ఫెయిర్ స్కిన్ టోన్ కలిగిన వారు పాటించవలసిన ముఖ్యమైన మేకప్ టిప్స్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మేకప్ ని వేసుకునే ముందు చర్మం రంగును పరిగణలోకి తీసుకుని అందుకు తగిన మేకప్ వేసుకోవాలి. లేదంటే, మెకప్ అనేది మంచి లుక్ ని అందివ్వడంలో విఫలం అవుతుంది. మరీ డార్క్ స్కిన్ కలిగిన వారు అలాగే మరీ ఫెయిర్ స్కిన్ కలిగిన వారు మేకప్ ని అప్లై చేసుకోవడంలో కాస్తంత శ్రద్ధ వహించాలి. మొత్తానికి అందానికి మెరుగులు దిద్దుకోవడమే మేకప్ ప్రత్యేకతని గమనించాలి. అందుకే మేకప్ అనేది సహజసిద్ధమైన అందాన్ని పాడుచేయకుండా జాగ్రత్త పడాలి.

కాబట్టి, మీరు ఫెయిర్ స్కిన్ టోన్ కలిగిన వారైతే, మీరు ఎంచుకునే కాస్మెటిక్స్ పై మరింత శ్రద్ధ కనబరచాలి. అలాగే, వాటిని ఎలా అప్లై చేయాలో కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మేకప్ లో చిన్నపాటి మిస్టేక్స్ కూడా మీ లుక్ ని బాగా దెబ్బతీస్తాయి.

makeup tips for fair skin

కాబట్టి, ఫెయిర్ స్కిన్ కలిగిన వారిలో మేకప్ లో ప్రతి స్టెప్ అనేది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే, మేకప్ వేసుకునే సమయంలో చిన్నపాటి అజాగ్రత్తలు కూడా మీ లుక్ ని పాడుచేస్తాయి.

ఫెయిర్ స్కిన్ కలిగిన మహిళలు మేకప్ తో అద్భుతంగా కనిపించడానికి ఈ రోజు బోల్డ్ స్కై కొన్ని ముఖ్యమైన టిప్స్ ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఈ మేకప్ టిప్స్ అనేవి ఫెయిర్ స్కిన్ కలిగిన మహిళలకు బాగా ఉపయోగపడతాయి. వీటిని పరిశీలించండి......

సన్ స్క్రీన్ అనేది ముఖ్యమైన మేకప్ ప్రోడక్ట్

సన్ స్క్రీన్ అనేది ముఖ్యమైన మేకప్ ప్రోడక్ట్

ఫెయిర్ స్కిన్ అనేది మీకు వరంగా లభించినందువలన దానిని సంరక్షించుకోవడం మీ ముందున్న లక్ష్యం. మీ స్కిన్ కలర్ ని చూసి ఎంతో మంది అసూయ చెందుతూ ఉండటం సహజం. మీ ఫెయిర్ స్కిన్ కి మీరు అందిచగలిగిన మొదటి రక్షణవ్యవస్థ అనేది సన్ స్క్రీన్ తో మొదలవుతుంది. నాణ్యత కలిగిన సన్ స్క్రీన్ లోషన్ ని తీసుకుని మేకప్ ని వేసుకోవడానికి ముందు మీ ముఖంపై సన్నటి కోట్ గా అప్లై చేయండి. ఇది, మీ చర్మానికి ఫస్ట్ లేయర్ ప్రొటెక్షన్ ని అందిస్తుంది. అలాగే, మాయిశ్చరైజింగ్ ఏజెంట్ గా కూడా వ్యవహరిస్తోంది.

పౌడర్ కి గుడ్ బై చెప్పండి

పౌడర్ కి గుడ్ బై చెప్పండి

మేకప్ వేసుకుంటే పాన్ కేక్ లా కనిపించడం ఫెయిర్ స్కిన్ కలిగిన వారు తరచూ ఎదుర్కొనే సమస్య. వేల కొద్దీ ప్రయత్నాల తరువాత మేకప్ అనేది వాల్ పెయింట్ లా మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? మీరు వాడే పౌడర్ వలన మేకప్ అనేది పాన్ కేక్ లా మారుతుంది. అందువలన, మీ మేకప్ కిట్ నుంచి పౌడర్ ని తొలగించండి. మేకప్ కి ముందు గాని మధ్యలో గాని అలాగే చివర గాని పౌడర్ ని అప్లై చేయకండి.

ఫెయిర్ స్కిన్ కి తగిన ఫౌండేషన్ ని వాడండి

ఫెయిర్ స్కిన్ కి తగిన ఫౌండేషన్ ని వాడండి

స్కిన్ కలర్ ఏదైనా సరే ఫౌండేషన్ ని టెస్ట్ చేసి చర్మానికి తగిన ఫౌండేషన్ ని ఎంచుకోవాలి. ఇందుకు, మేకప్ స్టోర్ అటెండంట్స్ మీకు సహకరిస్తారు. ఫెయిర్ స్కిన్ కలిగిన వారు స్ట్రాంగ్ అండర్ టోన్ లేని న్యూట్రల్ షేడ్ కలిగిన ఫౌండేషన్ ని ఎంచుకోవాలి. ఒకవేళ మీ ఫౌండేషన్ లో స్ట్రాంగ్ అండర్ టోన్ ఉంటే అదే హైలైటై ఫెయిర్ స్కిన్ పై కనిపించి మేకప్ ఎఫెక్ట్ ను పాడుచేస్తుంది.

