For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లష్ ని వివిధ రంగుల చర్మం, వివిధ ముఖాలు మరియు చర్మాల పై ఎలా వాడాలో మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

ముఖాన్ని అందంగా అలంకరణ చేసుకొనేటప్పుడు వాడే సౌందర్య సాధనాలలో అతి ముఖ్యమైనది బ్లష్. ఎందుకంటే ఇది ముఖానికి మంచి వెలుగును ఇస్తుంది. చాలా మంది బ్లష్ ని సులభంగా వాడవచ్చని, బుగ్గల పై అలా రాసుకుంటే సరిపోతుందని భావిస్తారు.

బ్లష్ ని చాకచక్యంగా ఉపయోగించడం ద్వారా, మీ యొక్క ఎముకల నిర్మాణం చదును అవుతుంది. ఎదో మేకప్ బ్రష్ ని తీసుకొని, ముఖం పై, బుగ్గల పై ఆలా బ్లష్ ని రాసేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటే పొరబడినట్లే. బ్లష్ ని నిర్దిష్టమైన దిశలో బుగ్గలపై ఉపయోగించినప్పుడే, బ్లష్ వాడటం వల్ల కలిగే సత్ఫలితాలు మీకు కనిపిస్తాయి.

మీరు బ్లష్ వాడేటప్పుడు, మీ ముఖం యొక్క ఆకారం ఎలాంటిది, మీ చర్మం ఎటువంటిది మరియు మీ చర్మం యొక్క రకం ఏంటి, ఇలా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు బ్లష్ ని వాడాల్సి ఉంటుంది. మీకు వీటన్నిటి గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్న తర్వాత బ్లష్ ని సరైన పద్ధతిలో వాడే వెసులుబాటు మీకు దొరుకుతుంది.

How To Apply Blush Perfectly: For Different Face Types, Skin Tones & Skin Types

ఇప్పుడు మనం బ్లష్ ని ఖచ్చితత్వం తో ఎలా వాడాలి? అలా వాడేటప్పుడు చర్మాన్ని, చర్మపు రకాన్ని మరియు ముఖ ఆకారాన్ని ఎందుకు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం వుంది అనే విషయం తెలుసుకోబోతున్నాం.

మీరు ఇప్పుడు ఈ వ్యాసాన్ని చదవడం ద్వారా, మీ యొక్క చర్మ రకం మరియు రంగుని బట్టి ఎలాంటి బ్లష్ ని వాడాలి అనే అవగాహన ఖచ్చితంగా కలుగుతుంది. అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్లష్ చేసే ముందు బేస్ రాయాలి :

బ్లష్ చేసే ముందు బేస్ రాయాలి :

మీరు మీ ముఖానికి బ్లష్ ని రాసుకొనే ముందు కొన్ని మూలలను అసలు మరచిపోకూడదు. మొదట పౌండేషన్ రాసుకోవాలి. ఆ తర్వాత కన్సీలర్ ని, ఆ తర్వాత బ్రాంజెర్ ని రాసిన తర్వాత చివరిగా బ్లష్ ని రాయాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కళ్ళకు మేకప్ వేసుకోవాలి. మొదట ఐ బ్రౌ, ఆ తర్వాత ఐ షాడో, ఆ తర్వాత ఐ లైనర్ చివరిగా మస్కారా రాయాలి.

వీటన్నింటిని ఇలా క్రమ పద్దతిలోనే ఎందుకు రాసుకోవాలి అనే అనుమానం మీకు కలిగిందా ? ఇలా రాసుకోవడం ద్వారానే, మీ యొక్క మేకప్ చాలా ఖచ్చితత్వంతో ఉంటుంది మరియు మీరు అనుకున్న విధంగానే మీ యొక్క అందం ఆకర్షింపబడే విధంగా ఉంటుంది.

పొడిగా ఉండే బ్లష్ :

పొడిగా ఉండే బ్లష్ :

మీరు గనుక పొడిచేసి బ్లష్ ని గనుక వాడుతున్నట్లైతే, అటువంటి సమయంలో మధ్యరకంగా ఉండే మెత్తటి బ్రష్ ని వాడాలి. చాలా మృదువుగా మీ బుగ్గల పై దానితో రాయాలి. మీరు మీ బుగ్గల పై రాసుకున్నప్పుడు బ్రష్ కి పొడి గనుక అధికంగా ఉన్నట్లైతే, దానిని కొద్దిగా అలా తట్టి తీసివేయాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన బ్రష్ ని తీసుకొని బాగా కలపాలి. ముఖం పై ఉన్న వెంట్రుకలకు అనుగుణంగా క్రిందకి జరుపుతూ మృదువుగా మీ చర్మం ఉపరితలం పై రాయాలి.

