ఈ 6 టిప్స్ తో ప్రతి ఉదయం ఎటువంటి అలంకరణా లేకుండా అందంగా కనిపించవచ్చు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఈ ఆరు పద్దతులు పాటించడం ద్వారా ప్రతి ఉదయం ఎటువంటి అలంకరణా లేకుండా అందంగా కనిపించండి.

అత్యధికులు ఉదయాన్నే అలంకరణకు ఇష్టపడరు. అది మానసిక ఆలోచనల ప్రభావంగా కాని లేక సమయానుభావం వలన కాని జరగొచ్చు. కొంతమంది అభిప్రాయాల ప్రకారం అనేక పనుల కారణంగా అలంకరణకు సమయాన్ని వెచ్చించ లేకున్నారని, కాని తాము బయటకు వెళ్ళునప్పుడు ప్రశాంతంగా కనపడుటకు అలంకరణ కూడా అవసరమే అని వారి భావన.

6 Natural Tips To Look Beautiful Without Makeup Every Morning

నిజమే మాకు కూడా అలంకరణలో అన్నీ రకాల పద్దతులను పాటించాలని ఉంటుంది, అన్నీ రకాల లిప్స్టిక్, మాస్కరా, ఐషాడో వంటివి వినియోగించాలని కూడా ఉంటుంది. కాని మర్యాదగా హుందాగా కనపడుటకు ఇన్ని విషయాల పై ఆధారపడవలసిన అవసరం లేదు అని చాలా మంది అభిప్రాయం. సహజ సిద్దమైన అందం ఎన్నటికీ , అలంకరణ కన్నా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిజమైన అందాన్ని చూపుతుంది.

మేము ఇక్కడ చూపబోయే చిట్కాలు పగటి వేళల యందు ప్రత్యేకంగా ఉంటాయి , మరియు ఏ సమయంలోనైనా మేకప్ చేయడానికి అనువుగా ఉంటుంది . ఎక్కువ అలంకరణ అవసరం లేకుండా సహజసిద్ద సౌందర్య చిట్కాలు కొన్ని చూద్దాం.

1.టూత్ బ్రష్ వాడకం ద్వారా మీ పెదాలను అందంగా చేయవచ్చు

1.టూత్ బ్రష్ వాడకం ద్వారా మీ పెదాలను అందంగా చేయవచ్చు

ప్రాధమికంగా ఉదయాన్నే బ్రష్ చేసినప్పుడు పనిలో పనిగా మీ పెదాలను కూడా కాసేపు సున్నితంగా టూత్ బ్రష్ తో మర్దన చెయ్యండి. తద్వారా పెదవులపై ఉన్న పొడి చర్మం పోయి అందంగా తయారవుతాయి. ఇది దినచర్యలో భాగంగా చేసుకోవడం మీ పెదాలకు కూడా మంచిది. ఇది మసాజ్ గా కూడా పని చేసి రక్త ప్రసరణ పెంచుట ద్వారా ఆరోగ్యంగా మరియు నిగారింపుని సంతరించుకునేలా చేస్తుంది.

2. స్క్రబ్ ను ఉపయోగించి మృత కణాలను తొలగించండి

2. స్క్రబ్ ను ఉపయోగించి మృత కణాలను తొలగించండి

ఈ పద్దతి, మీ ముఖం తాజాగా ఉండుటకు మరియు సహజసిద్దమైన అందాన్ని తీసుకుని రావడంలో సహాయం చేస్తుంది. ఈ స్క్రబ్ ముఖంపై మృతకణాలు తొలగించుట లో సహాయం చేస్తుంది. సహజ సిద్దమైన స్క్రబ్స్ కాని, సున్నితమైన బ్రష్ వినియోగించుట ద్వారా కాని చేయవచ్చు. ఈ సహజ సిద్దమైన scrubs గురించి మా వెబ్సైట్ లో ఇదివరకే పొందిక చేయడం జరిగినది.

3. మీ చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేయండి

3. మీ చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేయండి

ఇది చాలా ముఖ్యమైన దశ. మీ ముఖం మీద, చాలా శాంతముగా తాపడం ద్వారా, బుగ్గలను సున్నితంగా లాగడం ద్వారా ఒక మసాజుని అందివ్వండి. ఇది రక్త ప్రసరణను పెంచుటలో సహాయం చెయ్యడమే కాకుండా సహజ సిద్దమైన నిగారింపుని తీస్కుని రావడంలో సహాయపడుతుంది. అందువలన మీ చర్మం ప్రకాశవంతంగా మరియు తాజాగా కనిపించేలా చేస్తుంది.

4.మాయిశ్చరైజర్ రాయండి

4.మాయిశ్చరైజర్ రాయండి

మీ చర్మం పొడి బారకుండా మాయిశ్చరైజర్ రాయడం ద్వారా తేమగా ఉంచేలా చేయవచ్చు. మాయిశ్చరైజర్ ని పూసే క్రమంలో రాపిడికి గురి చెయ్యకుండా సుతారంగా అప్లై చేయవలసి ఉంటుంది. మీ పెదాలకి లిప్ బాం కూడా మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఎండ తాపానికి గురైనప్పుడు మాయిశ్చరైజర్ వాడకం ద్వారా చర్మం పొడిబారకుండా చూసుకోవడం వలన అనేక సమస్యలను ఎదుర్కొనవచ్చు.

5. మీ కనుబొమ్మలను పాలిష్ చేయండి

5. మీ కనుబొమ్మలను పాలిష్ చేయండి

మీ అలంకరణ దశల్లో ఈ దశ చాలా ముఖ్యమైంది. వస్త్రధారణ తర్వాత, ఇంటి వెలుపలకి వచ్చే ముందు మీ కనుబొమ్మలను సున్నితమైన బ్రష్ (eye brush) వినియోగించి పైకి ఎత్తండి.

6: మీ కనుబొమ్మలని కర్వ్ చేయండి

6: మీ కనుబొమ్మలని కర్వ్ చేయండి

సహజంగా అందంగా కనిపించే చిట్కాలు కనుక మస్కరాని సూచించడం లేదు. సహజంగా మేకప్ కిట్ లో ఉండే కర్లర్ (eye lash curler) ఈ సందర్భంలో మీకు ఉపయోగపడుతుంది. ఈ కర్లర్ ను వినియోగించి కనుబొమ్మలను సున్నితంగా కర్వ్ చెయ్యవచ్చు. మంచి ఫలితాలకోసం ఒకటికి రెండు సార్లు చేయండి.

English summary

6 Natural Tips To Look Beautiful Without Makeup Every Morning

It's not mandatory to wear makeup in order to look presentable. You can naturally exfoliate your skin and lips to make them look brighter and fresh. An eyelash curler can be used for your eyes, a simple moisturizer can complete your look and you are good to go.