ఈ అద్భుతమైన చిట్కాలతో మీ లిప్ స్టిక్ ను చెదిరిపోకుండా కాపాడుకోండి

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

జీవితంలో కొన్ని విషయాలు తక్కువ సమయం ఉంటేనే బాగా ఎంజాయ్ చేయగలం అన్పిస్తుంది, అలానే ఇంకొన్ని విషయాలు ఎంతసేపున్నా తనివితీరదు, ఇంకా కావాలనిపిస్తుంది.అలా మన లిప్ స్టిక్ జీవితకాలం కూడా రెండవ కేటగిరీలోకి వస్తుంది. కొన్నిసార్లు చాలా బిజీగా పనులతో పరిగెడుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ లిప్ స్టిక్ వేసుకునే ఖాళీ ఉండదు. అలా తింటున్నప్పుడు లేదా తాగుతున్నప్పుడు లిప్ స్టిక్ రంగు పోయి, నచ్చిన బట్టలు వేసుకున్నప్పుడు వాటికి మరకలుగా అతుక్కుపోతాయి కూడా.

అవును, అది పీడకలే, మనకి నచ్చిన బట్టలమీద నుంచి లిప్ స్టిక్ రంగును పోగొట్టడం పెద్ద పనే! సరే ఒప్పేసుకుందాం, ఎవరికీ ఎంతకీ తగని టచప్స్ చేసుకునే సమయం ఉండదు. ఈ మళ్ళీ మళ్ళీ టచప్ గోల లేకుండా హాయిగా ఒకసారి వేసుకుంటే లిప్ స్టిక్ ఎక్కువసమయం నిలిచి వుండాలని ఎవరికుండదు? ఈరోజు, మీ సమయాన్ని చాలా కాపాడే అలాంటి కొన్ని లిప్ స్టిక్ ఉపాయాలను మేము మీకోసం పట్టుకొచ్చాం. ఫర్ఫెక్ట్ గా అన్పిస్తోంది కదూ? అవును, అన్పిస్తుంది. మొత్తం చదివి వీటిని ప్రయత్నించండి, మేము హామీ,నిరాశ అయితే కలగదు. ఇక చదవండి.

1.ఎక్స్ ఫోలియేట్ చేసి పెదవులకి తేమను కూడా ఇవ్వండి

1.ఎక్స్ ఫోలియేట్ చేసి పెదవులకి తేమను కూడా ఇవ్వండి

మీ లిప్ స్టిక్ ఎక్కువ సమయం ఉండాలనుకుంటే, మీరు ముందుగా పెదవులపై మృతకణాలను, విరిగిపోయిన చర్మాన్ని తొలగించటానికి ఎక్స్ ఫోలియేట్ చేయాలి. తర్వాత మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ పెదవులకి రాసుకోండి, దాంతో మీ పెదవులు మృదువుగా, మెత్తగా ఉంటాయి. మెత్తని, ఆరోగ్యవంతమైన పెదవులపైనే లిప్ స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది.

2.లిప్ లైనర్ వాడండి

2.లిప్ లైనర్ వాడండి

లిప్ లైనర్ కి ఎక్కువ సమయం ఉండే శక్తి ఉంది ఎందుకంటే వాటిల్లో మైనం పదార్థాలు ఉండి లిప్ స్టిక్ ను పెదాలకి మొండిగా అతుక్కొని ఉండేలా చేయవు. లిప్ లైనర్ మీ పెదవుల రంగు పెదవులకే అంటుకొని ఉండి, పెదవుల బయటకి చెదిరిపోకుండా ఉండేలా అడ్డుగోడను సృష్టిస్తుంది.మీ లిప్ స్టిక్ రంగు షేడ్ కి దగ్గర్లో ఉండే లిప్ పెన్సిల్ లేదా న్యూట్రల్ లిప్ లైనర్ ను వాడండి. లిప్ లైనర్ నిండుదనాన్ని తెచ్చి, పెదవులకి మంచి ఆకారాన్ని కూడా ఇవ్వటంలో సాయపడుతుంది.

3.లిప్ ప్రైమర్ ను వాడండి

3.లిప్ ప్రైమర్ ను వాడండి

లిప్ ప్రైమర్ లిప్ స్టిక్ రంగును ఎక్కువసేపు నిలిచివుండేలా పెదవులకి బేస్ ఇస్తుంది. అది పెదవులను మృదువుగా మార్చి లిప్ స్టిక్ రంగు చెదిరిపోకుండా ఉండేలా చేస్తుంది. లిప్ ప్రైమర్ లో ఉండే పదార్థాలు లిప్ స్టిక్ ఎక్కువకాలం పనికొచ్చేలా చేస్తాయి.

