For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బ్యాగులో ఉండాల్సిన 6 తప్పనిసరి మేకప్ సామాను

By Deepthi Tas
|

ఇది సెలవల సీజన్ మరియు జిమ్ కి వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో ఎవరిని కలుస్తారో మీకే తెలీదు. అన్నివేళలా మీరు అందంగా కన్పించటం కుదరదు. కానీ కొన్ని మేకప్ ఉత్పత్తులను మీతోపాటే ఎల్లప్పుడూ ఉంచుకోవటం మంచిది. ప్రతి అమ్మాయి లేదా యువతి తమ బ్యాగుల్లో కొన్ని మేకప్ ఉత్పత్తులను ఉంచుకోటం వలన మేటిగా అందంగా అప్పటికప్పుడు కన్పించటానికి ప్రయత్నించవచ్చు.

పార్టీకి 5 నిమిషాల్లో వెళ్ళాల్సి వచ్చినా లేదా మీ డేట్ ను కలవడానికి లేటు అయినా ఈ తప్పనిసరి మేకప్ సామాను సాయపడతాయి. కొందరు తమ బ్యాగుల నిండా మేకప్ వస్తువులు నింపేస్తే, మరికొంతమంది అస్సలు ఏమీ పెట్టుకోరు. కొన్ని మేకప్ వస్తువులు పెట్టుకోవడం వలన నష్టం ఏమీ రాదు.

మీ బ్యాగులో పెట్టుకోవాల్సిన మేకప్ వస్తువులను ఇక్కడ పొందుపరిచాం. ఇవి ఎప్పుడూ మీ దగ్గర వుండాలి! ఈ వస్తువులు ఇప్పటికే మీరు బ్యాగులో ఉంచుకుంటున్నారో లేదో తెలుసుకోడానికి మరింత కింద చదవండి.

బిబి క్రీం

బిబి క్రీం

ఈ చిన్న ట్యూబ్ ఫౌండేషన్ కి మంచి ప్రత్యామ్నాయం. బిబి క్రీం మీ ముఖానికి తేమను అందించి, మచ్చలను మీడియంగా కవర్ చేస్తుంది. ఈ వస్తువు ఎంత చిన్నదంటే, మీ బ్యాగులో అస్సలు స్థలం కూడా ఎక్కువ తీసుకోదు. త్వరగా కొంచెం ట్యూబులోంచి క్రీం తీసి ముఖానికి రాసుకుంటే చాలు, ఇక మీరు తయారయిపోయినట్టే! మీ పర్సులో పెట్టుకోవాల్సిన ముఖ్య వస్తువులలో ఇది ఒకటి.

ప్రెస్డ్ పౌడర్

ప్రెస్డ్ పౌడర్

మీ ముఖంపై జిడ్డును ప్రెస్డ్ పౌడర్ తో తొలగించివేయండి. ఈ మేకప్ వస్తువును మీ పర్సులో ఉంచుకుని టచప్ ల కోసం వాడండి లేదా మీ ముఖానికి మాటె లుక్ ఇవ్వడం కోసం వాడండి.

లిప్ స్టిక్

లిప్ స్టిక్

మీ పాత స్నేహితులు ఎక్కడ ఎదురుపడతారో మనం చెప్పలేం ( మీ రహస్య క్రష్ కూడా). మీకు ఎంతో ఇష్టమైన తియ్యని లిప్ స్టిక్ లేదా లిప్ గ్లాస్ తో ఎప్పుడూ రెడీగా ఉండటం మంచిది. త్వరగా దీన్ని వేసేసుకుంటే నీటుగా, ఠీవిగా కన్పిస్తారు. ఇది కూడా మీతో పాటు ఉండాల్సిన మేకప్ వస్తువుల్లో ఒకటి.

ఐలాష్ కర్లర్

ఐలాష్ కర్లర్

మీ బ్యాగులో మస్కారాను తీసుకెళ్తూ విసుగొస్తోందా? అయితే మీ బ్యాగులో ఐలాష్ కర్లర్ ను పెట్టుకుని మస్కారా బదులు వాడండి. ఈ సింపుల్ మేకప్ వస్తువుతో మీ కనుపాపలకి సహజమైన కర్ల్స్ ను అందివ్వండి.

కాజల్/కాటుక

కాజల్/కాటుక

కరిగిపోని, చుట్టూరా అతుక్కోని కాటుక లేదా కాజల్ ను మీ కళ్ళ అందం కోసం మీతోనే ఉంచుకోండి. అది వెంటనే కళ్లను కాంతివంతంగా, అలసట కన్పించనివ్వకుండా చేస్తుంది.

పర్ఫ్యూమ్

పర్ఫ్యూమ్

పార్టీలో మీ నుంచి దుర్వాసన రావాలని మీరు కోరుకోరు. అందుకని మీతో ఎప్పుడూ ఒక మినీ ఫర్ఫ్యూమ్ బాటిల్ ఉంచుకోండి. మీకు వాసన హాయిగా రానప్పుడల్లా దాన్ని తీసి కాస్త స్ప్రే చేసుకోండి! మీ బ్యాగులో పెట్టుకోవాల్సిన ముఖ్య వస్తువుల్లో ఇది ఒకటి.

English summary

Makeup Products To Keep In Your Purse | What To Put In A Makeup Bag | Makeup Bag Essentials

We have a collated makeup bag essentials that you must keep, ALWAYS! Read on to find out whether you carry these makeup products in your purse or not.
Desktop Bottom Promotion