ద్రవరూపం లో ఉండే బ్లష్ :

ద్రవరూపం లో ఉండే బ్లష్ :

మీరు గనుక క్రీమ్ లేదా జెల్ రూపంలో ఉన్న బ్లష్ ని గనుక వాడుతున్నట్లైతే, మీ వేలి పై కొద్దిగా ఆ ద్రవాన్ని తీసుకొని, మీ బుగ్గలపై సరైన పద్ధతిలో రాసుకోవాలి. మీరు సహజంగా సాధారణంగా కనపడాలని భావిస్తున్నట్లైతే బ్లష్ బ్రష్ ని వాడటం మంచిది. క్రీమ్ బ్లష్ ని వాడే సమయంలో ఉత్తమమైన ఫలితాల కోసం క్రీమ్ పౌండేషన్ రాసుకోవడం మంచిది.

బ్లష్ ఎక్కువగా ఉన్నట్లైతే దానిని టిష్యూ పేపర్ తో తీసివేయండి :

బ్లష్ ఎక్కువగా ఉన్నట్లైతే దానిని టిష్యూ పేపర్ తో తీసివేయండి :

మీరు గనుక మరీ ఎక్కువ మోతాదులో బ్లష్ ని రాసుకున్నట్లైతే, దానిని మీరు తగ్గించుకోవాలని భావిస్తున్నట్లైతే, ఆ సమయంలో దాని పై పొడి ని అస్సలు రాయకండి. ఇలా చేయడం ద్వారా మీ ముఖం కాంతి విహీనం అవుతుంది.

ఇందుకు బదులుగా ఒక టిష్యూ పేపర్ ని తీసుకొని అధికంగా ఉన్న బ్లష్ క్రీమ్ ని తీసి వేయాలి. క్రీమ్ బ్లష్ వాడినప్పుడు ఇలా చేయాలి. ఒకవేళ పొడి బ్లష్ వాడినట్లైతే మీ ముఖానికి వ్యతిరేక దిశలో టిష్యూ పేపర్ ని పట్టుకొని ఒక స్పాంజ్ ఉపయోగించి అక్కడ తడవండి. ఇలా చేయడం ద్వారా అధికంగా ఉన్న బ్లష్ టిష్యూ పేపర్ పై పడుతుంది.

వివిధరకాల ముఖ ఆకారాల కోసం బ్లష్ ఎలా వాడాలి :

వివిధరకాల ముఖ ఆకారాల కోసం బ్లష్ ఎలా వాడాలి :

1. హృదయాకారంలో ఉండే ముఖం :

మీ ముఖం గనుక బుగ్గ దగ్గర ఎముకులు బాగా కనపడుతూ, గడ్డం దగ్గర సన్నగా గనుక ఉంటే, మీ ముఖం హృదయాకారంలో ఉన్నదని అర్ధం. అటువంటి సమయంలో పై నుండి మీ బుగ్గల వరకు, మీ కంటి క్రింద నుండి బుగ్గల వరకు బ్లష్ ని రాసుకోండి.

ఈ సమయంలో బ్రష్ ని సి ఆకారంలో తిప్పండి. మృదువుగా బ్రష్ ని ఉపయోగించి మీ కంటి క్రింది భాగంలో రాసుకుంటూ ఎప్పుడైతే బుగ్గల ఎముక వద్దకు వస్తారో, అటువంటి సమయంలో కొద్దిగా ఒత్తిడిని పెంచండి. మరీ ఎక్కువగా అయితే అస్సలు రాసుకోకండి.

2. గుండ్రటి ముఖం :

2. గుండ్రటి ముఖం :

ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బుగ్గలకు పక్కన అస్సలు ఈ బ్లష్ ని రాసుకోకూడదు. ఇలా రాసుకోవడం వల్ల మీ ముఖం మరింత గుడ్రంగా కనపడుతుంది. దీనికి బదులు మీ బుగ్గలు ఎక్కడైతే తక్కువగా ఉంటాయో, అక్కడ బ్రష్ ఉపయోగించి రాసుకోండి. ముఖ్యంగా బుగ్గ ఎముకుల క్రింది భాగంలో రాసుకోవడం వల్ల, మీ ముఖానికి మరింత అందం పెరుగుతుంది.

