For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెరికోస్ వెయిన్స్ ను బయటకు స్పష్టంగా కనపడకుండా చేసే అలంకరణ చిట్కాలు!

వెరికోస్ వెయిన్స్ ను బయటకు స్పష్టంగా కనపడకుండా చేసే అలంకరణ చిట్కాలు!

|

వెరికోస్ వెయిన్స్ / స్పైడర్ వెయిన్స్ కారణంగా మీకు ఇష్టమైన చిన్న స్కర్టులు మరియు దుస్తులను వేసుకోలేకపోతున్నారా? మీ సమాధానం అవును అయితే, ఈ వ్యాసం మీ కోసమే! ఈ వ్యాసంలో, వెరికోస్ వెయిన్స్ / స్పైడర్ వెయిన్స్ కవర్ చేయడానికి పనికొచ్చేకొన్ని మేకప్ చిట్కాలను మీకు తెలియజేస్తున్నాము, తద్వారా ఆత్మవిశ్వాసంతో మీరు బయటికి అడుగు పెట్టవచ్చు.

కాళ్ళలో వాచి, ఉబ్బినట్లు కనిపించే సిరలను సాధారణంగా వెరికోస్ వెయిన్స్ / స్పైడర్ వెయిన్స్ అంటారు. రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి సాధారణంగా పెద్దలలో కనిపిస్తుంది. వీటిని వైద్యపరంగా మరియు సహజంగా చికిత్స చేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి.

How To Hide Your Varicose/Spider Veins With Make-up Tips?

వెరికోస్ వెయిన్స్ చికిత్సకు కొన్ని గృహవైద్య సహజ నివారణలు ఉన్నప్పటికీ, ఈ చికిత్సలు ఫలితం ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. కానీ, అలంకరణ ఉత్పత్తుల సహాయంతో, వీటిని బయటకు స్పష్టంగా కనపడకుండా చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మేకప్ తో, వీటిని ఎలా దాచి పెట్టవచ్చో, దానికై మనం ఏమి చెయ్యాలో తెలుసుకుందాం.

స్టెప్ 1: టానింగ్ లోషన్ ను ఉపయోగించండి

స్టెప్ 1: టానింగ్ లోషన్ ను ఉపయోగించండి

మీరు దుస్తులను ధరించదానికి ముందే, టానింగ్ లోషన్ మీ కాళ్ళపై రాసుకోవాలి. ఇలా చేస్తే కనుక, మీ దుస్తులపై మరకలు పడే అవకాశం ఉండదు. లేదు. టానింగ్ లోషన్ ను ఎంపిక చేసుకున్నప్పుడు, మీ చర్మం యొక్క రంగుకు దగ్గరగా ఉన్నదాన్ని ఎంచుకోండి. అప్పుడు, మీ వెరికోస్ వెయిన్స్ ను పూర్తిగా దాచి పెట్టవచ్చు. మీ చేతిలోకి కొంచెం టానింగ్ లోషన్ ను తీసుకుని, మీ కాళ్ళకు రాసుకోండి.

స్టెప్ 2: శరీరానికి మేకప్ వేసుకోవడం.

స్టెప్ 2: శరీరానికి మేకప్ వేసుకోవడం.

టానింగ్ లోషన్ ను ఉపయోగించిన తరువాత దశలో, మీ శరీరానికి మేకప్ వేసుకోండి. చర్మం యొక్క రంగును పోలి ఉండే మేకప్ వేసుకుని, స్పాంజితో దానిని అద్దుతూ, వ్యాపించేలా చేయండి. వెరికోస్ వెయిన్స్ కలిగి ఉన్న భాగాన్ని మాత్రమే కాక, మొత్తం కాలంతా సమానంగా, చర్మం సహజంగా, అందంగా కనపడేలా రాసుకోండి. మీ మొకాళ్ళ దిగువ భాగంలో వెరికోస్ వెయిన్స్ ఉన్నట్లైతే, పాదం నుండి మోకాలి వరకు మేకప్ వేసుకోండి. మేకప్ మీ చర్మంపై సమానంగా పరచుకునేలా సహజంగా ఉంటూనే, వెరికోస్ వెయిన్స్ ను పూర్తిగా కప్పి ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