ఐబ్రో షేడ్స్ పై తగిన శ్రద్ధ వహించాలి

ఐబ్రో షేడ్స్ పై తగిన శ్రద్ధ వహించాలి

స్కిన్ కలర్ ను బట్టి ఐ బ్రో షేడ్స్ ను ఎంచుకోకూడదు. కళ్ల రంగును దృష్టిలో ఉంచుకుని ఐ బ్రో షేడ్ ను ఎంచుకోవాలి. ఫెయిర్ స్కిన్ కలిగిన మహిళ కళ్ళు లైట్ కలర్ లో ఉన్నట్టయితే, బ్లూ లేదా గ్రీన్ షేడ్ ఐ షాడో సూట్ అవుతుంది. ఫెయిర్ స్కిన్ కలిగిన మహిళ కళ్ళు డార్క్ కలర్ లో ఉంటే బ్రౌన్, పర్పుల్ మరియు గ్రే కలర్ ఐ షాడో ను ఎంచుకోవాలి. ఫెయిర్ స్కిన్ కలిగిన మహిళలు లేత గోధుమరంగు లేదా క్రీమ్ షేడ్ ఐ షాడోలను ఎంచుకోకూడదు.

సరైన బ్లష్ ను ఎంచుకోవాలి

సరైన బ్లష్ ను ఎంచుకోవాలి

ఇక బ్లష్ విషయానికొస్తే, ఇది పూర్తిగా వ్యక్తిగత ఛాయిస్. సాధారణంగా బ్లషెస్ అనేవి వార్మ్ లేదా కూల్ టోన్స్ లో లభ్యమవుతాయి. వార్మ్ టోన్స్ లో కోరల్ లేదా పీచ్ లనేవి సరైన ఎంపికలు. అలాగే, కూల్ టోన్స్ లో రోజీ పింక్ లేదా లేత ఊదా రంగులు ఫెయిర్ స్కిన్ కలిగిన మహిళలకు సూట్ అవుతాయి. దుస్తులు, సందర్భం, సమయం వంటిని దృష్టిలో పెట్టుకుని బ్లష్ ని ఎంచుకోవచ్చు.

లిప్ స్టిక్ కలర్ ను జాగ్రత్తగా ఎంచుకోండి

లిప్ స్టిక్ కలర్ ను జాగ్రత్తగా ఎంచుకోండి

ప్రతి మహిళ తన పెదవులు అందంగా ఉండాలని కోరుకుంటుంది. ఇలా కోరుకునే వారు లిప్ స్టిక్ తో పెదవులకు మెరుగులు దిద్దుకుంటారు. ఫెయిర్ స్కిన్ కలిగిన వారికి దట్టమైన రెడ్ అలాగే కోరల్ షేడ్స్ తో పాటు ప్లమ్ మరియు చాకొలేట్ కలర్లు సూట్ అవుతాయి. న్యూట్రల్ అలాగే లైట్ బ్రౌన్ కలర్లను ఫెయిర్ స్కిన్ కలిగిన వారు అవాయిడ్ చేయాలి. మెటాలిక్ లిప్ కలర్స్ ని కూడా ఫెయిర్ స్కిన్ కలిగిన వారు ప్రయత్నించవచ్చు. ఆరెంజ్, బ్రౌన్, ఫచ్సియా, న్యూడ్ టోన్స్, ప్యాస్టల్ పింక్ మరియు పర్పిల్ కలర్లను వీరు అవాయిడ్ చేయాలి.

సరైన ఐ లైనర్ ను తీసుకోండి

సరైన ఐ లైనర్ ను తీసుకోండి

ఇక ఐ లైనర్ విషయానికి వస్తే శిరోజాలకు అలాగే ఐ ల్యాష్ కలర్ కు సూట్ అయ్యేవి ఎంచుకోవాలి. డార్క్ ఐ ల్యాషెస్ కలిగి ఉంటే బ్లాక్ ఐ లైనర్ ని ఎంచుకోవచ్చు. ఒక వేళ, లైట్ ల్యాషెస్ ఉంటే గ్రే ఐ లైనర్ ను దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా సరే, ముందు ప్రయత్నించి సూట్ అయితేనే కొనాలి.

English summary

Makeup Tips For Fair Skin | Fair Skin Makeup Tips | Essential Makeup Tips | Makeup For Fair Skin

Makeup is a challenge if you have extreme skin tones like a very fair or dark skin tone. Today, at Boldsky, we list the best makeup tips that are very essential for those with fair skin. Women with fair skin must follow these makeup tips in order to look their best.
Subscribe Newsletter