4. బ్లాట్ చేయటం మర్చిపోవద్దు

4. బ్లాట్ చేయటం మర్చిపోవద్దు

బ్లాటింగ్ అనేది చాలా సింపుల్ అలాగే ప్రభావం చూపే మంచి చిట్కా. బ్లాటింగ్ వలన అదనపు నూనెలు పీల్చుకోబడి లిప్ స్టిక్ చెదిరిపోకుండా,కరిగిపోకుండా ఉంటుంది. మీ పెదవులంతా సన్నని పొరలా లిప్ స్టిక్ ను వేయండి. తర్వాత శుభ్రమైన టిష్యూ పేపర్ ను తీసుకుని మీ పెదవుల మధ్యలో ఉంచుకుని కొన్ని సెకన్ల పాటు పెదవులను ఒకేసారి దగ్గరకు వత్తండి. తర్వాత అదే లిప్ స్టిక్ మరో కోటింగ్ వేయండి.

5.పౌడర్ వాడండి

5.పౌడర్ వాడండి

మీకు నచ్చిన పెదవుల రంగు వేసుకున్నాక, టిష్యూ పేపర్ తీసుకుని మీ పెదవులపై నెమ్మదిగా వత్తండి. ఇప్పుడు సెట్లింగ్ లేదా రంగు లేని పౌడర్ ను ఒక వత్తైన బ్రష్ పై వేసుకుని దాన్ని టిష్యూ పేపర్ పై నెమ్మదిగా వత్తండి.ఇక టిష్యూ పేపర్ ను తీసేసి మీకు నచ్చిన పెదవుల రంగు మరో కోటింగ్ వేయండి.

6. ఫౌండేషన్ ప్రయత్నించండి

6. ఫౌండేషన్ ప్రయత్నించండి

ఫౌండేషన్ కూడా పెదవుల ప్రైమర్ గా పనిచేస్తుంది. ఇది కూడా లిప్ స్టిక్ పెదవులపై ఎక్కువసేపు నిలిచివుండేలా పెదవులను మృదువుగా తయారుచేస్తుంది. మీ చేతివేళ్ళను లేదా దళసరిగా ఉన్న మేకప్ బ్రష్ ను వాడి ఫౌండేషన్ ను మీ పెదవులపై రాసుకోవచ్చు. మీరు పౌడర్ ఫౌండేషన్ వాడుతున్నట్లయితే, ఫ్లఫ్ఫీ వత్తైన బ్రష్ తో వాడండి.

7.ఎక్కువసేపు నిలిచి వుండే లిప్ స్టిక్ ఫార్ములా వాడండి

7.ఎక్కువసేపు నిలిచి వుండే లిప్ స్టిక్ ఫార్ములా వాడండి

సరైన లిప్ స్టిక్ ఎంచుకోవడం ముఖ్యమైన పని. చాలాసేపు నిలిచివుండే లిప్ స్టిక్ లో అదనపు రంగు ఇంకా తక్కువ తేమనిచ్చే ఏజెంట్ ఉండటంతో మిగతా లిప్ స్టిక్ ఫార్ములాలకన్నా ఎక్కువసేపు నిలిచి వుంటాయి. మాటె లేదా వాటర్ ఫ్రూఫ్ లిప్ స్టిక్స్ ను ఎంచుకోండి. గ్లాసీ, ఒపేక్ లిప్ స్టిక్స్ వాడవద్దు, ఇవి త్వరగా పాలిపోతాయి.

8.సరిగ్గా వేసుకోవటం

8.సరిగ్గా వేసుకోవటం

మీకు ఫర్ఫెక్ట్ పెదవులు కావాలంటే, లిప్ స్టిక్ ను లిప్ బ్రష్ తో వేసుకోవాలని తెలుసుకోండి. లిప్ స్టిక్ రంగును జాగ్రత్తగా పెదవుల చివరి అంచుల నుంచి మధ్యభాగానికి వేసుకుంటూ రండి, ఇలా అయితే ఎక్కువసేపు సరిగ్గా అందంగా ఉంటుంది.

9.చెదిరిపోకుండా చూసుకోవచ్చు

9.చెదిరిపోకుండా చూసుకోవచ్చు

లిప్ స్టిక్ మీ పెదవుల నుంచి కరిగి అసహ్యంగా చుట్టూ పాకకుండా ఈ సింపుల్ పద్ధతిని ఉపయోగించవచ్చు. కొంచెం క్లియర్ బ్రో జెల్ లేదా కన్సీలర్ పెన్ తీసుకుని మీ పెదవుల అంచులపై గీతలా గీయండి. ఇది మీ లిప్ స్టిక్ కి అడ్డుగోడలా నిలిచి అది దాని స్థానంలోనే ఎక్కువసేపు ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం, ఈ పద్ధతులను ప్రయత్నించండి, మాది హామీ, మీకు తప్పక నచ్చుతాయి.

English summary

Make Your Lipstick Last Long With These Amazing Tips

In our busy schedule, we may not have enough time to apply makeup and retain it for a long time. But by applying a lip liner before lipstick, it can let the lipstick stay on for a longer time, exfoliate your lips and you can remove the flaky patches on your lips.