For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వయసుని ఎక్కువ చేసి చూపించే కొన్ని మేకప్ పొరపాట్లు

|

మన ముఖకవళికలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి మేకప్ చేసుకోవడంలో మెళకువలు తెలిసి ఉండాలి. మనం మేకప్ వేసుకునేతప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మన వయసు అసలు కంటే అధికంగా కనిపించే ప్రమాదం ఉంది.

స్త్రీలు సాధారణంగా మేకప్ ద్వారా తమ వయసును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అందులో కనుక పొరపాటు జరిగితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. మన అసలు వయసు కంటే ఎక్కువగా లేదా ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. మేకప్ ద్వారా మన వయసు తగ్గినట్టు లేదా పెరిగినట్టు కనిపించే రెండు అవకాశాలు ఉన్నాయి.

makeup mistakes | makeup mistakes that make you look older

యవ్వనంలో ఉన్నప్పుడు మీరు వేసుకునే మేకప్ లో తప్పులు దొర్లినా పెద్దగా బయటపడవు, తరువాత వయసులో మీరు చేసే అవే తప్పులు మీ ఆకర్షణకు అవాంతరాలవుతాయి. యవ్వనంలో మీరు వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా, నడి వయసు లో మాత్రం తగిన జాగ్రత్తలు అవసరం.

చిన్న చిన్న మార్పులే మీ వయసును ఎంతలా దాచేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

వయసు మీద పడటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దానిని మనమందరం హుందాగా అంగీకరించాల్సిందే! కానీ మీ వయసుకు తగిన అందం మీ వదనం లో ప్రతిబింబించాలంటే ఈ క్రింది పద్ధతులు మీకు తోడ్పడతాయి.

1. సరైన ఫౌండేషన్ ఉపయోగించకపోవడం:

1. సరైన ఫౌండేషన్ ఉపయోగించకపోవడం:

వివిధ తరహాల చర్మాలకు సరిపడా వివిధ రకాల ఫౌండేషన్ లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మన వయసుపెరుగుతున్న కొద్దీ మన చర్మంలో తేమ ఉత్పత్తి తగ్గిపోతుంది. తదనుగుణంగా చర్మానికి సాగే గుణం పోతుంది. కనుక అధిక మ్యాట్ ఎఫెక్ట్ ఉండే ఫౌండషన్ ను వాడితే చర్మం పొడిబారి పెళుసుగా కనిపిస్తుంది. అంతేకాక కొన్నిసార్లు ముఖం పై ఏర్పడిన గీతలు, ముడుతలు స్పష్టంగా కనిపిస్తాయి.

మీ చర్మ తత్వాన్ని బట్టి మీరు ఫౌండేషన్ రాసుకునే విధానం ఉంటుంది. కొంతమంది ఫౌండషన్ చర్మంలో కలిసిపోవటానికి బ్రష్ ని వాడితే కొంతమంది స్పాంజ్ వాడతారు. స్పాంజ్ ను వాడటం వలన మంచి ఫలితం ఉంటుంది.

 2. ముఖ చర్మాన్ని సంసిద్ధం చేయక పోవడం:

2. ముఖ చర్మాన్ని సంసిద్ధం చేయక పోవడం:

మేకప్ వేసుకునే ముందు చర్మాన్ని అందుకు తగ్గట్టుగా సంసిద్ధం చేసుకోవాలి. ముందుగా ముఖానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయటం వలన మీ చర్మం మేకప్ కు అనువుగా మారి ఎక్కువ సమయం నిలుస్తుంది. అంతే కాకుండా చర్మం పై ఉండే మృతకణాలు తొలగి తేమను ఆపాదించుకుంటుంది. మాయిశ్చరైజర్ ను రాసుకోకపోతే కనుక మీ మేకప్ ప్యాచులుగా కనిపిస్తుంది. మాయిశ్చరైజర్ తో పాటుగా ప్రైమర్ ను కూడా అద్దుకోండి. ఇది మీ చర్మానికి మేకప్ కు మధ్యలో తెరలా పనిచేస్తుంది. ప్రైమర్ మీ చర్మ రంధ్రాలను మూసివేసి మీ ముఖాన్ని ఒక చక్కని కేన్వాస్ లా తయారు చేస్తుంది.

