మీ బ్యాగులో ఎల్లప్పుడూ ఉంచుకోవాల్సిన త్వరగా సాయపడే మేకప్ కాస్మెటిక్ ఉత్పత్తులు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీరు మేకప్ చేసుకోటానికి,లేదా చాలా అందంగా తయారవటానికి ఎంత సమయం, శ్రమ వెచ్చించినా సరే, ఆఖరికి అసలు సమయం వచ్చేసరికి ఎక్కడో అక్కడ ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. అలాంటి సమస్యలు వచ్చినపుడు మేనేజ్ చేయటానికి మీరు మీ బ్యాగులో తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన మేకప్ సామాగ్రిని ఎప్పుడూ మీతో ఉంచుకోవాలి.

మేకప్ కి కావాల్సిన సామాను మొత్తం ఎప్పుడూ మీ వెంట వేసుకుని తిరగటంలో అర్థం లేదు, అలాంటి కేసుల్లోనే మీరు కొన్ని మాత్రమే తీసుకెళ్ళగలిగితే చాలు. ఈ కొన్ని వస్తువులు తీసుకెళ్ళటం వలన అనుకోని మేకప్ తప్పులను వెంటనే సరిచేయగలిగే అవకాశం ఉంటుంది. మా సలహా ఎప్పుడూ మీరు మీ బ్యాగులో కొన్ని ముఖ్యమైన మేకప్ వస్తువులు ఉంచుకోండి, ముఖ్యంగా మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు!

మీకు ఈ త్వరగా ఉపయోగపడే అందాల ఉత్పత్తులేంటో తెలియచేయటానికి, మరియు బ్యాగులో ఏవేవి పెట్టుకోవాలో తెలుసుకోటానికి ఈ కింద లిస్టును చదవండి.

మేకప్ రిమూవర్

మేకప్ రిమూవర్

వర్షంలో తడిసిపోయారో లేదా ఆఫీసులో చిరాగ్గా గడిచి ఆ కోపంతో మేకప్ పై శ్రద్ధ వహించలేదనుకుందాం, దానికి ఒకే చిట్కా ఉంది- మీ మొత్తం మేకప్ ను తీసేసి, ప్రశాంతంగా ఉండండి. మీరు శుభ్రంగా, నీటుగా కన్పించటం కన్నా ఎక్కువ అందం ఏదీ ఉండదు. ఇలా చేయటానికి మీకు మేకప్ రిమూవర్ ఉంటే చాలు, దాన్ని మీ మొహం మీద మెల్లగా పట్టించి శుభ్రపర్చుకోండి.

లూజ్ కాంపాక్ట్ పౌడర్

లూజ్ కాంపాక్ట్ పౌడర్

మీ పెదవులు, కళ్ళు బానే ఉన్నాయనుకుందాం, కానీ రోజు గడిచేసరికి మీ ముఖం వాడిపోయి, మీరింకా ఒక మీటింగ్ కి వెళ్ళాల్సి వస్తే ఏం చేస్తారు. చిట్కా ఏంటంటే లూజ్ కాంపాక్ట్ పౌడర్ ను వాడండి. ఒక కాటన్ ప్యాడ్ ను తీసుకుని మీ ముఖంకి మాత్రమే పౌడర్ ను అద్దండి, ఇంకేముంది, మీ మేకప్ నిముషంలో అయిపోయింది. ముఖానికి సంబంధించిన మేకప్ మొత్తంలో మేము లూజ్ కాంపాక్ట్ పౌడర్ నే ఎప్పుడూ బ్యాగులో ఉంచుకోమని సలహా ఇస్తాం ఎందుకంటే అది వాడటానికి చాలా సులువైనది మరియు మిగతావాటన్నిటికీ భిన్నమైనది. మీరు వాడే ఈ పౌడర్ మీ చర్మం రంగుకి సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి.

కాటన్ దూది లేదా టిష్యూ పేపర్

కాటన్ దూది లేదా టిష్యూ పేపర్

మీరెంత సింపుల్ గా కన్పించాలనుకున్నా లేదా మేకప్ నుంచి దూరంగా పారిపోవాలనుకున్నా, ఒక స్త్రీగా మీరు తప్పక దూది లేదా టిష్యూ పేపర్ ను మీ బ్యాగులో ఉంచుకోవాలి. ఇదివరకే చెప్పినట్లు, మేకప్ రిమూవర్ ను వాడటానికి కూడా కాటన్ దూది అవసరం. ముఖంపై జరిగే చిన్నచిన్న మేకప్ తప్పులను కాటన్ దూదితో సరిచేయవచ్చు. కాటన్ దూదిని బ్యాగులో పెట్టుకోవటం తలకాయనొప్పి అనుకునే వారు టిష్యూని ప్రయత్నించవచ్చు. ఐలైనర్ తప్పుగా వేయటం నుంచి ఎక్కువ జిడ్డుకారుతున్న చర్మం వరకు- ఒక కాటన్ దూది లేదా టిష్యూతో తుడిచిపారేయండి.

పెదవుల ఉత్పత్తి

పెదవుల ఉత్పత్తి

మీరు తింటారు, మాట్లాడతారు లేదా ముద్దుకూడా పెట్టుకుంటారు, వీటన్నిటిలో మొదట ప్రభావం పడేది మీ పెదవుల రంగుపైనే. అది పోతుంది. సరైన పెదవుల ఉత్పత్తిని బ్యాగులో ఉంచుకునే చిట్కా ఇదిగో. లిప్ స్టిక్ ఒకటి ఉంటే చాలదు. మీరు తప్పనిసరిగా బ్యాగులో ఉంచుకోవాల్సింది లిప్ బామ్ కూడా. దానితో ఎప్పుడూ పెదవులను తేమగా, పోషణనివ్వవచ్చు. లిప్ స్టిక్ తర్వాతది లిప్ లైనర్. అందుకని ఎప్పుడు మీ పెదవులు నిర్జీవంగా, టచప్ అవసరమైనట్టు కన్పిస్తాయో, సరైన కాస్మెటిక్స్ తీసుకుని మళ్ళీ సరిచేయండి.

