మేకప్ తో మీ ముడుతలను దాచిపెట్టడం ఎలా?

By Ashwini Pappireddy
Subscribe to Boldsky

వృద్ధాప్యం ఒక సహజ ప్రక్రియ, మరియు మన వయస్సు తో పాటు మన చర్మం కూడా డ్రై గా, రఫ్

గా మరియు సాగే లక్షణాన్ని కలిగివుంటుంది. ఇంకా చర్మం తేమను కలిగి ఉండే సామర్ధ్యాన్ని కూడా కోల్పోతుంది మరియు చర్మం తనను తాను డామేజ్ నుండి కాపాడుకోలేదు.

makeup tips to hide wrinkles

దీనితోపాటు మచ్చలు, ముడతలు ఏర్పడుతాయి. ముడతలు రాకుండా మనం ఆపలేము కానీ మేకప్ సహాయంతో ఈ ముడతలు,మచ్చలను కవర్ చేసుకోవచ్చు.

నిజం చెప్పాలంటే మీ ముఖానికి అప్లై చేసుకొనే మేకప్ సరైనది అయి వుండటం చాలా ముఖ్యం, లేదంటేమీరు అప్లై చేసే మేకప్ మీ ముడతలను మచ్చలను సరిగా కవర్ చేయకపోగా మిమల్ని మరింత అసహ్యంగా కనిపించేలా చేస్తుంది.

ఈ వ్యాసంలో, మీ ముడుతలను మేకప్ సహాయంతో ఎలా కవర్ చేయాలో ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

1. ఎక్సఫోలియేషన్:

1. ఎక్సఫోలియేషన్:

చర్మం మీద వున్న డెడ్ స్కిన్ తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే మృతకణాల మీద మీరు మేకప్ చేసినట్లయితే మీ పొరలుగా మరియు అందవిహీనంగా కనిపిస్తుంది. ఎక్సఫోలియేషన్ చేయడం వలన మీ ఛాయను ప్రకాశవంతం చేస్తుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. కొల్లాజెన్ చర్మం గట్టిగా ఉండేలా చేసి మరియు బొద్దుగా కనిపించేలా చేస్తుంది.

2. మీ స్కిన్ కి మాయిశ్చరైజర్ వాడండి:

2. మీ స్కిన్ కి మాయిశ్చరైజర్ వాడండి:

వయస్సుతో పాటు మీ చర్మం దాని తేమను కోల్పోతుంది మరియు లోపలి నుండి మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం రోజూ పుష్కలంగా నీరు త్రాగటం అలవాటు చేసుకోండి మరియు మీరు మేకప్ చేసుకోవడానికి ముందు ఎప్పుడూ మోయిస్తూరిజ్ ని వాడటం మర్చిపోకండి.

పొడి చర్మం కలిగిన వారికి ముడతలు మరింత ఎక్కవగా కనిపిస్తాయి. కానీ మళ్ళీ, 40 ఏళ్ళకు పైగా ఉన్నట్లయితే, మాయిశ్చరైజర్ ఒక్కటే వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడంలో సహాయపడదు. దానికిముందు మీరు సీరం రాసుకొని తరువాత మోయిస్తూరిజ్ వాడటం మంచిది.

హైఅరూరోనిక్ యాసిడ్ కలిగి ఉన్న సీరంను మీరు ఉపయోగించేలా చూసుకోండి. ఎందుకంటే హైఅరూరోనిక్ ఆమ్లం తేమగా ఉంటుంది, ఇది మీ చర్మాన్ని ఎప్పుడూ తేమని కలిగి ఉండటంలో సహాయపడుతుంది. హైడ్రేటెడ్ మరియు బాగా తేమ గా ఉన్న ముఖం మీద ముడతలు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు మరియు అంతేకాకుండా మీ ముఖం మీద మేకప్ కూడా సరిగా కనిపిస్తుంది.

3. ఒక సిలికాన్ ఆధారిత ప్రైమర్ ని ఉపయోగించండి:

3. ఒక సిలికాన్ ఆధారిత ప్రైమర్ ని ఉపయోగించండి:

ప్రైమర్ మీ చర్మానికి ఒక బేస్ ని కలిపిస్తుంది మరియు సులభంగా మీ మేకప్ను గ్లైడ్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ ముఖంమీద వున్న గీతలని మరియు ముడతల్ని కవర్ చేస్తుంది.

