ఈ సింపుల్ మేకప్ చిట్కాలతో మీ పౌట్ ను మరింత నిండుగా మార్చుకోండి

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఏంజెలినా జోలీ లాంటి పెదవులు కావాలని ఎవరికి ఉండదు? ప్రతి యువతి ఆమె పెదవులను చూసి అసూయపడి, అలాంటివే తమకీ కావాలని తపిస్తారు. నిండుగా ఉన్న పెదవులు సెక్సీగా ఉంటాయని ప్రతి యువతి వాటి కోసం కలలు కంటుంది.

మనలో కొంతమంది పుట్టుకతోనే నిండు పెదవులతో పుట్టి అదృష్టవంతులవుతారు, కానీ మరికొంతమంది కొంచెం మేకప్ సాయంతో పెదవులను పెద్దగా కన్పించేట్లు చేసుకుంటారు. ఫిల్లర్స్ తో కూడిన ఖరీదైన ఇంజెక్షన్లు వాడతారు. కొంతమందికి అవి నచ్చకపోయినా మనకి నచ్చినట్లుగా కన్పించే అందాల ఉత్పత్తులను వాడి కొంతవరకు ప్రయోజనం పొందవచ్చు.

Plump Your Pout With These Simple Makeup Tricks

అది శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు, కానీ మేకప్ సాయంతో ఒక రోజు పాటు నిండైన పెదవులు లభిస్తే, ప్రయత్నించటంలో పోయేదేముంది?

చీమ కుడితే వాచినట్లుండే పెదవులు, మీ ముఖానికి మరింత అందాన్ని తెస్తాయి, ఎవరికి అవి కావాలని ఉండవు? సహజంగా కూడా పెదవులను నిండుగా చేసే పద్ధతులున్నాయి, ఎలా అంటే పెదవులకి తేనె రాయటం లేదా పెదవులను ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేయటం వంటివి. కానీ ఈరోజు మన ఆర్టికల్ లో, చిటికెలో మీ పెదవులు నిండుగా అందంగా కన్పించే కొన్ని మేకప్ చిట్కాలు అందిస్తున్నాం. చదివి తెలుసుకోండి.

1.ఎక్స్ ఫోలియేట్

1.ఎక్స్ ఫోలియేట్

మీరు ఏ పెదవుల ఉత్పత్తులు వాడే ముందైనా చేయవలసిన మొదటి పని ఎక్స్ ఫోలియేషన్. మీ మేకప్ ను ఎండిపోయిన, డల్ గా ఉండే, పగిలిపోయిన పెదవులపై వేయాలనుకోరు, కదా? ఎండిపోయిన, చిట్లిపోయిన పెదవులు తక్కువ కాంతిని ప్రతిబింబిస్తాయి దానివల్ల పెదవులు చిన్నగా కన్పిస్తాయి. ఎండిపోయిన మృతకణాలను టూత్ బ్రష్ తో రుద్ది తీసేయండి. మీ పెదవులను ఈ కింది విధంగా కూడా ఇంట్లోనే సహజంగా ఎక్స్ ఫోలియేట్ చేయవచ్చు.

రెండు చెంచాల చక్కెర (తెలుపు లేదా బ్రౌన్) మరియు 1 చెంచా కొబ్బరి లేదా ఆలివ్ నూనెను కలపండి.

మీ పెదవులపై నిమిషంపాటు మెల్లగా దాంతో రుద్దండి.

మామూలు నీటితో కడిగేయండి.

