాడవుతుంది.

ఇది ముందు ముందున వృద్ధాప్యానికి మరియు చర్మం నిస్తేజంగా కనిపించడానికి అకాల సంకేతాలు ఇస్తుంది. ఫేషియల్ టోనర్ ని క్రమంగా వాడితే మీ చర్మం అన్ని వేళలా తేమతో, ఆరోగ్యవంతంగా ఉంటుంది.

చర్మంలో సరైన నీటి శాతం ఉండేలా చేస్తుంది

చర్మంలో సరైన నీటి శాతం ఉండేలా చేస్తుంది

చర్మం లో నీటి శాతం సరిగ్గా ఉంచే సామర్థ్యం ఫేషియల్ టోనర్ ని తప్పనిసరిగా వాడాల్సిన చర్మ సంరక్షణ ఉత్పత్తి గా మార్చింది.కాలుష్యంతో కూడిన గాలికి గురవ్వటం మరియు అధిక మేకప్ వాడటం చర్మం లో నీటి శాతం తగ్గిపోవడానికి కారణాలు.

అది నివారించేందుకు మరియు మీ చర్మం మెత్తగా ఇంకా మృదువుగా ఉండటానికి కేవలం ఈ ఫేషియల్ టోనర్ ని మీ రోజూ బ్యూటీ దినచర్య లో ఉండేలా చూసుకోండి.

అదనపు నూనెని పీల్చుకుంటుంది.

అదనపు నూనెని పీల్చుకుంటుంది.

అదనంగా స్రవించే నూనె,మీ చర్మంలోని పొరల్ని మూసేయడం వలన మొటిమలు వచ్చే అవకాశం ఉంది.

ఇది జరగకుండా ఆపటానికి ఫేషియల్ టోనర్ మీ రోజూ బ్యూటీ రొటీన్లో పొందుపర్చాలి.చర్మాన్ని అదనపు నూనె ఉత్పత్తి నుంచి కాపాడేందుకు టోనర్ ని వాడండి.

ఆయిల్ స్కిన్ నివారించడానికి టాప్ 12 హోం మేడ్ టోనర్స్

దుమ్ము, ధూళిని తొలగిస్తుంది

దుమ్ము, ధూళిని తొలగిస్తుంది

ఇది టోనర్ వాడటం వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం.రోజూ కఠినమైన వాతావరణంలో తిరగటం వలన మన చర్మం మీద దుమ్ము, ధూళి అంటుకుంటుంది కనుక వాటి వలన చర్మ రంథ్రాలు మూసుకుపోకుండా మరియు అంటురోగాలు రాకుండా ఫేషియల్ టోనర్ వాడటం చాలా ముఖ్యం.

అందరూ కోరుకునే ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తిని వాడి మీ చర్మానికి దుమ్ము, ధూళి నుంచి విముక్తి ప్రసాదించండి.

మొటిమలు రాకుండా నిరోధిస్తుంది

మొటిమలు రాకుండా నిరోధిస్తుంది

మొటిమలు మీ చర్మ సౌందర్యనికి ఇబ్బంది కలిగించచ్చు.మరియు మీరు ఎక్కువ ధరున్న మొటిమలు తగ్గించే క్రీములు వాడి లాభం లేకపొతే, మీరు కొంచెం పెద్ద అడుగు వేసి ఈ చర్మ సమస్యని తగ్గటానికి ఫేషియల్ టోనర్ రోజూ వాడాలి.

మీరు మార్కెట్లో ఉన్న జిడ్డు చర్మం కోసం తయారు చేసిన ప్రత్యేకమైన ఫేషియల్ టోనర్ అయినా కొనచ్చు లేకపోతే మీ సొంత టోనర్ ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు.కానీ స్పష్టమైన చర్మం మరియు మొటిమలు లేని చర్మం కోసం ఈ ముఖ్యమైన చర్మ సంరక్షణ ఉత్పత్తిని తప్పకుండా వాడాలి.

English summary

Why You Should Add A Face Toner To Your Beauty Routine

Read to know why you should add a face toner to your beauty routine, as there are several other benefits of including face toners.
Subscribe Newsletter