3. కన్సీలర్ ను తగు విధంగా వాడకపోవడం:

3. కన్సీలర్ ను తగు విధంగా వాడకపోవడం:

సాధారణంగా కన్సీలర్ వాడకంలో రెండు రకాల పొరపాట్లు చేస్తుంటారు. మొదటి పొరపాటు, కన్సీలర్ ను అతిగా వాడటం. కన్సీలర్ ను ఎక్కువగా రాసుకుంటే, అది మీ ముఖం మీద ఉండే సన్నటి గీతలలో నిండి అవి మరీంత స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకొక పొరపాటు, మరీ లేత రంగు కన్సీలర్ ను వాడటం. లేత రంగు కన్సీలర్ ను సాధారణంగా హైలైటింగ్ కు వాడతారు. లేత రంగు కన్సీలర్లు మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తాయి. మీ మేని ఛాయకు సరిపడే కన్సీలర్ వాడినట్లైతే మీకంటి కింద నల్లటి వలయాలని, ఉబ్బినట్లు ఉండే చర్మాన్ని కనిపించకుండా చేసి మరీంత యవ్వనంగా కనిపించేటట్లు చేస్తుంది.

4. బ్లష్ ను అతిగా పూసుకోవడం:

4. బ్లష్ ను అతిగా పూసుకోవడం:

బ్లష్ ని మీ చెక్కిళ్ళ పై లేతగా అద్దుకుంటే మీ ముఖానికి కొత్త శోభ చేకూరుతుంది. సరైన పద్దతిలో బ్లష్ రాసుకుంటే మీ మేని ఛాయ ఆరోగ్యవంతంగా అనిపిస్తుంది.చాలా మంది బ్లష్ ను అతిగా రాసుకోవడం లేక సరైన ప్రదేశంలో రాసుకోవకపోవటం వలన ఎబ్బెట్టుగా, అసహజంగా కనిపిస్తారు. దాని వలన మరీంత వయస్సు మీద పడినట్లు కనిపిస్తారు.

5. గాఢమైన రంగులున్న లిప్ స్టిక్ వాడటం:

5. గాఢమైన రంగులున్న లిప్ స్టిక్ వాడటం:

మనలో చాలా మందికి వివిధ రకాల ముదురు రంగు లిప్ స్టిక్ లతో ప్రయోగాలు చేయాలనే కోరిక ఉంటుంది. ముదురు రంగులైన ఆక్స్ బ్లడ్, డీప్ వైన్,బెర్రీ, పర్పుల్ లేదా నీలాలు చిన్న వయసులో నప్పినంతగా ప్రౌఢ వయస్సులో నప్పవు.

వయస్సు పెరుగుతున్న కొద్దీ మీ పెదవులలో ఉండే కొల్లాజన్ తగ్గిపోతుంది. దీని వలన పెదవులకు సాగే గుణం తగ్గిపోతుంది. మునుపటిలా మీ పెదవులు నిండుగా ఉండవు. సన్నగా మారిన మీ పదవులపై ముదురు రంగులు అద్దుకుంటే మీ స్మైల్ లైన్స్ స్పష్టంగా కనిపిస్తాయి. కనుక లేత రంగులు, న్యూడ్స్ లేదా పింక్ రంగులు వాడి మీ పెదవులు నిండుగా కనిపించేటట్టు చేయండి..


English summary

makeup mistakes | makeup mistakes that make you look older

makeup mistakes | makeup mistakes that make you look older,Makeup is an amazing tool and skill for us to make the best of our features. But there are certain ways in which doing makeup the wrong way can make you look a lot older than you are. Check them out!
Story first published:Wednesday, March 7, 2018, 9:50 [IST]
Desktop Bottom Promotion