2.లిప్ బామ్ రాసుకోండి ;

2.లిప్ బామ్ రాసుకోండి ;

మంచిగా మృతకణాలన్నీ తీసేసాక మీ పెదవులను తేమకోసం మాయిశ్చరైజ్ చేయటం ముఖ్యం. దీని వలన మీరు లిప్ స్టిక్ వేసుకున్నప్పుడు మీ పెదవులు నిండుగా కన్పిస్తాయి. లిప్ బామ్ రాసాక తప్పనిసరిగా రెండు నిమిషాలు అది మీ పెదవుల్లో ఇంకేదాకా ఆగండి. మీరు ఏ రకమైన మాయిశ్చరైజ్ చేసే లిప్ బామ్ వాడవచ్చు;కాకపోతే మింట్ రుచి కలిగిన లిప్ బాం వాడటం మీ పెదవులకి మంచిది ఎందుకంటే పుదీనా రక్తప్రసరణను పెంచి మీ పెదవులను నిండుగా మారుస్తాయి.

3.లిప్ కన్సీలర్ ను రాయండి;

3.లిప్ కన్సీలర్ ను రాయండి;

లిప్ స్టిక్ చాలాసేపు పెదవులకి పట్టి వుండటం కోసం కొంచెం లిప్ కన్సీలర్ ను మీ పెదవులపై రాయండి. మీ కన్సీలర్ ను పెదవుల ఆకారానికి తగ్గట్టు, చివర్లకి కొంచెం బయటకి వచ్చేట్లా రాయండి. దీని వల్ల మీ పెదవులు లిప్ స్టిక్ రాసుకేనే ముందే నిండుగా, సహజంగా కన్పిస్తాయి. మీ చర్మరంగుకు సరిపోయే కన్సీలర్ ను వాడటం మర్చిపోవద్దు, అలా అయితేనే మీ పెదవుల అంచులను కొంచెం స్పష్టంగా కన్పించనీయకుండా చేయగలరు.

4.మన్మథుడిని విల్లును కొంచెం హైలైట్ చేయండి;

4.మన్మథుడిని విల్లును కొంచెం హైలైట్ చేయండి;

మన్మథుడి విల్లా? అదేంటి?ఇది మీ పై పెదవుల మధ్యలో కొంచెం విల్లులాగా వంగిన భాగం. మీ ఈ పై పెదవుల భాగాన్ని లిప్ లైనర్ తో హైలైట్ చేయటం వలన మీ పెదవులు స్పష్టంగా కన్పిస్తాయి.

5.లిప్ లైనర్ రాసుకోండి;

5.లిప్ లైనర్ రాసుకోండి;

మీ లిప్ స్టిక్ కన్నా కొంచెం ముదురు రంగు షేడ్ లిప్ లైనర్ ఎంచుకోండి. దీని వల్ల మీ పెదవులు స్పష్టంగా కన్పించి నిండుగా ఉన్నట్లు భ్రమను కలిగిస్తాయి. సహజమైన పెదవుల అంచులకు కొంచెం వెనకగా లిప్ లైనర్ రాయటం వలన కొంచెం ఎక్కువ నిండుదనం వస్తుంది. మీ పెదవులు మొత్తం మాత్రం లిప్ లైనర్ తో నింపేయకండి.

 6.న్యూడ్ లేదా లేత రంగు లిప్ స్టిక్ వేసుకోండి;

6.న్యూడ్ లేదా లేత రంగు లిప్ స్టిక్ వేసుకోండి;

ముదురు రంగు లిప్ స్టిక్స్ వాడవద్దు, ఇవి మీ పెదవులు డల్ గా కన్పించేట్లా చేసి, అటు నిండుగా కూడా కన్పించవు.

న్యూడ్ లేదా లేత రంగు లిప్ స్టిక్ అంటే పీచ్ లేదా పింక్ రంగుల వంటివి వాడండి. మీకు ఎక్కువ నిండుదనం కావాలంటే, ఒకే మాదిరి రంగువి రెండు లిప్ స్టిక్స్ కలపండి; అయితే ఒకటి ముదురుదై ఉండాలి మరోటి దాని మీద లేతగా ఉండాలి. ముదురు షేడ్ ను బయటవైపు పెదాలకి వేయండి మరియు లేత షేడ్ పెదవుల మధ్య భాగంలో వేయండి. రెండిటి అంచులను లిప్ బ్రష్ తో సరిచేయండి.