ఈ ప్రైమర్ అప్లై చేయడానికి ఉత్తమ మార్గం మీ చేతివేళ్లు లేదా ఒక చిన్న బ్రష్ ని ఉపయోగించడం. మీ నుదురు, చెంప, గడ్డం, ముక్కు, మరియు సున్నితమైన గీతలు ఉన్న ప్రాంతాల మధ్యలో కొంచం ప్రైమర్ ని తీసుకొని రాయండి. ప్రైమర్ ను కాసేపు రుద్దండి మరియు ఫౌండేషన్ ను ఉపయోగించటానికి ముందే దానిని లోపలికి పోనివ్వండి.

4.మాయిశ్చరైజర్ ఎక్కువగా వున్న ఫౌండేషన్ను ఉపయోగించండి:

4.మాయిశ్చరైజర్ ఎక్కువగా వున్న ఫౌండేషన్ను ఉపయోగించండి:

మోయిస్తుర్ ఎక్కువగా వున్న ఫౌండేషన్ను ని మీ చర్మానికి అప్లై చేయండి. ఎందుకంటే మాంటే ఫార్ములాతో ఉన్న ఫౌండేషన్ మీ చర్మం మిమల్ని పెద్దవారిలాగా కనిపించేలా చేస్తుంది మరియు మీ ముడుతల ఫై ఎక్కువ దృష్టి సారిస్తుంది . ఇంకామీరు సమస్య ప్రాంతాలపై చాలా ఫౌండేషన్ ని అప్లై చేయకుండా చూసుకోండి, ఎందుకంటే అప్లై చేసే ఫాండషన్ మీ గీతలు మరియు ముడతలలో స్థిరపడతాయి, తద్వారా మీ చర్మం మరింత ఘోరంగా కనిపిస్తుంది. ఫౌండేషన్ ని అప్లై చేయడానికి తడిగా ఉన్న స్పాంజిని ఉపయోగించుకోండి, ఇది మీ చర్మంపై ఫౌండేషన్ ని సమానంగా ఉండేందుకు మరియు మీకు అందమైన రూపాన్ని కూడా అందిస్తుంది.

5. కళ్ళకి కన్సీలర్ ని వాడండి:

5. కళ్ళకి కన్సీలర్ ని వాడండి:

మీ కనురెప్పల మీద కొంచెం కాన్సెల్ర్ ని తీసుకొని మెళ్ళగా రాయండి. తరువాత అదే ఫౌండేషన్ ని

మీ కళ్ళ మీద అప్లై చేయండి. ఇది మీ కళ్ళమీద వున్న నల్లని వలయాలు మరియు నలుపుదనాన్ని మాయం చేస్తుంది. ఫౌండేషన్ ని తీసుకొని మరియు అది సమానంగా అప్లై చేసుకొనేలా చూసుకోండి.

6. లూస్ ట్రాన్సలూసెంట్ సెట్టింగ్ పొడిని ఉపయోగించండి:

6. లూస్ ట్రాన్సలూసెంట్ సెట్టింగ్ పొడిని ఉపయోగించండి:

లూస్ పౌడర్ మీ ఫౌండేషన్ మరియు కాన్సెల్ర్ సరిగా అంటుకునేలా చేసి ఇది ముడతలు మచ్చల మీదకి పోకుండా చేస్తుంది. ఒక చిన్న బ్రష్ సహాయంతో మీ ముఖం మీద దీనిని అప్లై చేసుకోండి.

7. హైలైట్ మరియు బ్లుష్ ని వాడండ

7. హైలైట్ మరియు బ్లుష్ ని వాడండ

మీ బుగ్గల మీద క్రీమ్ తో తయారుచేసిన హైలైట్ను ఉపయోగించండి, ఇది మీరు బ్లష్ ని

అప్లై చేసినప్పుడు మీ చర్మం మెరుస్తూ ప్రకాశించేలా చేస్తుంది. ఇది లైన్లు మరియు ముడుతలు కనిపించకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీనికోసం మీరుచేయవల్సిందల్లా కొంచం హైలైటర్ ని మీ బుగ్గల మీద అప్లై చేసుకోండి మరియు మీ చర్మపు టోన్ కి తగినట్లుగా బ్లుష్ ని చూస్ చేసుకోండి.

ఫెయిర్ గా వున్నవారికి రోజీ పింక్ మరియు పీచ్ ఒక మంచి ఛాయస్ గా చెప్పవచ్చు. మావ్ మరియు పీచ్ మీడియం టోన్ కలిగివారికోసం మరియు నారింజ, ముదురు రంగు కోసం నలుపు రంగు వక్తులకి సరిపోతుంది.చీకబోన్స్ పైన బ్లష్ అప్లై చేయకండి ఇది మిమల్ని అసహజంగా మరియు ఫన్నీ గా కనిపించేలా చేస్తుంది. దీనిని కేవలం మీ బుగ్గల మీద వృత్తాకారంలో అప్లై చేసుకోండి.