స్టెప్ 3: కన్సీలర్

స్టెప్ 3: కన్సీలర్

ఈ దశలో, మీకు ఒక వాటర్ ప్రూఫ్ కన్సీలర్ మరియు ఒక సన్నని ఐలైనర్ బ్రష్ అవసరం. మీరు ఎంచుకున్న కన్సీలర్, మీ శరీరం యొక్క రంగు కంటే తేలికైనదై ఉండాలి. కన్సీలర్ లో ఐలైనర్ బ్రష్ ముంచి మరియు వెరికోస్ వెయిన్స్ / స్పైడర్ వెయిన్స్ ను కప్పేయాలి. కన్సీలర్ ను సన్నని పొరలా మాత్రమే రాసుకోవాలి.

స్టెప్ 4: కన్సీలర్ ను బ్లెండ్ చేయండి.

స్టెప్ 4: కన్సీలర్ ను బ్లెండ్ చేయండి.

కన్సీలర్ ను రాసుకున్న తరువాత, మీ వెరికోస్ వెయిన్స్ ను దాచిపెట్టడానికి దానిని వాటి మీద సమానంగా పరచుకునేట్టు అద్దటం చాలా ముఖ్యం. దీనికై ఒక పరిశుభ్రమైన స్పాంజ్ ను ఉపయోగించండి. దీనితో సమానంగా మీ చర్మంపై ఏ విధమైన ప్యాచులు ఏర్పడకుండా అద్దండి.

మీకు ఉన్న వెరికోస్ వెయిన్ సమస్య, శాశ్వతమైనది కానట్లయితే, మీరు దానిని తాత్కాలికంగా వదిలించుకోవాలని కోరుకుంటే, దాన్ని కనిపించకుండా దాచాలంటే, ఏరోసోల్ లెగ్ స్ప్రే ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. "ఎయిర్ బ్రష్ లెగ్స్" అని పిలువబడే ఈ ఉత్పత్తులను, మొదట మీ చేతులపై చల్లుకుని, మునివేళ్ళ సహాయంతో వేరికోస్ వెయిన్స్ మీదుగా నెరపండి.

వెరికోస్ వెయిన్స్ ను కనపడకుండా చేయడానికి అవలంబించవలసిన ఇతర చిట్కాలు:

వెరికోస్ వెయిన్స్ ను కనపడకుండా చేయడానికి అవలంబించవలసిన ఇతర చిట్కాలు:

కలబంద గుజ్జు:

కలబంద గుజ్జు యొక్క నయం చేసే లక్షణాలు ప్రభావవంతంగా వేరికోస్ వెయిన్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. తగినంత మొత్తంలో కలబంద గుజ్జును తీసుకుని, ప్రభావిత ప్రదేశంలో కనీసం రోజుకు రెండుసార్లు మర్దన చేసుకోండి.

గోరువెచ్చని నూనెను ఉపయోగించండి:

గోరువెచ్చని నూనెను ఉపయోగించండి:

వేరికోస్ వెయిన్స్ చికిత్సకు వేడి నూనెతో మర్దన చేసుకోవడం మరో ప్రత్యామ్నాయం. ఇలా చేస్తే రక్త ప్రసరణను మెరుగవుతుంది. మీకు నచ్చిన ఏ నూనెనైనా ఉదాహరణకు, కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనె, ఏదైనా నూనెను వెచ్చగా చేసి, తరువాత ప్రభావిత ప్రాంతంలో వలయాకార కదలికలతో మర్దన చేసుకోండి.

 వెనిగర్:

వెనిగర్:

తెల్ల వెనిగర్ ని కొంచెం నీటిలో కలిపి పలుచన చేయండి. ఈ మిశ్రమంతో ప్రభావిత ప్రదేశం వద్ద మర్దన చేయండి. తరువాత 20 నిముషాల పాటు ఆరనిచ్చి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

How To Hide Your Varicose/Spider Veins With Make-up Tips?

Worried of flaunting your favorite short skirts and dresses due to varicose vein? Then you are definitely at the right place. In this article we'll let you know some instant make-up tips to cover your varicose/spider vein so that you can step outside confidently. Make-up Tips To Hide Varicose/Spider Vei
Story first published:Wednesday, August 8, 2018, 16:56 [IST]
Desktop Bottom Promotion