ఫర్ఫ్యూమ్ లేదా ఏదన్నా సుగంధ ద్రవ్యం

ఫర్ఫ్యూమ్ లేదా ఏదన్నా సుగంధ ద్రవ్యం

అలంకరించుకోవటంతో పాటు, మీ వాసన కూడా తాజాగా ఉండాలి. అయితే చిన్న పర్ఫ్యూమ్ లేదా డియోను మీ బ్యాగులో జతచేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడైనా వాష్ రూంకి వెళ్ళి మీ మీద స్ప్రే చేసుకుంటే చాలు- మీరు అందర్నీ మాయలో పడేస్తారు. మీరు ప్రతిరోజూ వివిధ రకాల ఫర్ఫ్యూమ్స్ ప్రయత్నించవచ్చు, అలా మీ ప్రత్యేకమైన వాసనతో మీకు దగ్గరివారు ఆకర్షించబడతారు.

జుట్టుకి సంబంధించిన ఉత్పత్తులు

జుట్టుకి సంబంధించిన ఉత్పత్తులు

ఏ ఇతర మేకప్ లాగానే, జుట్టు కూడా కొన్నిసార్లు దారుణంగా విఫలమై సరిగా కన్పడదు. మీ జుట్టును అలాంటి సమయాలలో సరైన జుట్టు ఉత్పత్తులతో మేనేజ్ చేయండి. మీ జుట్టు పొడవు మరియు రకంబట్టి హెయిర్ క్లిప్పులు, స్క్రంచీ వంటివాటిని వాడండి. కావాల్సినన్ని బాబీపిన్నులు, దువ్వెన బ్యాగులో పెట్టుకోవడం మర్చిపోవద్దు. హెయిర్ స్టైలింగ్ చేయించుకునే రోజు హెయిర్ స్ప్రే కూడా బ్యాగులో ఉంచుకోవటం మంచిది.

ఐలైనర్ ,కాటుక లేదా మస్కారా

ఐలైనర్ ,కాటుక లేదా మస్కారా

ఇంతకుముందే చెప్పినట్లు, మీరు అన్నిరకాల మేకప్ తప్పులకు సిద్ధపడి ఉండాలి, ముఖ్యంగా కళ్ళకి సంబంధించి మరీనూ. ఐలైనర్ చెదిరిపోవటమో లేదా కాటుక కరిగిపోయి నల్ల వలయాల ప్రదేశం మొత్తం వ్యాపించిపోవటమో జరగవచ్చు. మీ ఇంట్లో ఉన్న అనేక కంటికి సంబంధించిన పెద్ద లిస్టు కాస్మెటిక్స్ ఉండవచ్చు కానీ మీ బ్యాగులో తప్పక ఒక మస్కారా, ఐలైనర్ మరియు కాటుక ఉండాలి. కంటి మేకప్ తప్పులు జరిగినప్పుడు, ఆ ప్రదేశాన్ని శాస్త్రీయంగా పరీక్షించబడ్డ మేకప్ రిమూవర్ తో శుభ్రపర్చండి మరియు అప్పుడు మళ్ళీ ఐలైనర్ , కాటుక లేదా మస్కారా సాయంతో మేకప్ చేసుకోండి.

పాకెట్ అద్దం

పాకెట్ అద్దం

మీరేదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు లేదా పగలంతా ప్రయాణించాల్సి ఉంటుందని తెలిసినప్పుడు, ఆ సమయాలకి పాకెట్ అద్దం తీసుకెళ్ళటం అవసరం. లేడీస్ వాష్ రూం ఖాళీగా లేకపోతే, లేదా మీరున్నచోట ఆ సౌకర్యమే లేకపోతే, మీ పాకెట్ అద్దాన్ని బయటకి తీసి మీ మేకప్ ను, తయారీని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. పాకెట్ అద్దం ముఖ్యంగా ప్రయాణిస్తున్నప్పుడు చాలా సాయపడుతుంది.

చేతులకై సానిటైజర్

చేతులకై సానిటైజర్

చాలామంది దీన్ని కాస్మెటిక్ అనటానికి ఒప్పుకోరు, కానీ ఇది అన్ని మేకప్ దుకాణాల్లో దొరుకుతోంది మరియు పైన చెప్పిన త్వరగా ఉపయోగపడే అన్ని అందాల సామాగ్రిలోకెల్లా చాలా ముఖ్యమైనది. చేతులు ఎప్పుడైనా మురికిగా మారవచ్చు, మీ మేకప్ ను మళ్ళీ సరిచేసుకుంటున్నప్పుడు, మీరు చేతుల సానిటైజర్ వాడి తీరాలి. పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఈ హ్యాండ్ సానిటైజర్ ఎప్పుడూ వారితో ఉంచుకోవటం తప్పనిసరి.

English summary

Quick Fix Beauty Tools And Makeup Cosmetics | Beauty Tools And Makeup Cosmetics | Makeup In Bag

Makeup is not so simple that you do it at home and it stays all day long. Makeup bizzares and blunders do keep happening all day long. In order to ensure that the makeup is in place, women must carry these quick fix beauty tools and makeup cosmetics and look their best always.
Story first published: Tuesday, February 27, 2018, 11:00 [IST]