8. కళ్ళ మీద ఫోకస్ పెట్టండి:

8. కళ్ళ మీద ఫోకస్ పెట్టండి:

మెరిసే కళ్ళ మేకప్ మరియు లిక్విడ్ ఐ లైనర్ ని ఉపయోగించడం మానివేయండి, ఎందుకంటే ఇది ముడుతల మీద స్థిరపడి వాటిని మరింత బాగా కనిపించేలా చేస్తుంది. ఒక మాట్టే ఐషాడో మరియు ఒక ఐ లైనర్ పెన్సిల్ ని వాడండి. సహజ రంగులు మరియు తేలికైన షేడ్స్ మీ కళ్ళు అందంగా కనిపించేలా చేస్తాయి.

9. మీ లిప్స్ ని పర్ఫెక్ట్ గా చూసుకోండి:

9. మీ లిప్స్ ని పర్ఫెక్ట్ గా చూసుకోండి:

మొదట మీ పెదాలకి లిప్ ప్రైమర్ ని రాయండి. ఇది మీ లిప్స్టిక్తో మీ పెదవుల మీద ఎక్కువసేపు ఉండేలా చేసి,మీ పెదాలు సున్నితం గా ఉండేలా చేయడంలో సహాయపడతాయి. మీ పెదవుల ఔటర్ లైన్ కోసం ఒక లిప్ లైనర్ను ఉపయోగించండి, ఆపై మీకు ఇష్టమైన లిప్స్టిక్ ని రాసుకోండి.

ఇది మీ లిప్స్టిక్ ఎక్కువగా అంటుకోకుండా మీ పెదాలమొత్తం సమానంగా ఉండేలా చూస్తుంది. మాట్టీ-ఫిల్టర్ లిప్స్టిక్లను వాడకుండా చూసుకోండి ఎందుకంటే అవి మాయిశ్చరైజర్ కలిగి వుండవు, మరియు ఇది మీ ముడుతలను మరింతగా కనిపించేలా చేస్తాయి.

10. మీ మెడ ని నిర్లక్ష్యం చేయవద్దు

10. మీ మెడ ని నిర్లక్ష్యం చేయవద్దు"

మీ ముఖానికి మేకప్ రాయడం పూర్తి చేసిన తర్వాత, మీ మెడ మీద కొంచం బ్రాంజర్ ని అప్లై చేసుకోండి. మీ మెడ మీద ముడుతల ను ఒక బ్రోన్సర్ సహాయంతో కనపడనీయకుండా చేయవచ్చు. ఇంకా మీరు ఒక మాయిశ్చరైజర్ ని అప్లై చేసినప్పుడు, మీరు మీ మెడ మీద కూడా మర్చిపోకుండా రాసుకునేలా చూసుకోండి.

11. మీరే చెక్ చేసుకోండి:

11. మీరే చెక్ చేసుకోండి:

మీరు వేసుకున్న మేకప్ ఆర్టిఫిషల్ లైట్ కింద నాచురల్ లైట్ కింద కంటే భిన్నంగా కనిపిస్తుంది. మీ మేకప్ ఆర్టిఫిషల్ లైట్ కింద పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది, కానీ వెలుపలికి వచ్చినప్పుడు, అది అదే విధంగా కనిపించకపోవచ్చు.

సో, మీరు ఏమి చేయాలి, మీరు ఖచ్చితంగా మీ మేకప్ ని బాగా కలపడం అవసరం. మీరు సరిగ్గా మీ మేకప్ ని కలపడం చేయకపోతే, మీ ముడుతలు మరింతగా కనిపించే ప్రమాదముంది. కాబట్టి మీఅంతకి మీరే రెండుసార్లు చెక్ చేసుకొని, అవసరమైతే కొద్దిగా టచ్-అప్ వేసుకోండి.

గమనిక:

ఎల్లప్పుడూ మంచి మేకప్ ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేయండి. మరియు మీ చర్మానికి సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోండి. మిమల్ని మీరు హైడ్రాటెడ్ గా వుంచుకోవడానికి నీటిని పుష్కలంగా త్రాగండి.

ఆరోగ్యకరమైన మరియు అందమైన చర్మం కోసం ఆరోగ్యకరమైన ఆహారం మరియు రోజువారీ వ్యాయామం చాలా ముఖ్యమైనవి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Makeup Tips To Hide Wrinkles

    When you know you can't stop wrinkles from occurring, you can reduce it or cover it up with the help of makeup. It is extremely important to use the right product and to apply it properly over your face, or else your makeup will slide down to the fine lines on your face and make your wrinkles look more prominent.
    Story first published: Wednesday, January 17, 2018, 10:53 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more