7.లిప్ గ్లాస్ తో పెదవులను మెరిసేలా చేయండి;

7.లిప్ గ్లాస్ తో పెదవులను మెరిసేలా చేయండి;

మెరిసే లిప్ గ్లాస్ ను లిప్ స్టిక్ పైన వేసి నిండుదనాన్ని పొందండి. మెరిసే లిప్ గ్లాస్ కాంతిని ప్రతిబింబించి మీ పెదవులు పెద్దగా కన్పించేలా చేస్తాయి. ఒక రంగులేని క్లియర్ లిప్ గ్లాస్ లేదా మీ లిప్ స్టిక్ రంగుకి సరిపోయే లిప్ గ్లాస్ ను మాత్రమే వేసుకోవటం మర్చిపోవద్దు.

8.మీ రంగు పెదవులను కన్సీలర్ తో స్పష్టం చేయండి

8.మీ రంగు పెదవులను కన్సీలర్ తో స్పష్టం చేయండి

కొంచెం కన్సీలర్ ను తీసుకొని లిప్ లైన్ అంచుల చుట్టూ లిప్ బ్రష్ సాయంతో రాయండి. కన్సీలర్ ను మెల్లగా మీ చర్మంలో ఇంకేలా రాయటం వలన సహజంగా కన్పిస్తుంది. కన్సీలర్ రాసుకోవటం వలన దృష్టి పెదవులపై పడి, అవి పెద్దగా నిండుగా కూడా కన్పిస్తాయి.

9.మీ మన్మథ విల్లుపై హైలైటర్ కూడా వాడండి

9.మీ మన్మథ విల్లుపై హైలైటర్ కూడా వాడండి

కొంచెం క్రీమ్ హైలైటర్ లేదా పౌడర్ హైలైటర్ ను పై పెదవుల మధ్య భాగంపై కూడా రాయండి. ఇది ఆ ప్రదేశంలో కాంతి ప్రతిబింబించేట్లు చేసి మీ పెదవులు నిండుగా కన్పిస్తాయి. సరిగ్గా హైలైటర్ చర్మంలో కలిసేట్లా చూడండీ,అప్పుడే సహజంగా కన్పిస్తుంది.

10.మీ కింది పెదవులను కాన్టౌర్ చేయండి ;

10.మీ కింది పెదవులను కాన్టౌర్ చేయండి ;

కాన్టౌర్ పౌడర్ ను కింది పెదవులకి రాసి నిండు పెదవుల భ్రమను కలిగించండి. కొంచెం పౌడర్ ను కింది పెదవుల వెనకగా రాసి బాగా చర్మంతో కలవనివ్వండి.

11.మీ పళ్లపై లిప్ స్టిక్ వెళ్ళనివ్వకండి

11.మీ పళ్లపై లిప్ స్టిక్ వెళ్ళనివ్వకండి

అనుకోకుండా మీ వేలు నోటిలోకి వెళ్ళటం వలనో, లేదా పెదవులపై వేలు ఒత్తుకోవడంవలనో పెదవుల లోపలికి లిప్ స్టిక్స్ వెళ్తే వాటిని వదిలించుకోండి. అదనపు లిప్ స్టిక్ అయితే మీ వేలికి అంటాలి కానీ మీ పళ్ళకు కాదు.

ఇక అన్ని సూచనలు అయిపోయాయి. మీరిక పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ నిండు పెదవులను అందమైన పౌట్ గా మార్చవచ్చు.

English summary

Plump Your Pout With These Simple Makeup Tricks

There are natural ways to plump the lips as well, like applying honey to your lips or massaging your lips with ice cubes, etc. But we'll tell you a few makeup tips to make your lips look plump and voluptuous in a jiffy. Let us take a look.