3. గుడ్డు ఆకారంలో ఉండే ముఖం :

3. గుడ్డు ఆకారంలో ఉండే ముఖం :

మీకు గనుక పొడవాటి ముఖం ఉంటే, బుగ్గల ఎముకలు బాగా కనపడుతుంటే, సన్నని గడ్డం కనుక ఉంటే మరియు సన్నని నుదురు కూడా ఉంటే మీది గుడ్డు ఆకారంలో ఉన్న ముఖం అని అర్ధం. ఇటువంటి సమయంలో మీరు పొడి రూపంలో ఉన్న బ్లష్ ని, మేకప్ బ్రష్ ని ఉపయోగించి వాడాలి. అధికంగా పొడి గనుక ఉంటే దానిని తీసివేయండి.

ముఖ్యంగా బుగ్గ ఎముకలు ఉన్న ప్రాంతంలో బ్రష్ తో బాగా పూసుకోండి. ఆ తర్వాత అక్కడి నుండి చెవి క్రింది వరకు అనండి. ఆ తర్వాత అలా ముఖం పై వరకు వెళ్ళండి. కళ్ళు వెనకటి భాగంలో పైన బ్లష్ ని కొద్దిగా వాడండి.

4. దీర్ఘచతురస్రాకార ముఖం :

4. దీర్ఘచతురస్రాకార ముఖం :

మీ నుదురు, బుగ్గలు మరియు దవడ భాగం ఒకే వెడల్పులో గనుక ఉంటే, అటువంటి సమయంలో మీ ముఖం దీర్ఘచతురస్రాకార లో ఉందని అర్ధం ఇటువంటి సమయంలో మీ బుగ్గల పై బ్లష్ ని రాసుకోండి. అక్కడ మొదలు పెట్టిన తర్వాత అలా మీ ముక్కు వరకు రాసుకొని ఆ తర్వాత మీ కంటి వెనుక భాగం వరకు వెళ్ళండి. అంతేకాకుండా బ్లష్ ని నుదిటి పై మరియు కనుబొమ్మల పక్కన కూడా కొద్దిగా రాసుకోండి.

5. చదరపు ముఖం :

5. చదరపు ముఖం :

మీ పక్కలు నేరుగా ఉండి, మీ దవడ భాగం చదునుగా ఉంటే, మీ ముఖం చదరపు ఆకారంలో ఉందని అర్ధం. ఇటువంటి సమయంలో క్రీమ్ బ్లష్ ని మీ బ్రష్ కి రాసి మృదువుగా మీ ముఖం పై రాయండి. అందుకు సంబంధించిన రంగు మొత్తం బ్రష్ కి బాగా పట్టేలా చూడండి.

ఆ తర్వాత బ్రష్ ని బుగ్గ ఎముకలపై పై నుండి క్రిందకు అంటూ రాయండి. కనుబొమ్మల దగ్గర నుండి ముక్కువరకు కూడా రాయండి. కను రెప్పలకు మరియు పెదాలకు కూడా చాలా కొద్దిగా మాత్రమే బ్లష్ ని రాయండి. ఎక్కువగా అస్సలు రాయకండి.

వివిధ రకాల చర్మ రంగుల కోసం ఏ బ్లష్ రంగులు వాడాలి :

వివిధ రకాల చర్మ రంగుల కోసం ఏ బ్లష్ రంగులు వాడాలి :

1. తెల్లగా గనుక మీ చర్మం రంగు ఉంటే :

లేత ఎరుపు రంగు, ప్లమ్ మరియు పీచు రంగు వాడటం మంచిది. ఈ రంగులు తెలుపు రంగు చర్మానికి బాగా నప్పుతాయి. ఎందుకంటే, ఆ రంగు చర్మంపై సహజంగా కనిపిస్తాయి. లేత ఎరుపు రంగు మీ యొక్క బుగ్గలకు అవసరమైన అందాన్ని ఇస్తుంది. ప్లమ్ కూడా మీ యొక్క తెలుపు రంగు చర్మంపై పై సహజంగా కనిపిస్తుంది మరియు మంచి అందాన్ని ఇస్తుంది.

2. చామన ఛాయ రంగులో చర్మం ఉంటే :

2. చామన ఛాయ రంగులో చర్మం ఉంటే :

ఆప్రికాట్ మరియు మౌవే వంటి ఖచితతత్వమైన రంగులు, చామన ఛాయా కలిగిన చర్మానికి బాగా నప్పుతాయి. ఆప్రికాట్ వాడటం వల్ల ఒకలాంటి వెచ్చదనం వస్తుంది. అదే మౌవే వాడితే ఒక తెలియని అందాన్ని బయటపెడుతోంది.

3. ఆలివ్ రంగు చర్మం :

3. ఆలివ్ రంగు చర్మం :

ఆలివ్ రంగు చర్మం ఉన్నవారికి, గులాబీ రంగు బాగా ఉంటుంది. గులాబీ రంగు అనేది మద్యరకానికి చెందినది. ఇది మరీ ఎక్కువ కాంతి వంతంగా ఉండదు. కాంస్యం రంగు మీ ముఖానికి వెచ్చదనాన్ని మరియు వెలుగుని ఇస్తుంది. వ్యక్తులకు ఎవరైతే ఆలివ్ రంగు చర్మ ఉంటుందో అటువంటి వారు సహజంగానే అందంగా కనిపిస్తారు మరియు ఇలా చేయడం ద్వారా వారిని కాంస్యం మరింత సహజంగా, అందంగా కనపడేలా చేస్తుంది.

4.ఘాడమైన చర్మపు రంగు :

4.ఘాడమైన చర్మపు రంగు :

ఇలా ఉన్నవారు రైసిన్, ప్రకాశవంతమైన టాంగేరిన్ లేదా మట్టి రంగులు ఈ రకమైన ఘాడమైన చర్మపు రంగు గలవారికి నప్పి బాగా కనపడతాయి అందంగా ఉంటాయి. నలుపు రంగు చర్మం ఉండే వారు వెచ్చదనంగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ఎందుకంటే, మీరు గనుక మరీ ఎక్కువ చల్లదనాన్ని కోరుకుంటే, మీ చర్మం బూడిద రంగులోకి మారుతుంది. ప్రకాశవంతమైన టాంగేరిన్ వాడటానికి అస్సలు బయపడకండి. ఎందుకంటే నలుపు రంగు చర్మ కలవారికి ఇది ఎంతో చక్కగా కనపడుతుంది.

వివిధరకాల చర్మం కల వారు ఎలాంటి బ్లష్ ని వాడాలి :

వివిధరకాల చర్మం కల వారు ఎలాంటి బ్లష్ ని వాడాలి :

1. సాధారణం నుండి జిడ్డు చర్మం వరకు :

స్త్రీలకు ఎవరికైతే సాధారణం నుండి జిడ్డు లాంటి చర్మం ఉంటుందో అటువంటి వారు పొడి బ్లష్ ని ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ రకమైన బ్లష్ అన్నిరకాల చర్మాలకి సరిపోతుంది. పొడి బ్లష్ ఒక రకమైన చక్కటి అందానికి ముగింపుని ఇస్తుంది. అంతేకాకుండా ఈ బ్లష్ చర్మం పై చాలా ఎక్కువ సమయం పాటు ఉంటుంది. దీనికి అదనంగా మీరు టచ్ అప్ ఇవ్వనవసరం లేదు.

2. పొడిబారిన మరియు వృద్యాప్య ఛాయలు ఉండే చర్మం :

2. పొడిబారిన మరియు వృద్యాప్య ఛాయలు ఉండే చర్మం :

స్త్రీలలో ఎవరికైతే పొడిబారిన చర్మం ఉంటుందో, వారు క్రీమ్ బ్లష్ వాడవచ్చు. అలా వాడటం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది మరియు వారి యొక్క చర్మం మృదువుగా కోమలంగా ఉంటుంది. ఇది వారి యొక్క చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది మరియు చర్మం పొరలుగా కాకుండా చూస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది మరియు ఒక ప్రామాణికమైన అందాన్ని ముఖానికి ఇస్తుంది.

English summary

How To Apply Blush Perfectly: For Different Face Types, Skin Tones & Skin Types

How To Apply Blush Perfectly: For Different Face Types, Skin Tones & Skin Types,There are certain directions you will need to follow when you sweep your brush onto your cheeks. We tel you how to apply perfect way to apply blush depending on your skin colour, skin types and structure of your face.
Story first published:Saturday, February 10, 2018, 13:31 [IST]
Desktop Bottom Promotion